వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని రిలయన్స్ Jio సేవలు దేశవ్యాప్తంగా సోమవారం నుంచి అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. Read More : ఒకే nbsp;ఆండ్రాయిడ్ ఫోన్ లో రెండు WhatsApp అకౌంట్ లను రన్ చేయటం ఏలా..? 4జీ స్మార్ట్ ఫోన్ ను కలిగి ఉన్న ప్రతి ఒక్కరు జియో సిమ్ ను ఉచితంగా పొందే వెసలుబాటును రిలయన్స్ కల్పించింది. దీంతో, ఈ సిమ్ ను సొంతం చేసుకునేందుకు వందల సంఖ్యలో రిలయన్స్ స్టోర్స్ ముందు బారులుతీరుతున్నారు. ఇప్పటికే జియో సిమ్ ను సొంతం చేసుకున్న యూజర్లు జియో roll-out ప్రాసెస్ పట్ల నిరుత్సాహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు కారణం వారి వారి ఫోన్ లలో జియో సిమ్ కార్డ్ పనిచేయకపోవటమే. రిలయన్స్ Jio SIM ఇన్ స్టాలేషన్ ప్రక్రియలో చోటుచేసుకుంటున్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాలను మీకు సూచించటం జరుగుతోంది.. మీ ఫోన్ 2జీ, 3జీ నెట్ వర్క్ లను మాత్రమే సపోర్ట్ చేస్తుందా..? అయితే రిలయన్స్ జియో 4జీ సిమ్ మీ డివైస్ లో పనిచేయదు. కాబట్టి ముందుగా మీ ఫోన్ నెట్ వర్క్ కనెక్షన్ కు సంబంధించిన స్పెసిఫికేషన్ లను చెక్ చేసుకోండి. 4జీ సపోర్ట్ లేకపోయినట్లయితే మీరు జియో సిమ్ పొందలేరు. 4G-enabled డ్యుయల్ స్మార్ట్ ఫోన్ లలో ఒక సిమ్ స్లాట్ మాత్రమే 4జీ నెట్ వర్క్ ను సపోర్ట్ చేస్తుంది. కాబట్టి, ఆ స్లాట్ లోని జియో సిమ్ ను insert చేయండి. ఇప్పటికే మీరు జియో సిమ్ పొంది కాల్స్ చేసుకోలేకపోవటం, సిగ్నల్ బార్స్ లేకపోవటం వంటి సమస్యలను ఫేస్ చేస్తున్నట్లయితే ఫోన్ ను స్విచాఫ్ చేసిన సిమ్ ను మరోసారి రీఇన్సర్ట్ చేయండి. ఫోన్ సెట్టింగ్స్ లోకి వెళ్లి డేటా ఆప్షన్ ను LTE/4G configurationలోకి మార్చండి. MyJio యాప్ ను తప్పనిసరిగా మీ ఫోన్ లో ఇన్స్ స్టాల్ చేసుకోవల్సి ఉంటుంది. ఒకవేళ యాప్ డౌన్ లోడ్ చేసుకున్నప్పటికి సమస్య పునరావృతమవుతున్నట్లయితే ఖచ్చితంగా మీ డివైస్ ను అప్‍ గ్రేడ్ చేసుకోవల్సిందే. ఇప్పటికే చాలా మంది యూజర్లు రిలయన్స్ జియో లాంచ్ చేసే మొబైల్ నెంబర్ పోర్టబులిటీ సదుపాయం కోసం వేచి చేస్తున్నారు. ప్రసుతానికైతే మొబైల్ నెంబర్ పోర్టబులిటీ గురించి రిలయన్స్ జియో అధికారికంగా ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు.త్వరలో వెలువడే అవకాశముంది.