ఇండియాలో వాట్సప్ వాడాలంటే డబ్బులు కట్టాలి,వైరల్ అవుతున్న న్యూస్

By Gizbot Bureau
|

ఇకపై ఇండియాలో వాట్సప్ వాడాలంటే ప్రతి ఒక్కరూ డబ్బులు చెల్లించాల్సిందే. ఈ మేరకు ప్రధాని నరేంద్రమోడీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇలాంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి వాటిల్లో నిజమెంత నిజంగానే వాట్సప్ ఇండియాలో మూతపడనుందా...లేక వాట్సప్ వాడాలంటే డబ్బులు చెల్లించాల్సిందేనా అని చాలామంది తర్జనభర్జనలు పడుతున్నారు.

Misinformation about WhatsApp widely circulated on WhatsApp

ఈ వార్తల పై వాట్సప్ , ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ల నుంచి అధికారికంగా ఏదైనా ప్రకటన వచ్చిందా అని ఇంటర్నెట్ మొత్తం వెతికేస్తున్నారు. అయితే ఈ న్యూస్ అంతా ఒట్టి పుకారేనని కంపెనీలు తెలిపాయి. సోషల్ మీడియాలో వస్తున్న వార్తను ఓ సారి పరిశీలిస్తే..

48 గంటల్లో Whatsaap అకౌంట్

48 గంటల్లో Whatsaap అకౌంట్

వాట్సప్‌లో మెసేజ్‌లు రాత్రి 11:30 గంటల నుంచి ఉదయం 6:00 గంటల వరకు ప్రతి రోజు నిలిపివేయాలని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రకటించింది. Whatsaap ఎక్కువగా ఉపయోగిస్తున్నవారు ఈ మెసేజ్‌ని Whatsaapలో ఇతరులకు పంపమని చెబుతున్నారు. మీరు ఈ మెసేజ్‌ని పంపని యెడల మీ Whatsaap అకౌంట్ చెల్లదు. మరియు 48 గంటల్లో Whatsaap అకౌంట్ తొలగించబడుతుంది. ఈ మెసేజ్ ఫేక్ అని అనుకోకండి.

 10 మందికి forward

10 మందికి forward

ఎందుకంటే మీ Whatsaap అకౌంట్ తిరిగి మీరు మళ్ళీ వాడాలి అంటే ఈ మెసేజ్‌ని మినిమమ్ 10 మందికి forward చేయండి. ఫార్వర్డ్ చేయలేదంటే నెలకు 499 రూపాయలు బిల్ పే చేసి Whatsaap వాడాల్సి వస్తుంది. కనుక మీ Whatsaap అకౌంట్లో ఉన్న 50 మందిలో ఒక 10 మందికి అయిన షేర్ చెయ్యండి. ఇలా చేస్తే శనివారానికి మీ Whatsaap బిల్లు పడదు. మేము కూడా ఫొటోస్ చూపించని సమస్యను ఎదుర్కొంటున్నాము. కాబట్టి కనీసం పది మందికి ఈ మెసేజ్‌ను ఫార్వర్డ్ చేయండి'' అనే మెసేజ్ సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అవుతోంది. చదువుకున్న వాళ్లు సైతం ఇది నిజమేనని నమ్ముతున్నారు.

నమ్మితే అడ్డంగా బుక్కైనట్టే

నమ్మితే అడ్డంగా బుక్కైనట్టే

ఈ మెసేజ్ నమ్మేశారా? నమ్మితే అడ్డంగా బుక్కైనట్టే. సరిగ్గా ఇదే మెసేజ్ కొంతకాలంగా వాట్సప్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ మెసేజ్ పచ్చి అబద్ధం. ఇందులో నిజం లేదు. కేవలం ఫేక్ న్యూస్ మాత్రమే. ఇది నమ్మేసి మెసేజెస్ ఫార్వర్డ్ చేయకండి. ఇదొక్కటే కాదు... "వాట్సప్‌ను రిలయెన్స్ అధినేత ముకేష్ అంబానీకి అమ్మేశారు. ఇకపై వాట్సప్‌ను ముకేష్ అంబానీ నడిపిస్తారు. ఈ మెసేజ్‌ను 10 మందికి పంపిస్తే వాట్సప్ లోగో మారుతుంది" అని వాట్సప్ డైరెక్టర్ వరుణ్ పుల్యానీ పేరుతో మరో మెసేజ్ వైరల్‌గా మారింది. ఇది కూడా ఫేక్ న్యూసేనని తెలుస్తోంది.

