ఆ మురికి ఫోటోలు ఇక కనపడవ్!

Posted By: Staff

ఆ మురికి ఫోటోలు ఇక కనపడవ్!

లండన్: ఫేస్‌బుక్ యూజర్లుకు శుభవార్త! మీ అకౌంట్‌కు సంబంధించి దిద్దుబాటు చర్యగా ఇప్పటి వరకు మీరు డిలీట్ చేసిన ఫోటోలు ప్రొఫైల్‌లో మాత్రమే మాయమయ్యేవి. ఒకవేళ ఆ లింక్‌ను అప్పటికే ఎవరైనా సేవ్ చేసి పెట్టుకుంటే ఉపయోగం లేకుండా పోయేది. దీనిపై నిరసనలు వెల్లువెత్తడంతో ఫేస్‌బుక్ నిర్వాహకులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. యూజర్లు డిలీట్ చేసిన ఫొటోలు.. వారి ప్రొఫైల్ నుంచే కాకుండా తమ సర్వర్‌లో సైతం 14 నుంచి 30 రోజుల్లోగా పూర్తిగా చెరిగిపోయేలా సాఫ్ట్‌వేర్‌ను మార్చారు.

ఇండియాలో ఫేస్‌బుక్ దూకుడు!

భారత్‌లో ఫేస్‌బుక్ వినియోగం అనూహ్య రీతిలో పెరుగుతోందని ఫేస్‌బుక్ ఇండియా సంచాలకులు(ఆన్‌లైన్ ఆపరేషన్స్) కీర్తిగా రెడ్డి తెలిపారు. ఫేస్‌బుక్‌ను అనుసరిస్తున్నవారు అత్యధికంగా డెస్క్‌టాప్ కంటే మొబైల్ ఫోన్‌ల ద్వారానే అప్‌డేట్‌లను సాగిస్తున్నారని చెప్పారు. 2010లో భారత్‌లో 80 లక్షలుగా ఉన్న ఫేస్‌బుక్ యూజర్ల సంఖ్య ప్రస్తుతం 5 కోట్లకు పెరిగిందని ఈ సందర్భంగా వెల్లడించారు. దేశీయ యూజర్లను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక ఫీచర్లను అందుబాటులోకి తెస్తామని కీర్తిగా రెడ్డి వెల్లడించారు. 13 ఏళ్ల లోపు పిల్లలు ఫేస్‌బుక్ చూడకూడదని, అలా చూస్తున్నట్లు తేలితే తగిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting