ఇండియాలోని ఫేస్‌బుక్‌లో ఆఫీసులో త్వరలో రిక్రూట్‌మెంట్

Posted By: Super

ఇండియాలోని ఫేస్‌బుక్‌లో ఆఫీసులో త్వరలో రిక్రూట్‌మెంట్

ఇండియాలో ఫేస్‌బుక్ లాంఛనంగా ప్రారంభించి ఒక సంవత్సరం పూర్తి అయిన సందర్బంలో హైదరాబాద్‌లో ఉన్నటువంటి ఫేస్‌‍‌‌బుక్ ఆఫీసు వ్యవహారాలను ఆంధ్రప్రదేశ్‌లోని టైర్-2 సిటీలకు విస్తరించాలని ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఈ సందర్బంలో హైదరాబాద్ లోని ఫేస్‌‍‌‌బుక్ ఆఫీస్ మొదటి వార్షికోత్సవానికి వచ్చినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచం మొత్తం మీద అతి త్వరగా డెవలప్ అయినటువంటి సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్ ఫేస్‌‍‌‌బుక్ అభివృద్దికి తమ ప్రభుత్వం చేయూతని అందిస్తుందని అన్నారు.

ఫేస్‌‍‌‌బుక్ హైదరాబాద్ ఆఫీస్ ప్రపంచం మొత్తం మీద ఉన్నటువంటి ఫేస్‌‍‌‌బుక్ యూజర్స్, అడ్వర్టైజర్స్‌లకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. దీనితోపాటు ఇప్పటివరకు ఫేస్‌‍‌‌బుక్ హైదరాబాద్ ఆఫీసులో మొత్తం ఉద్యోగుల సంఖ్య 100పైగా ఉండగా త్వరలో సేల్స్ ఆపరేటన్స్ స్టాఫ్, యూజర్ ఆపరేషన్స్ టీమ్, ఫైనాన్సియల్ రిక్యూర్మెంట్ టీమ్‌ని త్వరలో రిక్రూట్ చేయనున్నట్లు తెలిపారు. సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్ ఫేస్‌‍‌‌బుక్ ఇప్పటి వరకు ప్రపంచం మొత్తం మీద 600మిలియన్ యూజర్స్‌ని కలిగి ఉందన్నారు.

ఇండియా ఫేస్‌‍‌‌బుక్ అభివృద్ది రేటులో పయనిస్తుందని తెలిపారు. ఇండియాలో ఫేస్‌‍‌‌బుక్ ప్రారంభించినప్పుడు 17మిలియన్ జనాభా ఫేస్‌‍‌‌బుక్‌కి కనెక్ట్ కాగా ఒక సంవత్సరం పూర్తి అయ్యేసరికే ఆ సంఖ్య 25మిలియన్ జనాభాకు చేరిందన్నారు. ప్రస్తుతానికి ఫేస్‌‍‌‌బుక్ ఏడు ప్రాంతీయ భాషల(తెలుగు, హింది, పంజాబి, తమిళం, బెంగాళీ, మళయాళం, నేపాలి)లో తన సేవలను అందిస్తుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot