Facebook అకౌంటుకు ఐదు ప్రొఫైల్‌లను జతచేయడానికి అనుమతి!! పూర్తి వివరాలు ఇవిగో...

|

సోషల్ మీడియా యాప్ ల వినియోగం అధికంగా ఉంది. కొన్ని సంవత్సరాల ముందు వినియోగదారులు తమ యొక్క ఫోటోలను మరియు వీడియోలను షేర్ చేయడం కోసం ఫేస్‌బుక్ ని మాత్రమే ఉపయోగించేవారు. కానీ తరువాత రోజులలో దీనికి పోటీగా చాలానే అందుబాటులోకి వచ్చాయి. ఫేస్‌బుక్ సంస్థ కూడా పోటీలో నెగ్గుకురావడానికి అనేక మార్పులను చేసింది. ఫేస్‌బుక్ ప్రస్తుతానికి తన ప్లాట్‌ఫారమ్‌లో ఒక ప్రొఫైల్‌ను మాత్రమే వారి అకౌంటులకు లింక్ చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. మెటా యాజమాన్యంలోని ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇప్పుడు మరొక కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొనిరావడానికి ప్రయత్నిస్తున్నది. వినియోగదారులు ఒకే అకౌంటులో ఐదు ప్రొఫైల్‌లను కలిగి ఉండడానికి అనుమతించనున్నది. ప్రస్తుతం ఇది పరీక్షదశలో ఉన్నందున ప్రారంభించిన తరువాత భవిష్యత్తులో అనేక మార్పులు వచ్చే అవకాశం ఉంది.

మెటా కంపెనీ

మెటా కంపెనీ నుంచి విడుదలైన కొన్ని నివేదికల ప్రకారం కొంతమంది ఫేస్‌బుక్ వినియోగదారులు వారి యొక్క మెయిన్ అకౌంటులతో ముడిపడి మరొక నాలుగు అదనపు ప్రొఫైల్‌లను సృష్టించడానికి అనుమతిస్తుంది. ఫేస్‌బుక్ వినియోగదారులు ఈ అదనపు ప్రొఫైల్‌లను వారి సహోద్యోగుల కోసం లేదా స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల కోసం మరియు తమ యొక్క ఫాలోవెర్స్ లను అన్వేషించడం మరియు ప్రభావశీలులతో పరస్పరం వ్యవహరించడం వంటి విభిన్న ప్రయోజనాల కోసం ఈ అదనపు ప్రొఫైల్‌లను ఉపయోగించగలరని ఆలోచన.

ఫేస్‌బుక్

ఫేస్‌బుక్ యొక్క అన్ని ప్రొఫైల్‌లన్నీ కూడా మెయిన్ ఫేస్‌బుక్ అకౌంట్ పరిధిలోనే ఉంటాయి. వాటిలో ఎలాంటి మార్పులు ఉండవు. కానీ వినియోగదారులు ఈ ప్రొఫైల్‌ల మధ్య సులభంగా మారగలరు. కానీ ఈ విషయాలు అంత సులభం కాదు. ప్రత్యేక ప్రొఫైల్‌లను రూపొందించడానికి ఈ ఫీచర్‌ను ఉపయోగించే ఫేస్‌బుక్ వినియోగదారులు కొన్ని నియమాలకు కట్టుబడి ఉండాలి. ఆపరేషన్ యొక్క సాధారణ నియమాలు ప్రొఫైల్‌లలో ఒకే విధంగా ఉంటాయి. అయితే యూసర్ ప్రొఫైల్‌లో ఎవరైనా ఒకరు పాలసీ ఉల్లంఘనకు గురైతే కనుక అది మొత్తం అకౌంట్ పై ప్రభావం చూపుతుంది. ఉదాహరణకు ఒక యూజర్ యొక్క నిర్దిష్ట ప్రొఫైల్ ఫేస్‌బుక్ కమ్యూనిటీ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే మరియు కంపెనీ ప్రొఫైల్‌ను ఒక రోజు పాటు నిలిపివేయాలని నిర్ణయించుకుంటే కనుక ప్రొఫైల్ మాత్రమే కాకుండా మొత్తం అకౌంట్ నిర్దిష్ట కాల వ్యవధి వరకు నిలిపివేయబడుతుంది.

స్టాండ్-ఇన్ డిస్‌ప్లే

మరొక విషయం స్టాండ్-ఇన్ డిస్‌ప్లే యొక్క కంపెనీ విధానాలను ఉల్లంఘించనంత వరకు మరియు ప్రత్యేక అక్షరాలను కలిగి ఉండనంత వరకు అదనపు ప్రొఫైల్‌లను సృష్టించే వినియోగదారులు వారి నిజమైన గుర్తింపును వారి డిస్ప్లే పేర్లలో ఉపయోగించాల్సిన అవసరం లేదని ఫేస్‌బుక్ తెలిపింది.

