ఇండియాలో ఫేస్‌బుక్ దూకుడు... రెండేళ్లలో 6.5కోట్ల యూజర్లు!

Posted By: Staff

ఇండియాలో ఫేస్‌బుక్ దూకుడు... రెండేళ్లలో 6.5కోట్ల యూజర్లు!

 

హైదరాబాద్: సామాజిక సంబంధాల సైట్ ఫేస్ బుక్ భారత్ లో తన సామ్రాజ్యాన్ని మరింత విస్తరించుకుంటోంది. ఫేస్‌బుక్ 2010లో భారత్‌లో కార్యాలయాన్ని ప్రారంభించింది. ఆ సమయంలో యూజర్ల సంఖ్య 80 లక్షలు. ఇప్పుడీ సంఖ్య 6.5 కోట్లకు చేరుకుందని ఫేస్‌బుక్ ఇండియా హెడ్ కీర్తిగా రెడ్డి తెలిపారు. కంపెనీలు అమ్మకాలను పెంచుకునేందుకు పటిష్టమైన వేదికగా ఫేస్‌బుక్ నిలిచిందని అన్నారు. ఇక్కడి మైండ్‌స్పేస్‌లో నూతన కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నట్టు కంపెనీ గురువారం ప్రకటించింది. ఈ సందర్భంగా కీర్తిగా మీడియాతో ముచ్చటించారు.

ఫేస్‌బుక్ కొత్త ఆఫర్.. మొబైల్ ద్వారా లాగిన్ అయితే రూ.50 ఉచిత టాక్‌టైమ్!

ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్, ఇండియాలో తన యూజర్ల సంఖ్యను మరింత పెంచుకునేందుకు సరికొత్త ఆఫర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ప్లగ్డుడ్. ఇన్ (Plugged.in) ప్రచురించిన సమాచారం మేరకు మొబైల్ ఫోన్ ద్వారా ఫేస్‌బుక్‌‌లోకి లాగిన్ అయ్యే కొత్త యూజర్‌కు రూ.50 టాక్‌టైమ్ ఉచితంగా లభించనుంది. ఫేస్‌బుక్‌ ఆకౌంట్‌ను తన మొబైల్ ద్వారా ఓపెన్ చేసుకున్న యూజర్ m.facebook.com/ttలోకి ప్రవేశించి సంబంధిత వివరాలున రిజిస్టర్ చేసి ఉచిత టాక్‌టైమ్‌ను పొందవచ్చు. ఫేస్ బుక్ లో ఇప్పటికే ఆకౌంట్ ఉన్న వారు తమ మిత్రులతో మొబైల్ ఫేస్‌బుక్ అకౌంట్ ఓపెన్ చేయించినట్లయితే వారికి ఫ్రీ టాక్‌టైమ్ వర్తిస్తుంది.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot