Just In
- 8 hrs ago
కోకా కోలా పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్! త్వరలోనే ఇండియాలో లాంచ్. ధర వివరాలు!
- 10 hrs ago
తక్కువ ధరలో, ఎక్కువ ఫీచర్లతో, బెస్ట్ స్మార్ట్ టీవీలు ! లిస్ట్ ,ధరలు చూడండి!
- 13 hrs ago
మీ కంప్యూటర్ లలో ఈ బ్రౌజర్ వాడుతున్నారా? జాగ్రత్త ...గవర్నమెంట్ వార్నింగ్ ఇచ్చింది!
- 16 hrs ago
OnePlus నుంచి కొత్త టాబ్లెట్, లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్ల వివరాలు!
Don't Miss
- News
ఏ క్షణమైనా ఢిల్లీ నుంచి వైఎస్ జగన్ కు పిలుపు: విశాఖ పర్యటన రద్దు?
- Sports
ఆ తప్పిదమే మా ఓటమిని శాసించింది: హార్దిక్ పాండ్యా
- Movies
సమంతలా అరియానా గ్లోరి అరాచకం.. 'శాకుంతలం' గెటప్పులో మత్తెక్కించే పరువాలతో అంతా చూపిస్తూ!
- Finance
adani lic: భారీ నష్టాల్లో LIC.. కారణమేంటో తెలుసా..?
- Lifestyle
మీ పార్ట్నర్తో బంధంలోని స్పార్క్‌ని మేల్కొలపండి, ఇలా బెడ్రూములో హీట్ పెంచండి
- Travel
గురజాడ నడియాడిన నేలపై మనమూ అడుగుపెడదామా!
- Automobiles
రూ. 50000 తో ప్రారంభమైన '2023 టయోటా ఇన్నోవా క్రిస్టా' బుకింగ్స్.. మరిన్ని వివరాలు
ఫేస్‌బుక్ - వాట్స్‌యాప్ డీల్ : ఆసక్తికర అంశాలు
ప్రతిష్టాత్మక డీల్‌లో భాగంగా సోషల్ నెట్‌వర్కింగ్ దిగ్గజం ఫేస్‌బుక్, ప్రముఖ మొబైల్ - మెసెజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్స్‌యాప్‌ను సొంతం చేసుకుంది. మొత్తం డీల్ విలువ 19 బిలియన్ డాలర్లు. భారత కరెన్సీ ప్రకారం ఈ విలువ అక్షరాల రూ.1,15,000 కోట్లు. ఈ భారీ కొనుగోలుకు సంబంధించి పలు ఆసక్తికర అంశాలను మీతో షేర్ చేసుకుంటున్నాం...
వాట్స్ యాప్ సర్వీసులును కాలిఫోర్నియా ముఖ్య కేంద్రంగా 2009లో ప్రారంభించారు. వేగవంతంగా విస్తరిస్తున్న ఈ మొబైల్ మెసెంజర్ సర్వీసుకు ప్రపంచవ్యాప్తంగా 450మిలియన్ల యూజర్లు ఉన్నారు. ఇండియాలో వాట్స్‌యాప్‌ను వినియోగించుకునే వారి సంఖ్య 35 మిలియన్లు. వాట్స్‌యాప్ మొబైల్ మెసేజింగ్ సర్వీసులకు యూరోప్, లాటిన్ అమెరికా ఇంకా ఇండియాలో మంచి ఆదరణ లభిస్తోంది. ఈ యాప్‌ను ఉపయోగించటం ద్వారా స్మార్ట్‌ఫోన్ యూజర్లు చాలా సులువుగా టెక్స్ట్, వాయిస్ సందేశాలతో పాటు వీడియోలు, ఫోటోలను షేర్ చేసుకోవచ్చు. కేవలం ఇంటర్నెట్ సదుపాయం పై ఈ సర్వీసు స్పందిస్తుంది. మొబైల్ నంబర్ల ఆధారంగా ఈ సర్వీసు పనిచేస్తుంది. యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న తొలి ఏడాది పాటు ఉచితంగా వాడుకోవచ్చు. ఆ తరువాత ఏడాదికి ఒక డాలరు (రూ.60 చొప్పున) ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
ఈ డీల్‌కు సంబంధించిన పలు ఆసక్తికర అంశాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు..
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

ఫేస్‌బుక్ - వాట్స్‌యాప్ డీల్ : ఆసక్తికర అంశాలు
వాట్స్‌యాప్ కొనుగోలు ఫేస్‌బుక్ ప్రస్థానంలోనే పెద్దది. ఈ ఒప్పందంలో భాగంగా 4 బిలియన్ డాలర్లను క్యాష్ రూపంలో, 12 బిలియన్ డాలర్లను షేర్ల రూపంలో చెల్లిస్తున్నట్లు ఫేస్‌బుక్ యాజమాన్యం ప్రకటించింది. మిగిలిన 3 బిలియన్ డాలర్లను పరిమిత స్టాక్ యూనిట్ల రూపంలో నాలుగు సంవత్సరాల తరువాత క్యాష్ చేసుకునే విధంగా వాట్స్‌యాప్ సంస్థతో ఫేస్ బుక్ డీల్ కుదర్చుకుంది.

