ట్విట్టర్‌ లాగే, డొనాల్డ్ ట్రంప్‌కు షాకిచ్చిన ఫేస్‌బుక్. 

By Gizbot Bureau
|

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఫేస్ బుక్ షాకిచ్చింది. తమ నిబంధనలను అతిక్రమిస్తున్నప్పటికీ.. ”ఆసక్తికరంగా’ ఉండే పోస్టులకు 'ట్యాగ్ 'లు యాడ్ చేస్తామని ప్రకటించింది. ట్రంప్ పోస్ట్ చేసే ట్వీట్ల విషయంలో ట్విటర్ కూడా అలాగే వ్యవహరిస్తుందని, అందువల్ల తాముకూడా దాన్ని ఫాలో అవుతామని ఫేస్ బుక్ సీఈఓ మార్క్ జుకర్ బెర్గ్ వెల్లడించారు. అదే సమయంలో ద్వేషాన్ని రెచ్చగొట్టే యాడ్ లను నిషేధిస్తామని అన్నారు. జాత్యహంకారాన్ని, ద్వేషం లేదా హింసను ప్రేరేపించే కంటెంట్ ను ఫేస్ బుక్ నిషేధించాలన్న డిమాండ్ పెరుగుతోందన్నారు.

భంగం కలిగించే పోస్టులను

భంగం కలిగించే పోస్టులను

ప్రత్యేకంగా ఒక దేశాన్ని, వ్యక్తులను, వారి రంగును, కుల మతాలను, జెండర్ ఐడెంటిటీని విమర్శించేట్టు ఉండే..లేదా వ్యక్తుల భద్రత, వారి ఆరోగ్యానికి భంగం కలిగించే పోస్టులను బ్యాన్ చేస్తామని ఫేస్ బుక్ సీఈఓ మార్క్ జుకర్ బెర్గ్ ట్వీట్ చేశారు. ఇది తమ కొత్త పాలసీ అన్నారు. ఈ విధమైన కంటెంట్ తమ సంస్థ ప్రతిష్టకు భంగం కలిగిస్తుందన్నారు. 

హింసను రెచ్చగొట్టే పోస్టులు

హింసను రెచ్చగొట్టే పోస్టులు

అమెరికాలో గత మే 25 న నల్లజాతీయుడు జార్జి ఫ్లాయిడ్ హత్య అనంతరం దేశంలో పెద్ద ఎత్తున ఆందోళనలు రేగాయి. ఆ సందర్భంలో నిరసనకారులను ఉద్దేశించి ట్రంప్ చేసిన ట్వీట్లను ఫేస్ బుక్ వంటి సాధనాలు పోస్ట్ చేశాయి. అయితే అవి జాతి వివక్షను, హింసను రెచ్చగొట్టేవిగా ఉన్నాయని వాటిని తొలగించాలని అనేకమంది కోరినప్పటికీ ఫేస్ బుక్ అందుకు నిరాకరించింది. రాజకీయ నాయకుల నుండి వడపోత లేని ప్రకటనలు వినడానికి ప్రజలు అర్హులని ఫేస్‌బుక్ తెలిపింది.

సంస్థ వైఖరి పట్ల నిరసన
 

సంస్థ వైఖరి పట్ల నిరసన

ఇలాంటి పోస్టులను తొలగించేందుకు మార్క్ జుకర్ బెర్గ్ అంగీకరించలేదు. దీంతో తమ సంస్థ వైఖరి పట్ల నిరసన వ్యక్తం చేస్తూ పలువురు ఉద్యోగులు రాజీనామాలు చేశారు. తాజాగా జుకర్ బెర్గ్ తమ సంస్థ ప్రతిష్ట మసక బారుతున్నట్టు భావిస్తున్నట్టు కనిపిస్తోంది. అందువల్లే నిబంధనలను అతిక్రమించే కంటెంట్ కి ఫుల్ స్టాప్ పెడతామన్నారు. అయితే ‘చదవదగిన' వార్తలకు ట్యాగ్ లు జత చేస్తామని, వీటి విషయంలో యూజర్లు తమ కంటెంట్ ని షేర్ చేసుకోవచ్ఛునని ఆయన పేర్కొన్నారు.

ట్రంప్ కు, ఆయన మద్దతుదారులకు ఆగ్రహం

ట్రంప్ కు, ఆయన మద్దతుదారులకు ఆగ్రహం

కాగా-ట్విటర్ చేసిన ‘సరికొత్త ప్రయోగం' ట్రంప్ కు, ఆయన మద్దతుదారులకు ఆగ్రహం కలిగిస్తోంది. తాజాగా ఫేస్ బుక్ కూడా ట్విట్టర్ బాటలో పయనిస్తోంది. కాగా అమెరికాలో త్వరలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఇది ఎటువంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి. 

Best Mobiles in India

English summary
facebook to follow strict rules on posts,even trump's posts can be flagged if rules are broken.  

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X