ఫేస్‌‌బుక్‌తో ట్విట్టర్ స్నేహాం, గూగుల్‌లో కలవరం

Posted By: Super

ఫేస్‌‌బుక్‌తో ట్విట్టర్ స్నేహాం, గూగుల్‌లో కలవరం

శాన్‌ఫ్రాన్సికో: సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్ ఫేస్‌బుక్, మైక్రో బ్లాగింగ్ వెబ్‌సైట్ ట్విట్టర్ రెండు కూడా త్వరలో ఒకటి కానున్నాయని రూమర్ ఇంటర్నెట్లో సంచరిస్తుంది. ఇంటర్నెట్లో హాల్ చల్ చేస్తున్న ఈ రూమర్ ప్రకారం ఈ రెండు కూడా ప్రస్తుతం యూజర్స్‌కు సోషల్ నెట్ వర్కింగ్ అనుభవాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 850 మిలియన్ యూజర్స్ కోసం ఈ రెండు కంపెనీలు కలసి మరిన్ని సేవలను అందించడం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు సమాచారం.

త్వరలో ఫేస్‌బుక్ యూజర్స్ ఎవరైత్ ఉన్నారో వారు త్వరలో డైరెక్టుగా ట్విట్టర్‌లో ఉన్న తమ ప్రొఫైల్‌కి కనెక్ట్ అయ్యే విధంగా ఫీచర్‌ని పోందుపరచడం జరుగుతుంది. ఇంటర్నేషనల్ బిజినెస్ టైమ్స్ అందించిన రిపోర్ట్ ప్రకారం ఫేస్‌బుక్ ఎకౌంట్ల నుండి ట్విట్టర్ ఎకౌంట్లను డైరెక్టుగా అప్ డేట్ చేసుకునే వెసులుబాటుని కూడా కల్పించడం జరిగింది. ఈ విషయాన్ని ఫేస్‌బుక్ కూడా అధికారకంగా ధృవీకరించినప్పటికీ, ఖచ్చితమైన డేట్‌ని మాత్రం తెలుపలేదు. ఈ రెండింటి కలయికతో సెర్చ్ ఇంజన్ గెయింట్ గూగుల్ మనసులో కొంచెం కలవరం మొదలైందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot