మళ్లీ చిక్కుల్లో పడిన ఫేస్‌బుక్, భారీ జరిమానా

By Gizbot Bureau
|

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ ఇంక్ చిక్కుల్లో పడింది. ప్రైవసీ ఉల్లంఘనలకు గానూ ఫేస్‌బుక్ ఇంక్ భారీ మూల్యం చెల్లించనుంది. ప్రైవసీ ఉల్లంఘనలకు సంబంధించి ప్రభుత్వ దర్యాప్తును పరిష్కరించేందుకు రికార్డు స్థాయిలో ఫేస్‌బుక్ 5 బిలియన్ డాలర్లు (రూ.500కోట్లు) జరిమానా చెల్లించనుంది.

Facebook will pay record $5 billion fine over privacy violations

ప్రైవసీకి సంబంధించిన విధానాన్ని ఫేసుబుక్ పునరుద్ధరించనున్నట్టు యూఎస్ ఫెడరల్ ట్రేడ్ కమిషన్ ఒక ప్రకటనలో తెలిపింది.సెటిల్‌మెంట్‌ను స్వీకరించడానికి FTC 3-2తో ఓటు వేసిందని, ఇందుకు కోర్టు అనుమతి అవసరం లేదని తెలిపింది. డెమోక్రాట్లు చెప్పినట్లుగా దీనికి పెద్ద మొత్తంలో జరిమానా అవసరం లేదని స్పష్టం చేసింది.

వ్యక్తిగత సమాచారం ఎలా పంచుకోవాలో

వ్యక్తిగత సమాచారం ఎలా పంచుకోవాలో

ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల మంది వినియోగదారులకు ఫేస్‌బుక్ పదేపదే వాగ్దానాలు ఇచ్చినప్పటికీ, వ్యక్తిగత సమాచారం ఎలా పంచుకోవాలో వారు నియంత్రించగలిగే సామరథ్యం కలిగి ఉన్నారని రిపబ్లికన్ పార్టీకి చెందిన ఎఫ్‌టిసి చైర్మన్ జో సైమన్స్ తెలిపారు. ఈ అవకాశం అదనుగా తీసుకుని ఫేస్‌బుక్ వినియోగదారుల ఎంపికలను నిర్లక్ష్యం చేసిందని ఆయన ప్రకటనలో తెలిపారు.

డేటా పాలసీపై FTC ఫైర్

డేటా పాలసీపై FTC ఫైర్

Democratic FTC Commissioner Rohit Chopra మాట్లాడుతూ ఈ జరిమానా ఫేస్‌బుక్ ఎగ్జిక్యూటివ్‌లకు పెద్దగా ప్రభావం చూపేదిలా లేదని, ఫేస్‌బుక్ వ్యాపార నమూనాపై నిజమైన పరిమితులు లేవని, ఉల్లంఘనలకు దారితీసిన ప్రధాన సమస్యలను పరిష్కరించడం లేదని ఆయన విమర్శించారు. పబ్లిక్ రిలీజ్ సెటిల్ మెంట్‌‌కు ముందు ఫేస్‌బుక్ కామెంట్ చేసేందుకు నిరాకరించింది.ఫేస్‌బుక్ డేటా పాలసీ మోసపూరితమైనదంటూ FTC ఆరోపించింది.

యూజర్లను తప్పుదారి..

యూజర్లను తప్పుదారి..

ఫేషియల్ రికగ్నైజేషన్ టూల్ ద్వారా పదిలక్షల మంది యూజర్లను తప్పుదారి పట్టిస్తుందని విమర్శించింది. సెక్యూరిటీ ఫీచర్ ఎనేబుల్ చేసేందుకు సేకరించిన యూజర్ల ఫోన్ నంబర్లను బహిర్గతం చేయనప్పుడు అడ్వర్ టైజింగ్ కోసం వినియోగించి నియమాలను ఉల్లంఘించినట్లు FTC తెలిపింది.

