కారు చలాన్ చెల్లించేందుకు ప్రయత్నం చేసి రూ.3 లక్షలు కోల్పోయాడు.. మీరు ఇలానే చేస్తున్నారా..?
సైబర్ నేరాలు రోజు రోజుకు గణనీయంగా పెరుగుతున్నాయి. అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ ఆధారంగా నేరగాళ్లు అనేక మందిని మోసం చేస్తున్నారు. SMS, ఈమెయిల్, వాట్సాప్ ద్వారా లింక్‌లు (Fake Challan Scam) పంపిస్తున్నారు. వాటిని క్లిక్ చేస్తున్న బాధితులు భారీగా మోసపోతున్నారు.
ఆ యాప్ ఇన్‌స్టాల్ చేసి.. :
తాజాగా ఇటువంటి ఘటన జరిగింది. ఫేక్ చలాన్ కారణంగా ముంబైకి చెందిన ఓ వ్యాపారవేత్త ఏకంగా రూ.3 లక్షలు కోల్పోయారు. కొన్ని రోజుల క్రితం ముంబైకి చెందిన వ్యక్తికి SMS రూపంలో కారు చలాన్ వచ్చింది. ట్రాఫిక్ పోలీసుల నుంచి వచ్చిందని భావించిన సదరు వ్యక్తి ఆ మెసెజ్‌లో వచ్చిన సూచనలకు అనుగుణంగా Vahanparivahann.apk యాప్‌ను ఇన్‌స్టాల్ చేశారు.

అప్పటికి వారం రోజుల తర్వాత.. :
ఆ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసి చలాన్ రుసుం చెల్లించేందుకు ప్రయత్నించినా వీలుకాలేదు. అప్పటికి వారం రోజుల తర్వాత తన క్రెడిట్ కార్డు నుంచి అనధికారిక లావాదేవీలను గుర్తించారు. అలా ఏకంగా క్రెడిట్ కార్డు నుంచి 31 లావీదేవీలను గుర్తించారు. ఫలితంగా రూ.3 లక్షల రూపాయలను కోల్పోయారు. అనంతరం మోసపోయానని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఫిషింగ్ యాప్‌గా గుర్తించిన పోలీసులు :
ప్రాథమిక దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆ వ్యక్తి తన ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసిన యాప్‌ను ఫిషింగ్ యాప్‌గా గుర్తించారు. ఆ యాప్ ద్వారా నకిలీ ఇ-చలాన్‌ను చెల్లించేందుకు ప్రయత్నించిన సమయంలో నమోదు చేసిన వివరాలను సైబర్ నేరగాళ్లు వినియోగించుకొని నగదును కాజేశారని పోలీసులు గుర్తించారు.
నిరంతరం అప్రమత్తంగా ఉండాలి :
ఇలాంటి సైబర్ దాడులకు గురికాకుండా ఉండేందుకు నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. ట్రాఫిక్ పోలీసుల నుంచి వచ్చిన చలాన్‌లో వచ్చిన లింక్ ద్వారా యాప్‌లను డౌన్‌లోడ్ చేయాలని కోరే అవకాశం లేదు. ఇలాంటి మెసేజ్ లోని లింక్‌లను క్లిక్ చేసే ముందు అప్రమత్తంగా వ్యవహరించాలి.
అధికారిక వెబ్‌సైట్‌ల ద్వారా మాత్రమే :
దీంతోపాటు చలాన్ వంటి మెసేజ్‌లు ఎప్పుడూ కూడా అధికారిక వెబ్‌సైట్‌ల ద్వారా మాత్రమే చెల్లించాలని సూచిస్తాయి. అంతే కానీ గుర్తుతెలియని యాప్‌లను డౌన్‌లోడ్ చేయాలని కోరే అవకాశం లేదు. అందువల్ల ఈ తరహా మెసెజ్‌లపై స్పందించే ముందు అధికారిక వెబ్‌సైట్ ద్వారా తనిఖీ చేయడం మంచిది.
అలాగే ప్లేస్టోర్, ఆపిల్ స్టోర్ వంటి అధికారిక ప్లాట్‌ఫాంల నుంచి మాత్రమే యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎట్టిపరిస్థితుల్లోనూ ఇతర ప్లాట్‌ఫాంల ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవద్దు. అన్నింటి కంటే ముఖ్యంగా ఇలాంటి మెసేజ్‌లను గుర్తించినప్పుడు వెంటనే సంబంధిత వర్గాలకు సమాచారం అందించాల్సి ఉంటుంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








