డబ్బులు ఎలా సంపాదించాలో ఫేస్‌బుక్ ఉచితంగా చెబుతుంది

By Gizbot Bureau
|

ఇప్పుడు చాలామంది డబ్బులు ఎలా సంపాదించాలా అని తెగ ఆలోచిస్తుంటారు. అలాగే వ్యాపారాలు,పెట్టుబడుల మీద దృష్టి సారిస్తుంటారు. ఎలాగైనా వ్యాపారంలో సక్సెస్ కావాలని తాపత్రయ పడుతుంటారు. అలాంటి వారి కోసం ప్రభుత్వ, ప్రయివేటు రంగాలు, బ్యాంకులు, బంగారం, మార్కెట్లు, రియల్ ఎస్టేట్.. ఇలా ఎన్నో రంగాలు ఎదురుచూస్తున్నాయి.

డబ్బులు ఎలా సంపాదించాలో ఫేస్‌బుక్ ఉచితంగా చెబుతుంది

అయితే వాటిల్లో అవకాశాలు ఉన్నప్పటికీ పెట్టుబడి పెట్టడంలో చాలా వెనుకంజ వేస్తుంటారు. దీనికి ప్రధాన కారణం ఎక్కడ, ఎలా పెట్టుబడి పెట్టాలో తెలియక పోవడమే. దీంతో వారు తెలిసిన వారి సూచనలు, సలహాలు తీసుకుంటున్నారు. ఈ బాటలోనే ఇప్పుడు సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ నడుస్తోంది. వ్యాపారం చేసేవారికి డబ్బు పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఉచితంగా సలహాలు, సూచనలు ఇవ్వనుందట.

డబ్బు ఎలా సంపాదించాలి

డబ్బు ఎలా సంపాదించాలి

ఫేస్‌బుక్ ఈ మధ్య నూ టర్మ్స్ ఆఫ్ సర్వీసును పరిచయం చేసింది. దీని ప్రకారం 2 బిలియన్ల మంది యూజర్లకు డబ్బును ఎలా సంపాదించాలి, హానికరమైన కంటెంట్ తొలగింపు వంటి వాటిపై అవగాహన కల్పించే వివరాలు ఇస్తామని తెలిపింది. ఇది జూలై 31వ తేదీ నుంచి అందుబాటులోకి రానుందట. ఫేస్‌బుక్ ఎప్పటికప్పుడు మార్పులు చేస్తోన్న విషయం తెలిసిందే. ఇటీవలే ఇది క్రిప్టో కరెన్సీ రంగంలోకి అడుగు పెట్టింది. లిబ్రా పేరుతో సొంత క్రిప్టో కరెన్సీని విడుదల చేస్తున్నట్లు కొద్ది రోజుల క్రితం ప్రకటించింది.

దానికి చార్జ్ ఉండదు

దానికి చార్జ్ ఉండదు

డబ్బు సంపాదన, హానికరమైన కంటెంట్ తొలగింపు తదితర అంశాలపై ఫేస్‌బుక్ వైస్ ప్రెసిడెంట్, అసోసియేట్ జనరల్ కౌన్సెల్ అన్నా బెంకెర్ట్ మాట్లాడుతూ... మనం డబ్బు ఎలా సంపాదించాలనే అంశంపై తాము మరిన్ని సౌకర్యాలు అందుబాటులోకి తెస్తామని చెప్పారు. బిజినెస్ పీపుల్, పలు సంస్థలు తమ యాడ్స్ వేసినందుకు డబ్బులు చెల్లిస్తున్నాయని, కాబట్టి ఇలాంటి సూచనలకు తాము మీ నుంచి డబ్బులు వసూలు చేయమని స్పష్టం చేశారు.

కంటెంట్ డిలీట్ చేస్తే...
 

కంటెంట్ డిలీట్ చేస్తే...

అలాగే, ఫోటోలు, వీడియోలు వంటి తమ సొంత కంటెంట్‌ను షేర్ చేసుకున్నప్పుడు, వారు మేథో సంపత్తి హక్కులు కలిగి ఉంటారని చెప్పారు. ఆ కంటెంట్‌ను ప్రదర్శించేందుకు మీరు అనుమతి ఇచ్చారని, ఎప్పుడైతే ఫేస్‌బుక్ నుంచి డిలీట్ చేస్తారో ఆ పర్మిషన్ ముగిసిపోతుందన్నారు. మీరు షేర్ చేసిన కంటెంట్ తొలగించిన అంశాలకు సంబంధించిన వివరాలు కూడా ప్రొవైడ్ చేస్తుందన్నారు. ఉదాహరణకు, మీరు షేర్ చేసిన ఏదైనా కంటెంట్, మీరు డిలీట్ చేశాక అది కనిపించదు. అయితే తమ సిస్టం నుంచి తొలగించేందుకు 90 రోజుల సమయం పడుతుందన్నారు. మీ పర్సనల్ అంశాలను తాము బహిరంగపర్చమని, విక్రయించమని చెప్పారు.

జీ20 కూటమి దేశాల నియంత్రణ సంస్థలు దృష్టి

జీ20 కూటమి దేశాల నియంత్రణ సంస్థలు దృష్టి

సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్‌ ఫేస్‌బుక్‌ ప్రతిపాదించిన క్రిప్టో కరెన్సీ లిబ్రా కాయిన్‌పై శక్తిమంతమైన జీ20 కూటమి దేశాల నియంత్రణ సంస్థలు దృష్టి పెట్టాయి. ఫేస్‌బుక్‌ క్రిప్టో కరెన్సీ వ్యవహారాన్ని నిశితంగా పరిశీలిస్తున్నట్లు అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ చైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ చెప్పారు. వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణ కోణంలో ఫేస్‌బుక్‌ అత్యున్నత ప్రమాణాలు పాటించాల్సి ఉంటుందని స్పష్టంచేశారు.

వచ్చే ఏడాది లిబ్రా కాయిన్స్‌

వచ్చే ఏడాది లిబ్రా కాయిన్స్‌

బ్యాంకింగ్‌ వ్యవస్థతో సంబంధం లేకుండా ఆర్థిక లావాదేవీలు జరిపేందుకు ఉపయోగపడే లిబ్రా కాయిన్స్‌ను వచ్చే ఏడాది ప్రవేశపెట్టాలని ఫేస్‌బుక్‌ యోచిస్తున్న సంగతి తెలిసిందే. వీటితో లావాదేవీల వ్యయాలు గణనీయంగా తగ్గుతుందని, మరిన్ని సేవలను ప్రజలకు అందుబాటులోకి తేవొచ్చని ఫేస్‌బుక్‌ చెబుతోంది. కంపెనీకి రెండు వందల కోట్ల పైగా యూజర్లు ఉండటంతో ఆర్థిక లావాదేవీలపై ఇది గణనీయ ప్రభావం చూపించవచ్చన్న అంచనాలున్నాయి. అయితే, క్రిప్టో కరెన్సీల భద్రతపై సందేహాలుండటం, పలు దేశాల సెంట్రల్‌ బ్యాంకులు వీటిని నిషేధించడం కారణంగా ఫేస్‌బుక్‌ లిబ్రా కాయిన్‌ చర్చనీయాంశమైంది.

Best Mobiles in India

English summary
Now, Facebook will tell you how to make money

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X