 ఇండిపెండెంట్ ప్రైవసీ కమిటీ ఏర్పాటు :

ఇండిపెండెంట్ ప్రైవసీ కమిటీ ఏర్పాటు :

సెటిల్‌మెంట్ కింద ఫేస్‌బుక్ బోర్డు స్వతంత్ర గోప్యతా కమిటీని రూపొందించనుంది. దీనిద్వారా యూజర్ల ప్రైవసీని ప్రభావితం చేసే నిర్ణయాలపై Facebook సీఈఓ మార్క్ జుకర్ బర్గ్‌ నియంత్రణ ఉండదు. థర్డ్ పార్టీ యాప్స్ ఎప్పటికప్పుడూ పర్యవేక్షించేందుకు ఫేస్‌బుక్ కూడా అంగీకరించింది. ఈ పరిష్కారాన్ని వ్యతిరేకించిన చోప్రా, FTC Commissioner Rebecca Slaughter మాట్లాడుతూ.. వినియోగదారుల గోప్యతను ఉల్లంఘించడం ద్వారా ఫేస్‌బుక్ సాధించిన లాభాల కంటే 5 బిలియన్ డాలర్ల జరిమానా చాలా తక్కువని అన్నారు. ‘మా వ్యక్తిగత గోప్యత, జాతీయ భద్రతను పణంగా పెట్టడానికి ఫేస్‌బుక్ ప్రధాన ఆర్థిక ప్రోత్సాహకాలను పరిష్కరించనంతవరకు, ఈ సమస్యలు మళ్లీ ఉత్పన్నం కాకుండా నిరోధించలేమని చోప్రా చెప్పారు.

సైమన్స్ నేతృత్వంలోని రిపబ్లికన్ కమిషనర్లు మాట్లాడుతూ ఎఫ్‌టిసి కోర్టుకు వెళ్లినట్లయితే ఏ జడ్జీ అయినా సివిల్ పెనాల్టీని విధిస్తారని, అది కూడా పరిష్కారానికి దగ్గరగా అవకాశం ఉందని అన్నారు. ప్రస్తుతం పనిచేయని బ్రిటిష్ పొలిటికల్ కన్సల్టింగ్ సంస్థ కేంబ్రిడ్జ్ అనలిటికాతో ఫేస్‌బుక్ 87 మిలియన్ల వినియోగదారులకు సంబంధించిన సమాచారాన్ని అనుచితంగా షేర్ చేస్తుందనే ఆరోపణలపై ఎఫ్‌టిసి దర్యాప్తు చేస్తోంది.

  తప్పుడు ధృవీకరణ పత్రం దాఖలు చేస్తే

తప్పుడు ధృవీకరణ పత్రం దాఖలు చేస్తే

జుకర్‌బర్గ్ లేదా ఇతరులు తప్పుడు ధృవీకరణ పత్రం దాఖలు చేస్తే సివిల్, క్రిమినల్ చర్యలను ఎదుర్కోవలసి ఉంటుందని FTC తెలిపింది. ఈ క్రమంలో వినియోగదారులు సైన్ అప్ చేసినప్పుడు Facebook ఇతర సేవలకు ఈ-మెయిల్ పాస్వర్డ్‌లను అడగకుండా నిషేధించింది. ప్రకటనల కోసం సెక్యూరిటీ ఫీచర్ అయిన టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ద్వారా టెలిఫోన్ నంబర్లను ఉపయోగించకుండా ఫేస్‌బుక్ నిషేధించింది. ఫేషియల్ రెకగ్న్ నైజేషన్ టెక్నాలజీ నుంచి డేటాను వినియోగించాలని ప్లాన్ చేస్తే వినియోగదారుల సమ్మతిని తప్పక పొందాల్సి ఉంటుంది.

Best Mobiles in India

English summary
Facebook will pay record $5 billion fine over privacy violations

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X