 ఎలాంటి బిల్ వసూలు చేయదు

ఎలాంటి బిల్ వసూలు చేయదు

వాస్తవానికి వాట్సప్ ఎలాంటి బిల్ వసూలు చేయదు. వాట్సప్‌లో ఏవైనా మార్పులు ఉంటే కంపెనీనే అధికారికంగా తెలుపుతుంది. అంతే తప్ప ఇలాంటి ఫార్వర్డ్ మెసేజ్‌ల ద్వారా సమాచారం రాదు. ఇంతకుముందు వాట్సప్‌లో ఫొటోలు కనిపించడం లేదంటున్నారు. ఈ సమస్య వాట్సప్‌తో పాటు ఆ సంస్థకు చెందిన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ యాప్‌ల్లోనూ తలెత్తింది. ఈ ప్రాబ్లంను సంస్థ కొద్ది గంటల వ్యవధిలోనే పరిష్కరించింది. సర్వర్లలో సమస్య వల్ల వాట్సప్ , ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో ఈ సమస్య వచ్చింది.

 థర్డ్ పార్టీ కంపెనీల చేతుల్లో పెట్టడమే

థర్డ్ పార్టీ కంపెనీల చేతుల్లో పెట్టడమే

ఇదిలా ఉంటే ఫేస్ బుక్, సొంత మెసేంజర్ యాప్ వాట్సప్ సేవలు మళ్లీ నిలిచిపోనున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. యూజర్ల డేటాను నిర్వహించేందుకు ఇప్పటికే సోషల్ మీడియా సంస్థలు థర్డ్ పార్టీ కంపెనీల చేతుల్లో పెట్టడమే ఇందుకు కారణమని సంబంధింత వర్గాలు చెబుతున్నాయి. ఆయా కంపెనీలు యూజర్ల డేటా నిర్వహణలో ఏ చిన్న పొరపాటు చేసిన వాట్సప్, ఫేస్ బుక్ సర్వీసుల మొత్తానికే అంతరాయం కలుగుతోందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వాట్సప్, ఫేస్ బుక్ సేవలకు తరచూ అంతరాయం ఏర్పడటంతో యూజర్లకు ఇబ్బందులు తప్పడం లేదు.

 యూజర్ల నుంచి సోషల్ మీడియాకు ఫిర్యాదులు

యూజర్ల నుంచి సోషల్ మీడియాకు ఫిర్యాదులు

ఇప్పటికే సర్వీసులు నిలిచిపోవడంపై యూజర్ల నుంచి సోషల్ మీడియాకు ఫిర్యాదులు చేస్తున్నారు. ఫేస్‌బుక్ సర్వర్లలోనే ఇన్ స్టాగ్రామ్, వాట్సప్ యూజర్ల డేటాను స్టోర్ చేసి నిర్వహిస్తున్నారు. సర్వర్లలో లోపం తలెత్తడం కారణంగానే పదేపదే వాట్సప్ సేవలకు అంతరాయం కలుగుతున్నట్టు కనిపిస్తోంది. దక్షిణ అమెరికా, యూరోప్ దేశాల యూజర్ల నుంచే నుంచే ఎక్కువ సంఖ్యలో ఫిర్యాదులు రాగా, భారత యూజర్ల నుంచి వాట్సప్ సేవల్లో పెద్దగా సమస్యలు లేవని డౌన్ డిటెక్టర్ వెల్లడించింది.

Best Mobiles in India

English summary
FACT CHECK: Misinformation about WhatsApp widely circulated on WhatsApp

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X