ఫేస్‌బుక్‌లో బగ్ కనిపెడితే రూ.35 లక్షల బహుమతి

By Gizbot Bureau
|

టెక్నాలజీ రోజు రోజుకు పెరుగుతున్న కొద్దీ అంతే స్థాయిలో హ్యాకింగ్ కూడా పెరుగుతూ వస్తోంది. ముఖ్యంగా డిజిటల్ యుగం పుంజుకునే కొద్దీ యూజర్లకు భద్రత అనేది అత్యంత కీలకమైన అంశంగా మారింది. ఈ యాప్ ఓపెన్ చేస్తే ఏం జరుగుతుందోనని అందరూ భయపడాల్సిన పరిస్థితి. అయితే ఈ పరిస్థితి సోషల్ మీడియాలో చాలా ఎక్కువగా ఉంది. యూజర్ల డేటాను కాపాడేందుకు సోషల్ మీడియా దిగ్గజాలు కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నాయి. అయినప్పటికీ డేటా హ్యాకింగ్ జరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో కంపెనీలు బగ్ కనిపెట్టిన వారికి భారీ క్యాష్ ప్రైజును అందిస్తున్నాయి.ఇందులో భాగంగా ఫేస్ బుక్ కూడా బగ్ కనిపెట్టిన వారికి భారీ ఆఫర్ ను అందిస్తోంది.

థర్డ్ పార్టీ యాప్స్ లో భద్రతపరమైన లోపాలను
 

థర్డ్ పార్టీ యాప్స్ లో భద్రతపరమైన లోపాలను

ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ కూడా తమ యాప్స్ లేదా సర్వీసుల్లో ఏదైనా బగ్, భద్రత పరమైన లోపాలు ఉన్నాయో కనిపెట్టాలని ఆఫర్ చేస్తోంది. ‘బగ్ బౌంటీ ప్రొగ్రామ్' పేరుతో ఈ స్పెషల్ కాంటెస్టును ప్రకటించింది. ఈ పోటీలో పాల్గొనే పోటీదారులను థర్డ్ పార్టీ యాప్స్ లో భద్రతపరమైన లోపాలను తప్పక గుర్తించాలని కండీషన్ పెట్టింది.

రూ.35లక్షలకు పైగా క్యాష్ ప్రైజ్

రూ.35లక్షలకు పైగా క్యాష్ ప్రైజ్

రియల్ టైమ్ లో యాప్స్ టెస్టింగ్ చేసి అందులోని లోపాలను బౌంటీ పోటీదారులు గుర్తించాల్సి ఉంటుంది. బగ్స్ గుర్తించినవారికి ఫేస్ బుక్ రూ.35లక్షలకు పైగా క్యాష్ ప్రైజ్ ఇవ్వనుంది. కొత్త పాలసీల ప్రకారం బౌంటీ హంటర్లు ఎవరైతే యాప్స్, సర్వీసుల్లోని భద్రత లోపాలను (లో సెక్యూరిటీ థ్రెట్స్) గుర్తిస్తారో కనిష్టంగా 500 డాలర్ల (రూ. 35వేల 732) వరకు క్యాష్ ప్రైజ్ ఇవ్వనుంది.

బోనస్

బోనస్

ఇక స్థానిక యాప్స్ లోని బగ్స్, భద్రత లోపాలను గుర్తించినవారికి వెయ్యి డాలర్ల నుంచి 15వేల డాలర్ల వరకు బోనస్ గా ఫేస్ బుక్ ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఇదంతా పోటీలోని ఫైనల్ బౌంటీలో యాడ్ అవుతుంది.తాజా రిపోర్టుల ప్రకారం ఫేస్‌బుక్ ఒక ప్రత్యేకమైన బగ్ కనిపెట్టిన వారికి గరిష్టంగా 50వేల డాలర్ల వరకు చెల్లించనుంది.

కంపెనీలే హ్యాకర్లకు సవాల్
 

కంపెనీలే హ్యాకర్లకు సవాల్

కాగా కొన్నిసార్లు రూపొందించిన యాప్స్ లో బగ్స్ రహస్యంగా తిష్టివేసి ఉంటాయి. ఇలాంటి బగ్స్ ను గుర్తించేందుకు కంపెనీలే హ్యాకర్లకు సవాల్ విసురుతుంటాయి. తమ యాప్ సర్వీసుల్లో బగ్ కనిపెట్టిన వారికి భారీ మొత్తంలో పారితోషకం ఆఫర్ చేస్తుంటాయి.

Most Read Articles
Best Mobiles in India

English summary
Facebook will pay you rs 35 lakh or more if you find any security bugs in fb apps or services

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X