Home
News

శాటిలైట్‌ నుంచి ఇంటర్నెట్‌, సోలార్ ఛార్జింగ్‌తో పనిచేసే స్మార్ట్‌ఫోన్‌ను Tesla విడుదల చేయనుందా..?

ఎలాన్‌ మస్క్‌.. అసలు పరిచయం అవసరం (Elon Musk) లేని పేరు. నెట్టింట ఎప్పడూ ట్రెండింగ్‌లో ఉండే పేర్లలో మస్క్ ఒకరు. మస్క్‌తోపాటు పాటు తన సంస్థ టెస్లా (Tesla) కూడా ఎంతో ప్రత్యేకం. టెస్లా పేరుతో అధునాతన టెక్నాలజీతో ఇప్పటికే ఎలక్ట్రిక్‌ కార్లను ఉత్పత్తి చేస్తున్నారు. స్టార్ లింక్‌ పేరుతో ఇంటర్నెట్‌ సేవలను అందిస్తున్నారు. X (గతంలో ట్విట్టర్‌) లోనూ ఇటీవల కీలక మార్పులు చేశారు.

టెస్లా స్మార్ట్‌ఫోన్‌ ? :
ఎలాన్ మస్క్‌ నుంచి కార్లు సహా ఇతర సర్వీసులు ఎంతో ప్రత్యేకం. ఎన్నో అధునాతన ఫీచర్లు సహా మెరుగైన సేవలు అందించే విధంగా ఉన్నాయి. అయితే మస్క్‌ సంస్థల నుంచి స్మార్ట్‌ఫోన్‌ లు (Tesla Smartphone) కూడా విడుదల కానున్నాయని, సోలార్‌ ఛార్జింగ్‌ తో పనిచేస్తాయని ఎప్పటి నుంచో రూమర్లు వినిపిస్తున్నాయి.

is tesla plans to launch solar charged smartphone

సోలార్‌ ద్వారా ఆటోమేటిక్‌ ఛార్జింగ్‌ ?
టెస్లా స్మార్ట్‌ఫోన్‌ లు ప్రత్యేక ఫీచర్‌లను కలిగి ఉంటాయని సోషల్‌ మీడియా లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఛార్జింగ్‌ అవసరం లేకుండా నేరుగా సోలార్‌ ద్వారా ఆటోమేటిక్‌ ఛార్జింగ్‌ అవుతుందని (Tesla Solar Powered Smartphone) రూమర్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే సోలార్‌ ఎనర్జీని టెస్లా సంస్థ భారీగా వినియోగించుకుంటోంది.

శాటిలైట్ ఇంటర్నెట్‌ :
దీంతోపాటు నేరుగా ఉపగ్రహాల సాయంతో ఇంటర్నెట్‌ ను వినియోగించుకొనేందుకు అవకాశం ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే స్టార్‌ లింక్‌ పేరుతో ఎలాన్‌ మస్క్‌ ఇంటర్నెట్‌ సేవలు అందిస్తున్నారు. ఉపగ్రహాల సాయంలో మారుమూల ప్రాంతాల్లోనూ ఇంటర్నెట్‌ ను వినియోగించుకోవచ్చు. ప్రస్తుతం భారత్‌లో ఈ సేవలు అందించేందుకు చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

ఫలితంగా టెస్లా స్మార్ట్‌ఫోన్‌ కూడా ఈ ఫీచర్‌ను కలిగి ఉంటుందని సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీంతోపాటు మరిన్ని ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లతో స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ చేస్తారని భావిస్తున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్ ధర సుమారు 100 డాలర్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. డిజైన్‌ సహా నాణ్యమైన కెమెరాలు సహా పూర్తి అధునాతనంగా ఫోన్‌ ఉండబోతోందని రూమర్లు వినిపిస్తున్నాయి.

అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌పై టెస్లా ఎటువంటి అధికారిక ప్రకటన చేయకపోయినా ఎలాన్‌ మస్క్‌ గతంలోనే స్పందించారు. ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌లను ఉత్పత్తి చేసే ఉద్దేశం తనకు లేదని, సంబంధిత పరిశ్రమ కూడా తనకు లేదని ఎలాన్‌ మస్క్‌ గతంలోనే ప్రకటన చేశారు. తనకు స్మార్ట్‌ఫోన్‌లు తయారు చేసే సంస్థను ఏర్పాటుచేసే ఆసక్తి లేదని మస్క్‌ స్పష్టం చేశారు. అయినా సోషల్ మీడియాలో మాత్రం పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.

ఇప్పటి వరకు ఉన్న వివరాల ఆధారంగా టెస్లా సంస్థ ఎటువంటి స్మార్ట్‌ఫోన్‌లను తయారు చేయడం లేదు. అయితే స్టార్‌ లింక్ ద్వారా భారత్‌లో సేవలు అందించేందుకు మాత్రం చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. గతంలో BSNL నుంచి కూడా మూడు నుంచి ఐదు వేలలో అదిరిపోయే స్మార్ట్‌ఫోన్‌ విడుదల కానుందంటూ పెద్ద ఎత్తువ ప్రచారం జరిగింది. ఈ వార్తలను BSNL ఇప్పటికే ఖండించింది. ప్రస్తుతం ఎటువంటి స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేయడం లేదని వెల్లడించింది.

Best Mobiles in India

English summary
Factcheck Does Tesla plan to launch solar powered smartphone? Here is the Elon Musk response
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X