Home
News

'BSNL టవర్‌ ఏర్పాటు చేసి రూ.65,000 సంపాదించుకోండి'.. ఆఫర్‌ బాగుంది కానీ..!!

ప్రభుత్వరంగ టెలికాం సంస్థ BSNL (భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌) దేశవ్యాప్తంగా 4G నెట్‌వర్క్‌ ను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా పర్వత ప్రాంతాలు, మారుమూల గ్రామాల్లోనూ 4G టవర్లను ఏర్పాటు చేస్తోంది. 2025 మే నెల నాటికి లక్ష టవర్లను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు 62000 పైగా టవర్లను ఏర్పాటు చేసినట్లు కేంద్ర మంత్రి జోతిరాధిత్య సింధియా ఇటీవల తెలిపారు.

మే నెల నాటికి బీఎస్ఎన్‌ఎల్‌ 4G నెట్‌వర్క్‌! :
మే నాటికి పూర్తిస్థాయిలో బీఎస్‌ఎన్‌ఎల్‌ 4G నెట్‌వర్క్‌ ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. దీంతోపాటు 5G నెట్‌వర్క్‌ ను మే నెల నుంచి ఎంపిక చేసిన ప్రాంతాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. 4G కోసం బీఎస్‌ఎన్‌ఎల్‌. టీసీఎస్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. మరియు 4G నుంచి 5G నెట్‌వర్క్‌ కు సులభంగా అప్‌గ్రేడ్‌ అయ్యే విధంగా టెక్నాలజీని అభివృద్ధి చేస్తోంది.

BSNL Responds on fake website on towers installation

ఈ నకిలీ BSNL వెబ్‌సైట్‌ తో జాగ్రత్త :
అయితే BSNL 4G టవర్ల ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉందంటూ కొందరు వ్యక్తులు ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం ఏకంగా bsnltoweroffice.com పేరుతో వెబ్‌సైట్‌ ను ఏర్పాటు చేశారు. టవర్లు ఇన్‌స్టాల్‌ చేసేందుకు అవకాశం ఉందని అందులో ప్రకటన చేశారు.

నెలకు రూ.65000 వరకు సంపాందించవచ్చని చెప్పి.. :
తమ ఖాళీ స్థలాల్లో మరియు ఇళ్లపై టవర్లను ఏర్పాటు చేసేందుకు వన్‌టైం అడ్వాన్స్‌ చెల్లించి ఈ వెబ్‌సైట్‌ లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. వెరిఫికేషన్‌ అనంతరం అనుమతులు ఇస్తామని ఈ వెబ్‌సైట్‌ లో పేర్కొ్న్నారు. ప్రతి నెల గరిష్ఠంగా రూ.65,000 పొందవచ్చని వెబ్‌సైట్‌ ప్రకటనలో పేర్కొన్నారు.

అధికారిక ప్రకటన చేసిన BSNL :
అయితే ఈ వెబ్‌సైట్‌ పై BSNL తన అధికారిక సోషల్‌మీడియా అకౌంట్‌లో కీలక ప్రకటన చేసింది. bsnltoweroffice.com వెబ్‌సైట్‌ నకిలీదని స్పష్టం చేసింది. ఈ వెబ్‌సైట్‌తో బీఎస్‌ఎన్‌ఎల్‌కు ఎటువంటి సంబంధం లేదని తెలిపింది. మరిన్ని వివరాలకు bsnl.co.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించింది.

నేరగాళ్లు వివిధ మార్గాల్లో ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అధికారిక సమాచారం కోసం BSNL అధికారిక వెబ్‌సైట్‌ ను మాత్రమే సందర్శించాలి. మరియు మీ సమీపంలోని సంస్థ కార్యాలయానికి వెళ్లి, పూర్తి వివరాలు తెలుసుకోవాలి. ఈ తరహా వెబ్‌సైట్‌ల కారణంగా మోసపోతే ఆయా సంస్థలు ఎటువంటి బాధ్యత తీసుకోవని గుర్తుంచుకోవాలి.

బీఎస్‌ఎన్‌ఎల్‌కు కలిసి వచ్చిన 2024 రెండో భాగం :
ఈ సంవత్సరం జులై నెలలో ప్రైవేటు టెలికాం సంస్థలు మొబైల్‌ రీఛార్జ్ ధరలను భారీగా పెంచాయి. దీంతో అనేక మంది యూజర్లు BSNL వైపు మొగ్గు చూపుతున్నారు. అక్టోబర్‌ నెలలో 5 లక్షలు, సెప్టెంబర్‌ లో 5 లక్షలు, ఆగస్టులో 25 లక్షలు, జులై నెలలో 29 లక్షల మంది యూజర్లను బీఎస్‌ఎన్‌ఎల్‌ నెట్‌వర్క్‌ లో చేరారని ట్రాయ్‌ తన నివేదికలో వెల్లడించింది.

More from GizBot

Best Mobiles in India

English summary
Fact Check BSNL Responds on fake website on towers installation full details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X