ధర రూ.3999 కే 120MP కెమెరా, 7000mAh బ్యాటరీ, 6.8 అంగుళాల డిస్‌ప్లే BSNL 5G స్మార్ట్‌ఫోన్..?
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. 4G నెట్‌వర్క్‌ను త్వరలో పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొనేందుకు శరవేగంగా ఏర్పాటు జరగడం, 5G నెట్‌వర్క్ కోసం సన్నాహాలు కూడా జరుగుతున్నాయి. దీంతోపాటు జులై నెలలో ప్రైవేటు టెలికాం సంస్థలు జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్- ఐడియా (VI) మొబైల్ టారిఫ్ ధరలను భారీగా పెంచాయి. అప్పటి నుంచి అనేక లక్షల మంది BSNL కు పోర్టింగ్ అవుతున్నారు. మరియు కొత్త సిమ్ కార్డులను కొనుగోలు చేస్తున్నారు.
అయితే BSNL నుంచి 5G స్మా్ర్ట్‌ఫోన్ (BSNL 5G Smartphone) విడుదల కానుందంటూ ఇటీవల వార్తలు వచ్చాయి. అది కూడా అత్యంత తక్కువ ధరలో అద్భుతమైన ఫీచర్‌లతో లాంచ్ కానుందని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. BSNL 5G స్మార్ట్‌ఫోన్ భారీ బ్యాటరీ సహా భారీ డిస్‌ప్లే, సూపర్ కెమెరా ఫీచర్‌లను కలిగి ఉంటుందని రూమర్లు వచ్చాయి.

BSNL 5G స్మార్ట్‌ఫోన్ కోసం టాటా సంస్థతో ఒప్పందం కుదుర్చుకుందని ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.8 అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని రూమర్లు వచ్చాయి. మరియు మీడియాటెక్ డైమెన్సిటీ 9100 చిప్‌సెట్‌తో విడుదల కానుందని లీక్‌లు వచ్చాయి.
దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్ 120W ఛార్జింగ్ సపోర్టుతో 7000mAh భారీ బ్యాటరీతో విడుదల కానుందని లీక్‌లు వచ్చాయి. ఈ ఛార్జర్‌తో కేవలం 20 నిమిషాల్లో బ్యాటరీని పూర్తిగా చేయవచ్చని అంచనా వేశారు. కెమెరా విభాగం పరంగా 120MP కెమెరా, 16MP అల్ట్రావైడ్ లెన్స్, 5MP డెప్త్ కెమెరాను కలిగి ఉంటుందని గతంలో రూమర్లు వచ్చాయి. దీంతోపాటు 32MP కెమెరాను కలిగి ఉంటుందని అంచనా వేశారు.
స్టోరేజీ వేరియంట్‌ల పరంగా 8GB, 12GB, 16GB ర్యామ్ వేరియంట్‌లు మరియు 128GB, 256GB, 512GB స్టోరేజీ వేరియంట్‌లలో అందుబాటులోకి వస్తుందని లీక్‌లు వచ్చాయి. ఈ హ్యాండ్‌సెట్‌ల ధరలు రూ.4,999 నుంచి రూ.9,999 వరకు ఉంటాయని రూమర్లు వచ్చాయి. ప్రారంభ ఆఫర్‌లో భాగంగా రూ.3999 నుంచి రూ.6999 ధరలకే కొనుగోలు చేయవచ్చని అంచనా వేశారు.
5G స్మార్ట్‌ఫోన్ వార్తలపై BSNL గతంలోనే స్పందించింది. 2024 ఆగస్టు 9 తేదీ X (ట్విట్టర్) వేదికగా దీనిపై కీలక ప్రకటన చేసింది. BSNL 5G స్మార్ట్ ఫోన్ విడుదల కానుందని జరుగుతున్నది అంతా తప్పుడు ప్రచారమని కీలక ప్రకటన చేసింది.
Don't fall for #FakeNews! 🚫
— BSNL India (@BSNLCorporate) August 9, 2024
Get real updates from our official website https://t.co/kvXWJQYHLt#BSNL #FactCheck #FakeNewsAlert pic.twitter.com/NuEKzkXGeH
తాము ఎటువంటి స్మార్ట్‌ఫోన్ ను విడుదల చేయడం లేదని స్పష్టం చేసింది. ఇటువంటి నకిలీ ప్రకటనలతో అప్రమత్తంగా ఉండాలని సూచన చేసింది. అయితే తక్కువ ధరలో ఫీచర్ ఫోన్‌ను విడుదల చేసేందుకు అక్టోబర్ 1న కార్బన్ మొబైల్స్ తో BSNL ఒప్పందం కుదుర్చుకుంది.
దీంతోపాటు దేశవ్యాప్తంగా 4G నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు BSNL ప్రస్తుతం శరవేగంగా పనిచేస్తోంది. గతవారం నాటికే దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో 38 వేలకు పైగా టవర్ల ఏర్పాటు పూర్తయినట్లు కేంద్ర టెలికాం శాఖ మంత్రి జోతిరాదిత్య సింధియా వెల్లడించింది. ఈ సంవత్సరం చివరి నాటికి 75 వేల టవర్ల ఏర్పాటు పూర్తి చేస్తామన్నారు.
దీంతోపాటు 5G నెట్‌వర్క్ ను కూడా ప్రారంభిస్తామని చెప్పారు. జూన్ 2025 నాటికి BSNL 5G నెట్‌వర్క్‌ను పూర్తి చేస్తామని తెలిపారు. 4G నెట్‌వర్క్ కోసం C-DOT మరియు TCS భాగస్వామ్యంతో పూర్తి స్వదేశీయంగా 4G టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు.


Click it and Unblock the Notifications








