సముద్రం లోపల వైర్ల గురించి మీకు తెలియని నిజాలు

మీరు ఇంట్లో కూర్చుని కంప్యూటర్‌లో మెయిల్‌ ఓపెన్‌ చేస్తే, సెకను వ్యవధిలోనే, సముద్రాల అవతల అమెరికాలో ఎక్కడో ఉన్న సర్వర్‌కు ఆ సందేశం వెళుతుంది. అంతే వేగంగా డేటా మళ్లీ మీకు చేరుతోంది. మరి అది ఎలా సాధ్యమవు

|

మీరు ఇంట్లో కూర్చుని కంప్యూటర్‌లో మెయిల్‌ ఓపెన్‌ చేస్తే, సెకను వ్యవధిలోనే, సముద్రాల అవతల అమెరికాలో ఎక్కడో ఉన్న సర్వర్‌కు ఆ సందేశం వెళుతుంది. అంతే వేగంగా డేటా మళ్లీ మీకు చేరుతోంది. మరి అది ఎలా సాధ్యమవుతోంది? అక్కడి నుంచి ఇక్కడికి ఎవరైనా కేబుల్‌ వేశారా? క్షణాల్లో సమచారాం చేరేందుకు టెక్నిక్ ఏమైనా ఉందా అంటే ఉందనే సమాధానం వస్తోంది.

సముద్రం లోపల వైర్ల గురించి మీకు తెలియని నిజాలు

దీనికి ప్రధాన కారణం సముద్ర గర్భంలో ఉన్న కేబుల్స్. ఈ కేబుల్స్ ద్వారానే డేటా ప్రసారం జరుగుతోంది. క్షణాల్లో సమాచారం ప్రపంచంలో ఎక్కడికైనా చేరుతోంది. ఈ శీర్షికలో భాగంగా దీని గురించి మరికొన్ని ఆసక్తికర విషయాలను అందిస్తున్నాం. ఓ స్మార్ట్ లుక్కేయండి.

ఈ పని చాలా లేటు చాలా ఖర్చుతో కూడుకున్నది.

ఈ పని చాలా లేటు చాలా ఖర్చుతో కూడుకున్నది.

ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్ డేటా దాదాపు 99 శాతం సముద్రంలో ఉన్న కేబుల్స్ ద్వారానే జరుగుతుంది. దీన్నే submarine communications cables అంటారు. వేలమైళ్ల దూరం ఈ కేబుల్స్ వేసి ఉంచారు. ఇంకా చెప్పాలంటే ఎవరెస్ట్ శిఖరం కన్నా ఎక్కువగానే ఈ లైన్స్ పొడవు ఉంటుంది.సముద్రంలో దాదాపు 8 వేల అడుగుల లోతులో ఈ కేబుల్స్ ఉంటాయి. మరి ఇంత లోతుల్లోకి కేబుల్స్ వెళ్లాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నది. సమయం చాలా ఎక్కువ అవుతుంది.

షార్క్ చేపల బెడద

షార్క్ చేపల బెడద

మరి ఇంత కష్టపడి సముద్రం లోపల వైర్లను ఏర్పాటు చేస్తే వీటికి షార్క్ చేపల రూపంలో ప్రమాదం ముంచుకోస్తోంది. అవి ఈ కేబుల్స్ ని తమ పదునైన దంతాలతో కొరికివేస్తున్నాయి. దీంతో రిపేరింగ్ తలకు మించిన పని అవుతోంది.

అణుక్షణం ప్రమాదమే

అణుక్షణం ప్రమాదమే

ఈ కేబుల్స్ కి అనుక్షణం ప్రమాదం ముంచుకొస్తోంది. ప్రకృతి వైపరీత్యాలు, సముద్రంలో ఏర్పడే సుడిగుండాలు,లాంటి వైపరీత్యాలకు ఇవి నాశనం అవుతున్నాయి. వీటిని ఓ సారి రిపేర్ చేయాలంలో ఎంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారంలా మారింది.

