అమీర్‌పేట్‌లో ఘోరం

Written By:

తాను తయారు చేసిన సోషల్ నెట్‌వర్కింగ్ యాప్ విఫలమవటంతో తీవ్రమనస్థాపానికి గురైన ఓ హైదరబాద్ టెక్కీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని ఎస్ఆర్ నగర్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... అమీర్‌పేట్‌లోని స్వర్ణ ప్లాజా అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్న 33 సంవత్సరాల సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ లక్కీ గుప్తా అగర్వాల్ సోషల్ నెట్‌వర్కింగ్ ప్రపంచంలోకి ఓ శక్తింతమైన అప్లికేషన్‌ను తీసుకురావాలనుకున్నారు. ఇందుకు సంబంధించిన ఓ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు.

అమీర్‌పేట్‌లో ఘోరం

ప్రాజెక్ట్ ఆశించిన స్థాయిలో ఫలితాలను రాబట్టకపోగా, నష్టాలను మిగల్చటంతో తీవ్ర నిరాశా నిస్పృహలకు లోనైన అగర్వాల్ మంగళవారం రాత్రి నైట్రో గ్యాస్‌ను ఓ పాలిథిన్ కవర్‌లోకి ఎక్కించుకుని మెడ నిండా ఈ కవర్‌ను చుట్టుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి విచారణ జరిపిన పోలీసులు అగర్వాల్ గదిలో ఓ సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్నారు. పెయిన్ లెస్ గా ఉంటుందని గ్యాస్ సిలిండర్ ద్వారా ఆత్మహత్య చేసుకుంటున్నానని అగర్వాల్ ఆ నోట్‌లో పేర్కొన్నారు.

Read More : ఏప్రిల్ ఆఫర్స్, రూ.6,999కే 3జీబి ర్యామ్ ఫోన్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

కలవరపెడుతోన్న శాస్త్రవేత్తల అసహజ మరణాలు

ఇప్పుడు మన కళ్ల ముందుకు వచ్చాయి. యావధ్భారతం షాక్‌తో తల్లడిల్లే కఠోర వాస్తవాలు ఇప్పుడు అణు ఇంధన విభాగం నుంచి మన కళ్ల ముందుకు వచ్చాయి. దేశ భధ్రతకు ఆయువు పట్టుగా నిలిచే అణు శాస్ర్తవేత్తల అసహజమరణాలు ఒక్కసారిగా దేశ ప్రజలను కంటతడి పెట్టిస్తున్నాయి. రక్షణ వ్యవస్థకు మూల స్థంభంగా నిలిచే అణ్వాయుధాలను తయారు చేసే శాస్ర్తవేత్తలను భారత్ కోల్పోయింది. ఒకరు ఇద్దరు కాదు దాదాపు ఏకంగా 11 మందిని గడిచిన నాలుగేళ్లలో ఇండియా కోల్పోయింది.

కలవరపెడుతోన్న శాస్త్రవేత్తల అసహజ మరణాలు

చనిపోయిన అణు శాస్ర్తవేత్తలవి అసహజమరణాలేనన్న కఠోర వాస్తవం భారత్ ను ఆందోళనకు గురిచేస్తోంది. సమాచారహక్కు చట్టం కింద దాఖలైన ఓ దరఖాస్తుకు అణు శక్తి విభాగం ఇచ్చిన సమాధానం ఈ ఆందోళనకర వాస్తవాలను వెలుగులోకి తెచ్చింది.

కలవరపెడుతోన్న శాస్త్రవేత్తల అసహజ మరణాలు

చనిపోయిన 11 మంది అణు శాస్ర్తవేత్తల్లో ఎక్కువమంది ఆత్మహత్య చేసుకుని తనువు చాలించడం మరింత దిగ్భాంతికి గురి చేస్తోంది.ఓ శాస్ర్తవేత్త రోడ్డు ప్రమాదంలో చనిపోగా ఇద్దరు శాస్ర్తవేత్తలు ప్రయోగశాలల్లో జరిగిన పేలుల్లో మరణించారు.