ఫేస్‌బుక్

ఫేస్‌బుక్ సంస్థ కొత్తగా ప్రకటించిన ఈ ఫీచర్ యొక్క లభ్యత విషయానికొస్తే ఫేస్‌బుక్ సంస్థ ఇంకా ఈ ఫీచర్ ని టెస్టింగ్ దశలోనే ఉంచింది. ఈ ఫీచర్‌ను రోల్ అవుట్ చేయడానికి ఉపయోగిస్తున్న భౌగోళిక ప్రమాణాలను వివరించకుండా ఎంపిక చేసిన వినియోగదారులకు ఇది త్వరలోనే అందుబాటులోకి వస్తుందని ఫేస్‌బుక్ తెలిపింది. కంపెనీ యాక్టివ్ యూజర్ బేస్ క్షీణిస్తున్న సమయంలో మరియు టిక్‌టాక్ మరియు దాని స్వంత ఇన్‌స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫారమ్‌ల నుండి ఇప్పటికీ పోటీని ఎదుర్కొంటున్న సమయంలో ఈ ఫీచర్ రావడం గమనించదగ్గ విషయం.

Meta 3D అవతార్‌ని ఫేస్‌బుక్‌లో సృష్టించే విధానం

Meta 3D అవతార్‌ని ఫేస్‌బుక్‌లో సృష్టించే విధానం

1. మీ ఫోన్‌లో ఫేస్‌బుక్‌ను ఓపెన్ చేయండి.

2. హాంబర్గర్ ఐకాన్ వలె కనిపించే మెనుపై క్లిక్ చేయండి.

3. తరువాత 'See more' ఆప్షన్‌పై క్లిక్ చేయండి.

4. అవతార్‌ ఎంపికని కనుగొని దానిపై క్లిక్ చేయండి.

5. ఇప్పుడు మీరు ఈ అవతార్‌ని మీ ఇష్టానికి అనుగుణంగా మార్చుకోవచ్చు.

(మెటా 3D అవతార్‌లు మెరుగ్గా కనిపించేలా చేయడానికి మెటా సంస్థ మరిన్ని ఎంపికలను జోడించింది).

6. మార్పులు చేయడం పూర్తయిన తరువాత 'ఫినిష్' బటన్‌పై నొక్కండి.

7. ఇప్పుడు మీరు మెటా 3D అవతార్‌లను ఉపయోగించి ఏదైనా పోస్ట్‌ని సృష్టించవచ్చు మరియు Facebook యాప్‌లో స్టేటస్ ని అప్‌డేట్ చేయవచ్చు. మీరు 3D అవతార్‌ని మీ ప్రొఫైల్ చిత్రంగా కూడా ఉపయోగించవచ్చు.

 

ఫేస్‌బుక్‌లో HD వీడియోలను అప్‌లోడ్ చేసే విధానం

ఫేస్‌బుక్‌లో HD వీడియోలను అప్‌లోడ్ చేసే విధానం

స్టెప్ 1: మీ స్మార్ట్‌ఫోన్‌లో ఫేస్‌బుక్‌ యాప్‌ని ఓపెన్ చేయండి.

స్టెప్ 2: యాప్‌లో కుడివైపు దిగువ మూలన గల మూడు క్షితిజ సమాంతర రేఖలలో గల మెనూ చిహ్నాన్ని నొక్కండి.

స్టెప్ 3: సెట్టింగ్‌స & ప్రైవసీ ఎంపికకు వెళ్లి కుడివైపున ఉన్న బాణం గుర్తును నొక్కండి.

స్టెప్ 4: ఇప్పుడు సెట్టింగ్‌ల ఎంపికను ఎంచుకోండి.

స్టెప్ 5: ప్రిఫరెన్స్ విభాగానికి క్రిందికి స్క్రోల్ చేయండి మరియు మీడియా ఎంపికను ఎంచుకోండి. ఇలా చేయడంతో మీరు వీడియోలు మరియు ఫోటోల సెట్టింగ్‌ల పేజీకి చేరుకుంటారు.

స్టెప్ 6: ఇప్పుడు క్రిందికి స్క్రోల్ చేసి వీడియో నాణ్యత విభాగంలో ఆప్టిమైజ్డ్ ఎంపికను ఎంచుకోండి.

 

Best Mobiles in India

English summary
Facebook Will Allowed Link Up to Five Profiles to One Facebook Account: Here are The Full Details

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X