ఇండియాలో ఫేస్‌బుక్ ‘యూప్ సెంటర్’

By Super
|
 Facebooks App Center in India

న్యూయార్క్: ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్ భారత్‌తో సహా ఆరు దేశాల్లో ‘యాప్ సెంటర్’ను ప్రారంభించింది. అమెరికాలో ఈ యాప్ సెంటర్ సేవలను గడచిన జూన్‌లోనే ఫేస్‌బుక్ ప్రారంభించింది. ఆటలు, మ్యూజిక్, మీడియా తదితర అంశాలకు సంబంధించిన కంటెంట్‌ను ఫేస్‌బుక్ యూజర్లు ‘యాప్ సెంటర్’ ద్వారా సులువుగా పొందవచ్చు. ఫేస్‌బుక్ డాట్‌కామ్ హోమ్ పేజీలో ఎడుమ వైపున యాప్ సెంటర్ ఐకాన్‌ను ఏర్పాటు చేశారు. ఆపిల్ ఇంకా ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్‌లను యాప్ స్టోర్ సపోర్ట్ చేస్తుంది.

ఫేస్‌బుక్‌లోని కామెంట్‌లను ఏలా ఎడిట్ చెయ్యాలి..?

ప్రఖ్యాత సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్ 800 మిలియన్‌ల యాక్టివ్ యూజర్లతో విరాజిల్లుతోంది. ఈ సైట్‌లోని ప్రతి యూజర్‌కు సగటున 200మంది స్నేహితులు ఉంటారు. ఫేస్‌బుక్ ద్వారా రోజుకు కొన్ని లక్షలు సంభాషణలు చోటుచేసుకుంటాయి. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకన్న ఫేస్‌బుక్ యాజమాన్యం తాజాగా ‘ఎడిట్ కామెంట్ ఫీచర్’ను లాంచ్ చేసింది. ఈ ఫీచర్ అందుబాటులోకి రాకముందు ‘కామెంట్‌ను ఎడిట్ చేసుకునేందుకు వీలు ఉండేది కాదు, డిలీట్ చేసి కొత్తతి పోస్ట్ చెయ్యాల్సి వచ్చేది’. ఈ కొత్త అప్లికేషన్ రాకతో చేసిన కామెంట్‌లో ఏమైన అక్షరదోషాలు తలెత్తితే ఎడిట్ చేసి రీపోస్ట్ చేసుకోవచ్చు.

కామెంట్‌ను ఎడిట్ చేసుకునే విధానం:

- ముందగా మీరు చేసిన కామెంట్ దగ్గరికి వెళ్లండి.

- కామెంట్ పై కర్సర్ పెట్టిన వెంటనే కుడిభాగంలో పెన్సిల్ ఐకాన్ కనిపిస్తుంది.

- పెన్సిల్ ఐకాన్‌ను క్లిక్ చేసిన వెంటనే ‘ఎడిట్ ఆర్ డిలిట్’ ఆప్షన్ ప్రత్యక్షమవుతుంది.

- ఎడిట్ ఆప్షన్ ఎంపిక చేసుకోండి.

- అక్షరదోషాలను సవరించి తిరిగి మీ కామెంట్‌ను రీపోస్ట్ చెయ్యండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X