కలవరపెడుతోన్న శాస్త్రవేత్తల అసహజ మరణాలు

ట్రాంబేలోని బార్క్ లో పని చేస్తున్న ఇద్దరు శాస్ర్తవేత్తలు ఉరేసుకుని చనిపోయారు. మరో ఇద్దరు శాస్ర్తవేత్తలు నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఓ సైంటిస్ట్ ను ముంబైలోని ఆయన స్వగృహంలోనే గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ఈ ఘటనకు సంబంధించిన నిందితులను గుర్తించడంలో పోలీసులు ఇప్పటిదాకా ఎలాంటి పురోగతి సాధించలేదు.

కలవరపెడుతోన్న శాస్త్రవేత్తల అసహజ మరణాలు

ముంబైలో బాబా ఆటోమేటిక్ రీసెర్చ్ లో అణు శాస్ర్తవేత్తగా పని చేస్తున్న బాబా పాటక్ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు.ఈయన బైక్ మీద వెళ్తుండగా సహచర శాస్ర్తవేత్త కారు అనుకోకుండా ఢీకొట్టింది. దీంతో ఆయన తలకు బలమైన గాయం తగిలి అక్కడికక్కడే మరణించారు.

కలవరపెడుతోన్న శాస్త్రవేత్తల అసహజ మరణాలు

2012 ఫిబ్రవరి బాబా ఆటో మేటిక్ రీసెర్చ్ లో అణు శాస్ర్తవేత్తగా పని చేస్తున్న మరో సైంటిస్ట్ మాధవన్ అయ్యర్ ని గుర్తు తెలియని వ్యక్తులు చంపేశారు. ముంబైలోని ఆయన ఇంటిలో ఈ దారుణ ఘటన జరిగింది.ఈ ఘటనకు సబంధించి నిందుతులును గర్తించడంలో పోలీసులు ఎటువంటి పురోగతి ఇప్పటిదాకా సాధించలేదు.

కలవరపెడుతోన్న శాస్త్రవేత్తల అసహజ మరణాలు

మాధవన్ అయర్‌ని కోల్పోయిన కొద్ది రోజులకే మరో షాక్. ముంబైలోని బాబా ఆటోమేటిక్ రీసెర్చ్ లో అణుశాస్త్రవేత్తగా పనిచేస్తున్న టిటాస్ పాల్ ఇంట్లోనే ఉరి వేసుకుని చనిపోయింది..ఈమె వయస్సు కేవలం 27 సంవత్సరాలు.నార్త్ ముంబైలోని ట్రాంబేలోని బార్క్ కాలనీలో నివాసముంటున్నారు. మరో అణు శాస్ర్తవేత్త మాధవన్ అయర్ మరణించిన 10 రోజులకే ఈ యువ శాస్ర్తవేత్త తీరని లోకాలకు వెళ్లారు. ఎందుకున్నది వివరాలు తెలియలేదు.

కలవరపెడుతోన్న శాస్త్రవేత్తల అసహజ మరణాలు

ఇక ముంబైలోని బాబా ఆటోమేటిక్ రీసెర్చ్ లో జరిగిన పేలుడులో ఇద్దరు యువ శాస్ర్తవేత్తలు మరణించారు. ఈ ఇద్దరు యువ శాస్ర్తవేత్తలు ప్రయోగశాలల్లో తమ ప్రయోగంలో నిమగ్నమై ఉండగా అనుకోకుండా పేలుడు సంభవించింది. వారు ఆ పేలుడు ధాటికి అక్కడికక్కడే మరణించారు చనిపోయిన యువ శాస్ర్తవేత్తల పేర్లు ఉమాంగ్ సింగ్,ప్రీతం బాగ్

కలవరపెడుతోన్న శాస్త్రవేత్తల అసహజ మరణాలు

బార్క్ సైంటిస్ట్ ఉమెన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షురాలు అలాగే బాబా ఆటేమేటిక్ రీసెర్చ్ లో అణు శాస్త్రవేత్త కూడా జీవితం మీద విర్తకి కలిగిందో ఏమో కాని సూసైడ్ చేసుకున్నారు. ఉమా నర్సింగరావు అనే 64 సంవత్సరాలు సీనియర్ శాస్ర్తవేత్త తన నివాసంలో సూసైడ్ చేసుకున్నారు. ఇది కూడా నార్త్ ముంబైలోని ట్రాంబేలో జరగడం చాలా బాధాకరమైన విషయం.

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Failed app drives Hyderabad techie to suicide. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot