ఫేస్‌బుక్ సరికొత్త ఫోటో ఆల్బమ్ ఫీచర్!

Posted By:

అర్థవంతమైన ఫోటో వెయ్యి పదాలతో సమానమంటారు. ఇటువంటి ప్రయత్నానికే సోషల్ నెట్‌వర్కింగ్ దిగ్గజం ఫేస్‌బుక్ పూనుకుంది. ప్రపంచపు అతిపెద్ద సామాజిక సంబంధాల వెబ్‌సైట్ ఫేస్‌బుక్ సోమవారం తన సరికొత్త ఫీచర్ ‘షేరుడ్ ఫోటో ఆల్బమ్స్'(shared photo albums)ను ప్రకటించింది. ఈ ప్రత్యేక ఫీచర్ ద్వారా ఫేస్‌బుక్ వినియోగదారుడు తన అకౌంట్‌లో ఆల్బమ్‌ను సృష్టించుకుని 50 మందికి షేర్ చేసుకోవచ్చు. యాక్సిస్ పొందిన ఆ 50 మంది "కంట్రిబ్యూటర్లు" సదరు ఆల్బమ్‌లో తమకు సంబంధించిన 200 ఫోటోలు వరకు షేర్ చేసుకోవచ్చు.

ఫేస్‌బుక్ సరికొత్త ఫోటో ఆల్బమ్ ఫీచర్!

ఈ సరికొత్త ఫీచర్‌లో పబ్లిక్, ఫ్రెండ్స్ అండ్ కంట్రిబ్యూటర్స్, కంట్రిబ్యూటర్స్ మాత్రమే అనే మూడు ప్రైవసీ సెట్టింగ్‌లు ఉంటాయి. ఈ ప్రైవసీ సెట్టింగ్‌లు ఆల్బమ్ రూపకర్తకు తాను షేర్ చేసిన ఫోటోలు ఇంకా గ్రూప్స్ పట్ల పూర్తి నియంత్రణా హక్కులను కలిగిస్తాయని ఫేస్‌బుక్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ బాబ్ బాల్డ్విన్ తెలిపారు. ఆల్బమ్ సృష్టికర్తలు తమ ఆల్బమ్‌లోని ఫోటోలను డిలీట్ లేదా ఎడిట్ చేసుకునే అవకాశం ఉంది.

వారంలో 50 గంటల పాటు ఫేస్‌బుక్‌కు అతుక్కుపోతున్నారా..?, ఫేస్‌బుక్ వినియోగం ఓ వ్యసనంలా మారిందా...?, మీ మితిమీరిన సోషల్ నెట్‌వర్కింగ్ అలవాటును పరిధిలో ఉంచేందుకు ఎమ్ఐటీలో డాక్టరేట్ పట్టా పొందిన ఇద్దరు వ్యక్తులు ఓ సరికొత్త కీబోర్డును సృష్టించారు.

మీ ఫేస్‌బుక్ వినియోగం శృతిమించినట్ల ఈ కీబోర్డ్ గుర్తించినట్లయితే ప్రమాదరహితమైన షాక్‌లను కలగజేస్తుంది. దింతో కీబోర్డు పై వేళ్లు పెట్టేందుకు ఎవరైనా జంకాల్సిందే. ఫేస్‌బుక్ వ్యసనాన్ని తగ్గించే కీబోర్డ్! యువతలో మితిమీరుతున్న ఫేస్‌‍బుక్ వినియోగాన్ని తగ్దించే క్రమంలో ఎమ్ఐటీ డాక్టరేట్ అభ్యర్థులైన రాబర్ట్ ఆర్.మోరిస్ ఇంకా డాన్ మెక్‌డఫ్‌లు సరికొత్త కీబోర్డు డివైజ్‌ను రూపొందించారు. ఈ కీబోర్డ్ డివైజ్ మీరు అధికంగా శోధించే వెబ్‌సైట్‌లను పర్యవేక్షిస్తుంది. వాటి పై మీ వినియోగం శృతిమించిన పక్షంలో ఆన్-స్ర్కీన్ అలర్ట్ సిగ్సళ్లు కీబోర్డుకు చేరి ఓ రకమైన షార్ట్ సర్క్యూట్‌ను మీ చేతి వేళ్లకు కలగజేస్తాయి. దీంతో కొంత సేపటి వరకు మీరు ఆ వైబ్‌సైట్‌లో కార్యకలాపాలు సాగించలేరు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

గిజ్‌బాట్ ఫోటోగ్యాలరీ మీ కోసం.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot