ఎనిమిదో ఏటలోకి ప్రవేశించిన ఫేస్‌బుక్

Posted By: Staff

ఎనిమిదో ఏటలోకి ప్రవేశించిన ఫేస్‌బుక్

 

పంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందిన పాపులర్ సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్ ‘ఫేస్‌బుక్’ ఎనిమిదో ఏటలోకి ప్రవేశించింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం ఫేస్‌బుక్‌లో సుమారు 845 మిలియన్ల వినియోగదారులు ఉన్నారు. 2004 ఫిబ్రవరి 4 తేదిన హార్వర్డ్ యూనివర్సిటిలోని డార్మిటరీ రూమ్‌లో మార్క్ జూకర్స్ బర్గ్ ఫేస్‌బుక్‌ను ప్రారంభించారు. ఆతర్వాత కొద్దికాలంలో అత్యంత ప్రజాదరణ కలిగిన వెబ్‌సైట్‌గా ఫేస్‌బుక్ చరిత్ర సృష్టించింది.

ఫేస్‌బుక్ వెబ్‌సైట్‌ను రూమ్‌మేట్స్ ఎడ్వార్డో సావెరిన్, డస్టిన్ మాస్కోవిట్జ్, క్రిస్ హ్యూస్‌లతో కలిసి మార్క్ జూకర్స్ బర్గ్ ఆరంభించారు. తొలుత ‘దిఫేస్‌బుక్.కామ్’ అనే పేరుతో ప్రారంభించి.. ఫిబ్రవరి 4, 2008వ సంవత్సరంలో ‘ఫేస్‌బుక్.కామ్’గా మార్చారు. అమెరికా జనాభాలో 41.6 శాతం మందికి ఫేస్‌బుక్‌లో అకౌంట్ ఉన్నట్టు తాజా సర్వే తెలిపింది. అమెరికా తర్వాత భారత్‌లో ఫేస్‌బుక్‌ నమోదు 132 శాతం ఉందని నిర్వాహకులు వెల్లడించారు. జనవరి 2009వ సంవత్సరంలో అత్యధిక జనాభా ఉపయోగించే సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్‌గా ఫేస్‌బుక్ రికార్డు సృష్టించింది.

ఇలా దినదినాభివృద్ది చెందుతున్న ఫేస్‌బుక్ త్వరలో $75-100 బిలియన్ల విలువ కలిగిన బహిరంగ – లిస్టెడ్ కంపెనీగా అవతరించనుందని సోమవారం ఓ న్యూస్ ఛానల్ అధికారకంగా తెలిపింది. ఫైనాన్సియల్ టైమ్స్, వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రచురించిన కధనం ప్రకారం బుధవారం ఫేస్‌బుక్ అమెరికా ఫైనాన్సియల్ వాచ్‌డాగ్‌లో ఫైల్ పేపర్స్‌ని సమర్పించనుంది.

వాల్‌స్టీట్‌లో ఫేస్‌బుక్ ఈ సంవత్సరం ఓ గొప్ప భాగస్వామ్యం అమ్మకాలుగా ఉండడంతో పాటు, సుమారు $ 10 బిలియన్ సేల్స్‌ని పెంచుతుందని తెలిపారు. దీనితో పాటు ఫేస్‌బుక్ యొక్క ప్రారంభ పబ్లిక్ ఆఫరింగ్ (IPO) గత నెలలు నుండి మార్కెట్లోకి వస్తున్నట్లు రూమర్స్ వచ్చాయి. ఈ విషయంపై మీడియా మొగల్ రూపెర్ట్ ముర్డోచ్ ట్విట్టర్‌లో “ఫేస్‌బుక్ ఒక తెలివైన అచీవ్మెంట్‌ని సాధించింది, కానీ $75 – $100బిలియన్లు అంటే.. ఆపిల్‌తో పోల్చితే చాలా తక్కువగా ఉంది.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot