భారత్‌కు రానున్న ఫేస్‌బుక్ సీఓఓ

Posted By:

భారత్‌కు రానున్న ఫేస్‌బుక్ సీఓఓ

ఫేస్‌బుక్ ముఖ్య కార్యకలాపాల అధికారి (సీఓఓ) షెరీల్ శాండ్‌బర్గ్ జూలై మొదటి వారంలో తొలిసారిగా భారత్‌కు రానున్నారు. భారత్‌లో 10 కోట్ల మందికి పైగా ఫేస్‌బుక్‌ను ఆదరిస్తున్నారు. అమెరికా తరువాత ఫేస్‌బుక్‌ను అత్యధికంగా వినియోగిస్తున్న వారు భారతీయులు కావడం ఓ విశేషం. ఈ నేపధ్యంలో భారత్‌తో తమ కంపెనీ సంబంధాలను మరింతగా మెరుగుపరుచుకునేందుకు శాండ్‌బర్గ్ భారత్‌లో పర్యటించనున్నారు. ఆమె తన పర్యటనలో భాగంగా హైదరాబాద్‌లో చిన్న, మధ్య స్థాయి సంస్థల ప్రతినిధులను కలుసుకుంటారు. తన సందర్శనలో భాగంగా శాండ్‌బర్గ్ భారత ప్రధాని నరేంద్ర మోడీతో భేటి అయ్యే సూచనలు ఉన్నాయి.

బీఎస్ఎన్ఎల్ ఉచిత ఫేస్‌బుక్ యాక్సెస్

వినియోగదారులను ఆకర్షించే క్రమంలో ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ ఉపయుక్తమైన ఆఫర్‌తో ముందుకొచ్చింది. ఇంటర్నెట్ అవసరం లేకుండానే ఫేస్‌బుక్ యాక్సెస్ చేసుకునే సదుపాయాన్ని ప్రత్యేక ఆఫర్‌లో భాగంగా బీఎస్ఎన్ఎల్ కల్పిస్తోంది. ఈ సేవను సద్వినియోగం చేసుకునే యూజర్లు... మూడు రోజుల పథకానికి గాను రూ.4, వారం రోజుల పథకానికి గాను రూ.10, నెల రోజుల పథకానికి గాను రూ.20 చెల్లించాల్సి ఉంటుందని బీఎస్ఎన్ఎల్ ఒక ప్రకటనలో తెలిపింది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

ఇంటర్నెట్‌తో పనిలేకుండా ఫేస్‌బుక్ వాడుకోవచ్చు: బీఎస్ఎన్ఎల్ అన్‌స్ట్రక్షర్డ్ సప్టింమెటరీ సర్వీస్ డేటా (యూఎస్ఎస్‌డి) టెక్నాలజీ ద్వారా ఫేస్‌బుక్ సేవలను అందించేందుకు బీఎస్ఎన్ఎల్, యూ2ఓపోయా (U2opoia) మొబైల్‌తో ఒప్పందాన్ని కదుర్చుకుంది. ఈ సర్వీస్ అన్ని రకాల హ్యాండ్‌సెట్‌లను సపోర్ట్ చేస్తుందని బీఎస్ఎన్ఎల్ వెల్లడించింది. ఈ సేవను ఉపయోగించుకోవటం ద్వారా బీఎస్ఎన్ఎల్ యూజర్లు తమ ఫోన్‌లలో ఇంటర్నెట్‌తో పనిలేకుండా ఫేస్‌బుక్ అకౌంట్‌లకు సంబంధించిన కార్యకలాపాలను నిర్వహించుకోవచ్చు.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot