ఇకపై శుక్రవారం ఫేస్‌బుక్ లైక్స్,వ్యూస్ కనపడవు

By Gizbot Bureau
|

సోషల్ మీడియాలో దూసుకుపోతున్న దిగ్గజం ఫేస్ బుక్ యూజర్లకు మరో ఝలక్ ఇచ్చేందుకు రెడీ అయింది. శక్రవారం ఫేస్ బుక్ లో పోస్టులకు సంబంధించి లైక్స్ ని హైడ్ చేయనుంది. కేవలం పోస్ట్ పెట్టినవారికి మాత్రమే కనిపించే విధంగా మార్పులు తీసుకురానుంది. ఇక వేళ వీడియో పోస్ట్ చేస్తే ఎన్ని లైక్స్ వచ్చాయి అలాగే ఎన్ని వ్యూస్ వచ్చాయనేది కేవలం పోస్ట్ పెట్టిన వారికి మాత్రమే కనిపించేలా కొత్త మార్పులను తీసుకురానుంది. ఈ టెస్ట్ ఇప్పటికే ఆస్ట్రేలియాలో స్టార్టయింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా దిగ్గజం కన్మర్మ్ చేసింది. యాడ్స్ కూడా ఇందులో భాగం కానున్నాయని తెలుస్తోంది. మేము దీనిపై పరిమితంగా టెస్ట్ లు చేస్తున్నామని లైకులు, కామెంట్లు, వ్యూస్ అన్ని ప్రైవేటుగా ఉంచేందుకు మార్గాలను అన్వేషిస్తున్నామని ఫేస్ బుక్ అధికారి ప్రతినిధి తెలిపారు. ఈ విషయాన్ని సీనెట్ కి మెయిల్ ద్వారా తెలియజేశారని సీనెట్ రిపోర్ట్ చేసింది.

యూజర్ల అనుభవాన్ని
 

యూజర్ల అనుభవాన్ని

ఈ అంశంపై యూజర్ల అనుభవాన్ని సేకరిస్తున్నామని, వారి రియాక్షన్ ఎలా ఉందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఇంకా ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే వాటిని కూడా పరిగణలోకి తీసుకుంటామని వారు అన్నట్లుగా సీనెట్ రిపోర్ట్ చేసింది.

ఇన్‌స్టా‌గ్రామ్‌లో ప్రయోగం

ఇన్‌స్టా‌గ్రామ్‌లో ప్రయోగం

కాగా సెప్టెంబర్ నెలలో ఈ దిగ్గజం తన సొంత ఫ్లాట్ ఫాం అయిన ఇన్‌స్టా‌గ్రామ్‌లో ఇప్పటికే దీనిపై ప్రయోగాలు చేసింది. అందులో లైక్స్ ని హై్ చేసింది. అయితే ఈ విషయాన్ని ఆగస్టులోనే వెల్లడించింది. ఇన్ స్టా గ్రామ్ లో పలు మార్పులు చేస్తున్నామని, పోస్ట్ ఎన్ని లైకులు రిసీవ్ చేసుకుంటుందో అనే దాన్ని రిమూవ్ చేస్తున్నామని తెలిపింది. ఆ తరువాత దాన్నుంచి బయటకు వచ్చేసింది.

ఏడు దేశాల్లో అమలు

ఏడు దేశాల్లో అమలు

జులై నెలలో ఈ ప్రయోగాన్ని ఏడు దేశాల్లో అమలు చేసింది. Australia, Canada, Brazil, New Zealand, Ireland, Italy and Japan మొదలగు దేశాల్లో ఈ లైక్స్ కనపడకుండా చేసింది. పోస్టులు పెట్టిన వారికి మాత్రమే కనపడేలా పలు మార్పులు చేసింది.

యూజర్ల రియాక్షన్
 

యూజర్ల రియాక్షన్

ఈ నిర్ణయంతో ప్రపంచ వ్యాప్తంగా యూజర్ల రియాక్షన్ ఎలా ఉండబోతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే చాలామంది పోస్టుల్లో తమకు ఎన్ని లైకులు , కామెంట్లు వచ్చినయో చూసుకుని మురిసిపోతుంటారు. ఇప్పుడు అవి కనపడకుండా చేస్ే యూజర్లు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. అయితే పోస్ట్ పెట్టిన వారికి అవి కనిపించాయని ఫేస్ బుక్ చేప్పడం ఊరట కలిగించే అంశం.

Most Read Articles
Best Mobiles in India

English summary
Facebook will begin hiding likes on Friday

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X