7,50,000 మైళ్ల పొడవైన కేబుల్‌

7,50,000 మైళ్ల పొడవైన కేబుల్‌

న్యూయార్క్‌ నుంచి సిడ్నీ, హాంకాంగ్‌ నుంచి లండన్‌... ఇలా ప్రపంచంలోని ప్రధానమైన నగరాలన్నింటిని అనుసంధానం చేస్తూ కేబుల్‌ను ఏర్పాటు చేశారు. కొన్ని వేల మైళ్ల దూరంలో ఉన్న ఈ నగరాలను సముద్రంలో నుంచి కేబుల్‌లు ఏర్పాటు చేసి అనుసంధానించారు. ఇప్పటికే 7,50,000 మైళ్ల పొడవైన కేబుల్‌ ప్రపంచంలోని అన్ని ఖండాలను కలుపుతోంది. 99 శాతం డేటా సముద్రంలో ఉన్న కేబుల్‌ ద్వారానే ప్రసారమవుతోంది.

సెకను వ్యవధిలోనే

సెకను వ్యవధిలోనే

ఈ కేబుల్‌ గుండా ఫైబర్‌ ఆప్టిక్‌ టెక్నాలజీ ద్వారా డేటా కాంతి వేగంతో ప్రయాణిస్తుంది. సముద్రంలోని కేబుల్‌ ద్వారా ప్రయాణించిన డేటా భూమి ఉపరితలానికి చేరుకున్న తరువాత నెట్‌వర్క్‌కు కనెక్ట్‌ అవుతుంది. ఎవరైతే ఈ మెయిల్‌ ఓపెన్‌ చేయడానికి క్లిక్‌ చేశారో వారి డివైజ్‌కు డేటా చేరుతుంది. ఇదంతా సెకను వ్యవధిలోనే జరిగిపోతుంది.

గూగుల్‌ సొంతంగా

గూగుల్‌ సొంతంగా

లాటిన్‌ అమెరికాలో ఉన్న అతిపెద్ద డేటా సెంటర్‌ కోసం అమెరికా నుంచి చిలీ వరకు గూగుల్‌ సొంతంగా సముద్రంలో నుంచి కేబుల్‌ వేసే ఆలోచనలో ఉంది. ఈ ప్రాజెక్టు తరువాత వర్జీనియా నుంచి ఫ్రాన్స్‌కు కొత్త కేబుల్‌ వేయాలని గూగుల్‌ యోచిస్తోంది. గూగుల్‌ ప్రపంచవ్యాప్తంగా 13 డేటా సెంటర్లను ప్రారంభించింది. మరో ఎనిమిది నిర్మాణదశలో ఉన్నాయి.

శాటిలైట్ల కన్నా కేబుల్ప్ చాలా తక్కువ, మన్నికైనవి

శాటిలైట్ల కన్నా కేబుల్ప్ చాలా తక్కువ, మన్నికైనవి

విశ్వంలో ఇప్పుడు వేయికు పైగా శాటిలైట్లు చక్కర్లు కొడుతున్నాయి. అలాగే మార్స్ మీదకు మిషన్ కూడా పంపించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఈ శాటిలైట్లు పంపించే డేటా కన్నా సబ్ మెరైన్ కేబుల్స్ ద్వారా పంపే డేటా చాలా వేగంగా జరుగుతుంది.

ఎలా వేస్తారు

ఎలా వేస్తారు

సముద్రగర్భంలో నుంచి కేబుల్‌ వేసే ముందు ఏ మార్గంలో వేయాలో చెక్‌ చేస్తారు. ఒకసారి కేబుల్‌ వేస్తే కనీసం 25 ఏళ్లపాటు సేవలు అందించాల్సి ఉంటుంది. ముందుగా కేబుల్‌ను షిప్‌లోకి ఎక్కిస్తారు. దాదాపు 4 వేల మైళ్లు పరిచేందుకు సరిపోయే కేబుల్‌ను షిప్‌లోకి ఎక్కిస్తారు. అంటే 3500 మెట్రిక్‌ టన్నుల బరువుతో సమానం.

మొదట ట్రాన్స్‌-అట్లాంటిక్‌ కేబుల్‌

మొదట ట్రాన్స్‌-అట్లాంటిక్‌ కేబుల్‌

అమెరికా - బ్రిటన్‌ దేశాల మధ్య మొదట ట్రాన్స్‌-అట్లాంటిక్‌ కేబుల్‌ను 1858లో ఏర్పాటు చేశారు. క్వీన్‌ విక్టోరియా అమెరికా అధ్యక్షుడు జేమ్స్‌ బుకానన్‌కు ఈ కేబుల్‌ ద్వారా సందేశం పంపారు. ఆ సందేశం చేరుకోవడానికి 16 గంటల సమయం పట్టింది.

Best Mobiles in India

English summary
Here are 10 things you might not know about the Internet’s system of undersea cables

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X