ఫేస్‌బుక్ - వాట్స్‌యాప్ డీల్ : ఆసక్తికర అంశాలు
ఈ కొనుగోలును టెక్నాలజీ చరిత్రలోనే అతిపెద్ద కొనుగోలుగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.

ఫేస్‌బుక్ - వాట్స్‌యాప్ డీల్ : ఆసక్తికర అంశాలు
ఈ డీల్‌కు సంబంధించి ఫేస్‌బుక్.. వాట్స్‌యాప్ కంపెనీల మధ్య రెండు సంవత్సరాలుగా చర్చలు జరుగుతున్నాయి.

ఫేస్‌బుక్ - వాట్స్‌యాప్ డీల్ : ఆసక్తికర అంశాలు
బ్లూమ్‌బర్గ్ డేటా ప్రకారం 2001 తరువాత అతిపెద్ద ఇంటర్నెట్ కొనుగోలుగా ఫేస్‌బుక్ - వాట్స్‌యాప్ డీల్ చరిత్రలో నిలిచింది.

ఫేస్‌బుక్ - వాట్స్‌యాప్ డీల్ : ఆసక్తికర అంశాలు
వాట్స్‌యాప్ అప్లికేషన్‌ను కొనుగోలు చేసేందుకు గూగుల్ కూడా ప్రయత్నాలు చేసింది. అయితే ఆ చర్చలు సఫలీకృతం కాలేదు.

ఫేస్‌బుక్ - వాట్స్‌యాప్ డీల్ : ఆసక్తికర అంశాలు
వాట్స్‌యాప్ కంపెనీ సహ వ్యవస్థాపకుల్లో ఒకరైన బ్రెయిన్ యాక్టన్ గతంలో ఫేస్‌బుక్‌లో ఉద్యోగానికి ప్రయత్నించి విఫలమయ్యారు.

ఫేస్‌బుక్ - వాట్స్‌యాప్ డీల్ : ఆసక్తికర అంశాలు
వాట్స్‌యాప్ మొబైల్ మెసెంజర్ సర్వీసుకు ప్రపంచవ్యాప్తంగా 450 మిలియన్ల యూజర్లు ఉన్నారు. వారిలో 72 శాతం మంది వాట్స్‌యాప్ సర్వీసులను రోజు వినియోగించుకుంటున్న వారే.

ఫేస్‌బుక్ - వాట్స్‌యాప్ డీల్ : ఆసక్తికర అంశాలు
ఫేస్‌బుక్ ఈ డీల్‌ను రద్దుచేసకున్నట్లయితే జరిమానా క్రింది 2 బిలియన్ డాలర్లను వాట్స్‌యాప్‌కు చెల్లించాల్సి ఉంటుంది.

ఫేస్‌బుక్ - వాట్స్‌యాప్ డీల్ : ఆసక్తికర అంశాలు
వాట్స్ యాప్ సర్వీసులును కాలిఫోర్నియా ముఖ్య కేంద్రంగా 2009లో ప్రారంభించారు. వేగవంతంగా విస్తరిస్తున్న ఈ మొబైల్ మెసెంజర్ సర్వీసుకు ప్రపంచవ్యాప్తంగా 450మిలియన్ల యూజర్లు ఉన్నారు. ఇండియాలో వాట్స్‌యాప్‌ను వినియోగించుకునే వారి సంఖ్య 35 మిలియన్లు.

ఫేస్‌బుక్ - వాట్స్‌యాప్ డీల్ : ఆసక్తికర అంశాలు
వాట్స్‌యాప్ మొబైల్ మెసేజింగ్ సర్వీసులకు యూరోప్, లాటిన్ అమెరికా ఇంకా ఇండియాలో మంచి ఆదరణ లభిస్తోంది. ఈ యాప్‌ను ఉపయోగించటం ద్వారా స్మార్ట్‌ఫోన్ యూజర్లు చాలా సులువుగా టెక్స్ట్, వాయిస్ సందేశాలతో పాటు వీడియోలు, ఫోటోలను షేర్ చేసుకోవచ్చు. కేవలం ఇంటర్నెట్ సదుపాయం పై ఈ సర్వీసు స్పందిస్తుంది. మొబైల్ నంబర్ల ఆధారంగా ఈ సర్వీసు పనిచేస్తుంది. యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న తొలి ఏడాది పాటు ఉచితంగా వాడుకోవచ్చు. ఆ తరువాత ఏడాదికి ఒక డాలరు (రూ.60 చొప్పున) ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470