ఈ Facebookకు ఏమైంది.. యూజ‌ర్ల ఫీడ్‌ల‌న్నీ విచిత్ర పోస్టుల‌తో నిండాయి!

|

మెటాకు చెందిన ప్ర‌ముఖ సామాజిక మాధ్య‌మం Facebook తాజాగా మ‌రోసారి వార్త‌ల్లో నిలిచింది. వినియోగ‌దారుల ఫీడ్‌లు చాలా వ‌ర‌కు ఈ రోజు స్పామ్ పోస్ట్‌ల‌తో నిండిపోయాయి. దీంతో ఫేస్‌బుక్‌లో ఈ స్పామ్ పోస్టుల వ్య‌వ‌హారం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ విచిత్ర‌మైన ఫేస్‌బుక్ బ‌గ్ ప‌లువురిని కొంత ఇబ్బందుల‌కు గురి చేసింది. చాలా మంది వినియోగదారులు తమ స్పామ్ Facebook ఫీడ్ స్క్రీన్‌షాట్‌లను నెట్టింట షేర్ చేయడంతో ఈ సమస్య ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది.

 
ఈ Facebookకు ఏమైంది.. యూజ‌ర్ల ఫీడ్‌ల‌న్నీ విచిత్ర పోస్టుల‌తో నిండాయి!

అంతేకాకుండా, గ్లోబల్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Facebook డౌన్ అయిందని వినియోగదారులు డౌన్‌డెటెక్టర్‌లో ఫిర్యాదు చేశారు. సెలబ్రిటీల స్పామ్ పోస్ట్‌లు మరియు ఫేస్‌బుక్‌లో చోటుచేసుకున్న స‌మ‌స్య‌ ఒకే బగ్‌కి సంబంధించిన‌వి అయి ఉండొచ్చ‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు.

Facebook యూజ‌ర్ ఫీడ్‌లో బ‌గ్ స్పామ్స్‌:
ఆగస్టు 24, IST ఉదయం 11 గంటల ప్రాంతంలో ఫేస్‌బుక్ యూజ‌ర్ల‌కు ఫీడ్‌లో ప‌లు సెల‌బ్రిటీల స్పామ్ పోస్ట్‌లు కనిపించాయి. దాదాపు మధ్యాహ్నం 1 గంటల సమయంలో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూజర్లు తమ Facebook ఫీడ్‌ సెలబ్రిటీల పోస్ట్‌లతో నిండిన‌ట్లు గుర్తించడంతో సమస్య గరిష్ట స్థాయికి చేరుకుంది. ఇందులో లేడీ గాగా, నిర్వాణ మరియు ది బీటిల్స్ వంటి ప్రముఖులకు సంబంధించిన విచిత్రమైన పోస్ట్‌లు ఉన్నాయి.

Facebook సెలబ్రిటీ పోస్ట్‌లు మొదట గ్లోబ‌ల్‌గా గుర్తించబడ్డాయి, ఆ తర్వాత చాలా మంది భారతీయులు కూడా తాము అదే స‌మ‌స్య‌ను ఎదుర్కోంటున్న‌ట్లు నెట్టింట పోస్టుల వ‌ర్షం కురిపించారు. యూజ‌ర్ల ఫీడ్‌ల‌లో ప్ర‌త్య‌క్ష‌మైన స్పామ్ పోస్టుల్లో గ్లోబ‌ల్‌గా అగ్ర ప్రముఖులకు సంబంధించినవి స‌హా, PayPal విరాళాలు మరియు క్రిప్టోకరెన్సీ ప్రాజెక్ట్‌ల కోసం ప్రమోషన్‌ల చిత్రాలతో పాటు అనేక‌మైన‌వి ఉన్నాయి.

ఈ Facebookకు ఏమైంది.. యూజ‌ర్ల ఫీడ్‌ల‌న్నీ విచిత్ర పోస్టుల‌తో నిండాయి!

Facebook ఇలా ఎందుకు జ‌రిగింది!
ఇప్ప‌టివ‌ర‌కైతే, Facebook ఈ స్పామ్ బగ్ విషయానికి సంబంధించిన స‌మాచారాన్ని అధికారికంగా క్లెయిమ్ చేయలేదు. క్యూరియస్ బగ్ సమస్యకు కారణమై ఉండవచ్చని చాలా నివేదికలు సూచిస్తున్నాయి, అయితే దీని వెనుక హ్యాకర్లు ఉండవచ్చని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఫేస్‌బుక్ స్పామింగ్ సమస్య ప్రస్తుతం పరిష్కరించబడిందని పేర్కొంది. మెటా స్టేటస్ డ్యాష్‌బోర్డ్‌లో వాటికి సంబంధించిన అప్‌డేట్‌లు లేదా రిపోర్ట్‌లు కూడా లేవు.

