అమెజాన్ ద్వారా iPhone 11 ను ఆర్డర్ చేసాడు!! డెలివరీ చూసి కంగుతిన్నాడు

|

అమెజాన్ మరియు ఫ్లిప్‌కార్ట్ గతంలో ఆన్‌లైన్ మోసాలకు పాల్పడిన సందర్భాలు చాలానే విన్నాము. ప్రజలు ఆర్డర్ చేసిన వాటికి బదులుగా మరొక వాటిని అందించడం ముందు కూడా జరిగింది. ఇటువంటిదే ప్రస్తుతం మరొకటి జరిగింది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సమయంలో ఢిల్లీకి చెందిన ఒక వ్యక్తి ఐఫోన్ 11 ను ఆర్డర్ చేసినప్పుడు అతను తన యొక్క ఆర్డరును పొందిన తరువాత ఆన్‌లైన్ మోసానికి సంబంధించిన కేసును నమోదు చేసాడు. తాజాగా జరిగిన అమెజాన్ ఇండియా ఆన్‌లైన్ మోసం గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అమ్మకంలో నకిలీ ఐఫోన్ ప్యాక్
 

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అమ్మకంలో నకిలీ ఐఫోన్ ప్యాక్

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2020 అమ్మకంలో వినియోగదారులకు స్మార్ట్ ఫోన్ల కొనుగోలు మీద అద్భుతమైన ఆఫర్లను అందించడం ప్రారంభించింది. ఈ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అమ్మకంలో భాగంగా ఢిల్లీకి చెందిన "రాఫ్" అనే యూట్యూబర్ 64GB స్టోరేజ్‌ మోడల్ ఐఫోన్ 11ను ఆర్డర్ చేసాడు. అయితే రెండు రోజుల తరువాత తాను అందుకున్న అమెజాన్ డెలివరీ ప్యాకేజీని చూసి ఆశ్చర్యపోవడం తన వంతు అయింది. ఎందుకంటే వాస్తవానికి తాను పొందిన ఐఫోన్ పెట్టెలో నకిలీ ఐఫోన్ ను ప్యాక్ చేయబడి ఉంచినట్లు గుర్తించారు.

Also Read: Tata Sky బ్రాడ్‌బ్యాండ్ లాంగ్-టర్మ్ ప్లాన్‌ల మీద ఊహించని డిస్కౌంట్ ఆఫర్స్...

అమెజాన్ డెలివరీలో నకిలీ ఐఫోన్ 11

అమెజాన్ డెలివరీలో నకిలీ ఐఫోన్ 11

యూట్యూబర్ రాఫ్ తాను పొందిన అమెజాన్ డెలివరీ ప్యాకేజీని తన యూట్యూబ్ ఛానెల్‌లో అన్‌బాక్సింగ్ చేస్తూ వీడియోను షూట్ చేసాడు. ఇతను తన వీడియోను యూట్యూబ్ లో షేర్ చేసాడు. ప్యాకేజీని అన్‌బాక్సింగ్ చేసిన వీడియో ప్రకారం ఐఫోన్ 11 బాక్స్ యొక్క ప్యాకేజింగ్ సగం చిరిగిపోయి ఉండడమే కాకుండా బాక్స్‌లో గీతలు ఉన్నాయి. 64GB స్టోరేజ్ వేరియంట్‌కు బదులుగా అతను 256GB స్టోరేజ్ వేరియంట్‌ను అందుకున్నాడు. బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత దానిలో ఐఫోన్ స్క్రీన్ స్వభావం గల గ్లాసెస్ మరియు వెనుక భాగంలో ఒక ప్లాస్టిక్ ఫిల్మ్ ఉంది. ఇది kk కాన్సెప్ట్ యొక్క విభిన్న స్మార్ట్‌ఫోన్ బ్రాండింగ్‌ను కలిగి ఉంది.

నకిలీ ఐఫోన్ 11 అన్‌బాక్సింగ్ వీడియో యూట్యూబ్ ఛానెల్‌లో
 

నకిలీ ఐఫోన్ 11 అన్‌బాక్సింగ్ వీడియో యూట్యూబ్ ఛానెల్‌లో

అమెజాన్ ద్వారా తాను పొందిన ఐఫోన్ 11ను స్విచ్ ఆన్ చేసినప్పుడు ఫోన్‌ను సెటప్ చేయడానికి గల సెటప్ దశలను ప్రదర్శించలేదు. ఇది నేరుగా స్క్రీన్‌పై ఉన్న హోమ్ స్క్రీన్‌కు వచ్చింది. అలాగే ఇది ఆపిల్ వాల్‌పేపర్‌లకు ఎక్కడా సమీపంలో కూడా లేదు. అదనంగా నకిలీ ఐఫోన్ 11 టిక్‌టాక్ లైట్ మరియు ఫేస్‌బుక్ యాప్ లను ముందే ఇన్‌స్టాల్ చేయబడి ఉంది. ఈ ఫోన్ క్రొత్తది కాదని మరియు ఖచ్చితమైన నకిలీది అని స్పష్టమైన సూచనను ఇస్తుంది. అదనంగా ఫోన్ వెనుక కెమెరా మాడ్యూల్‌తో పాటు వాల్యూమ్ బటన్లపై గీతలు ఉన్నాయి.

నకిలీ ఐఫోన్ 11 పై పోలీసులకు ఫిర్యాదు

నకిలీ ఐఫోన్ 11 పై పోలీసులకు ఫిర్యాదు

ఢిల్లీకి చెందిన వ్యక్తి అమెజాన్ ద్వారా తాను పొందిన ఐఫోన్ 11 నకిలీది అని తేలడంతో ప్రోడక్ట్ రిటర్న్ కోసం అభ్యర్థన చేసాడు. అయితే డెలివరీ వ్యక్తి పిక్ అప్ ను కూడా నిరాకరించాడు. దీని తరువాత అతను పోలీసులకు ఫిర్యాదు కూడా చేసాడు. ఇప్పటికే పోలీసులు దీని మీద కేసును నమోదు చేసారు. కాని అమెజాన్ సంస్థ ఈ పరిస్థితిని ఎలా పరిష్కరిస్తుందో చూడవలసి ఉంది. నకిలీ ఐఫోన్ పంపిణీ చేయడం ఇదే మొదటిసారి కాదు. అమెజాన్ ఇటీవల దుబాయ్‌లోని ఒక మహిళకు ఒక నకిలీ ఆపిల్ ఎయిర్‌పాడ్స్ ప్రోను పంపిణీ చేసింది. నకిలీ ఎయిర్‌పాడ్స్ ప్రో ఆమె తల కన్నా పెద్దదిగా ఉండడం గమనార్హం.

Most Read Articles
Best Mobiles in India

English summary
Fake iPhone 11 Delivered for a Man During Amazon Great Indian Festival Sale 2020

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X