ట్రెండింగ్‌లో సెల‌బ్రిటీలకు సంబంధించిన స్పామ్ పోస్టులు:
Facebook స్పామ్‌ పోస్ట్‌లకు సంబంధించిన వ్య‌వ‌హారాన్ని ప‌లువురు యూజ‌ర్లు మీమ్స్ రూపంలో ట్విట్టర్‌లో ముంచెత్త‌గా అవి ఫ‌న్నీగా మారాయి. ప్ర‌స్తుతం ఆ మీమ్స్ ట్విట‌ర్‌లో ట్రెండింగ్‌గా మారాయి. ఆ స్పామ్ పోస్టుల వ్య‌వ‌హారం స‌ద్దుమ‌ణిగిన‌ట్లు క‌నిపిస్తున్నప్ప‌టికీ.. మీమ్స్ మాత్రం హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.

ఈ Facebookకు ఏమైంది.. యూజ‌ర్ల ఫీడ్‌ల‌న్నీ విచిత్ర పోస్టుల‌తో నిండాయి!

మ‌రోవైపు, ఫేస్‌బుక్ వినియోగం కూడా భారీగా త‌గ్గింద‌ని ఇటీవ‌ల ఓ స‌ర్వే వెల్ల‌డించింది. దాని గురించి కూడా ఓ సారి తెలుసుకుందాం:
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ ఫేస్‌బుక్ యొక్క వాడకం ఒకప్పుడు అధికంగా ఉండేది. 2014-15లో మధ్యకాలంలో ఫేస్‌బుక్ ని ఉపయోగించే టీనేజర్ల (13 నుండి 17 సంవత్సరాల వయస్సు) యొక్క వాటా 71 శాతం ఉండగా ప్రస్తుతానికి అది 32 శాతంకి క్షీణించడంతో మార్క్ జుకర్‌బర్గ్ నేతృత్వంలోని ఫేస్‌బుక్ సంస్థ ఆందోళనకరమైన ధోరణిని కలిగి ఉన్నట్లు అమెరికన్ టీనేజర్స్‌పై ప్యూ రీసెర్చ్ సెంటర్ చేసిన కొత్త సర్వే వెల్లడించింది. వీరిలో అధిక మంది జనాదరణ పొందిన చైనీస్ షార్ట్-ఫారమ్ వీడియో ప్లాట్‌ఫారమ్ టిక్‌టాక్ ని ఉపయోగిస్తుండగా తరువాతి స్థానంలో ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ మరియు స్నాప్‌చాట్‌ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ లు అందుబాటులో ఉన్నాయి.

 

ప్యూ రీసెర్చ్ సెంటర్ సర్వే:
ప్యూ రీసెర్చ్ సెంటర్ చేసిన సర్వేలోని వివ‌రాలలోకి వస్తే దాదాపు 67 శాతం మంది టీనేజర్స్‌ తాము ఎప్పుడైనా తీరిక దొరికిన సమయాలలో టిక్‌టాక్‌ని ఉపయోగిస్తున్నామని చెప్పారు. మొత్తం టీనేజ్‌లలో 16 శాతం మంది తాము దాదాపు నిరంతరం టిక్‌టాక్‌ని ఉపయోగిస్తున్నామని చెప్పారు. అలాగే గూగుల్ యాజమాన్యంలోని యూట్యూబ్ ప్లాట్‌ఫారమ్‌ 2022 టీనేజ్ ఆన్‌లైన్ ల్యాండ్‌స్కేప్‌లో అగ్రస్థానంలో ఉంది. ఎందుకంటే దీనిని 95 శాతం మంది యువకులు ఉపయోగిస్తున్నారు.

ఈ సర్వేలో అడిగిన ప్లాట్‌ఫారమ్‌ల జాబితాలో టిక్‌టాక్‌ 67 శాతంతో తర్వాతి స్థానంలో ఉంది. అలాగే ఇన్‌స్టాగ్రామ్ మరియు స్నాప్‌చాట్ తర్వాతి స్థానాలలో ఉంది. ఈ రెండింటినీ ప్రతి 10 మంది టీనేజ్‌లలో ఆరుగురు ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. అయితే 32 శాతంతో Facebookకి తరువాతి స్థానం వచ్చింది. దీని తర్వాత ట్విట్టర్, Twitch, వాట్సాప్, Reddit మరియు Tumblr వంటివి చిన్న షేర్‌లను కలిగి ఉన్నాయని ప్యూ రీసెర్చ్ సెంటర్ సర్వే కనుగొంది.

Best Mobiles in India

English summary
Facebook Users Getting Spammed With Random Celebrity Posts; Another FB Fiasco?

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X