సందంట్లో సడేమీయా..చిక్కారో మీ పని అవుటే..?

Posted By: Staff

సందంట్లో సడేమీయా..చిక్కారో మీ పని అవుటే..?

 

అట్టహాసంగా ప్రారంభమైన పోట్టి క్రికెట్ సంబరం, ఐపీఎల్ -5 క్రికెట్ ప్రేమికుల్లో రెట్టించిన ఉత్సాహాన్ని నింపుతోంది. ఐపీఎల్ ప్రత్యక్ష ప్రసారాలను ఏ మాత్రం మిస్ కాకూడదనే ఉద్దేశ్యంతో ప్రత్యేకించి స్మార్ట్ ఫోన్ యూజర్లు

బాల్ టూ బాల్ స్కోర్ కార్డ్ అదేవిధంగా లైవ్ స్ర్టీమింగ్ ప్రసారాలను అందుకునేందుగాను ప్రత్యేక అప్లికేషన్‌లను డిజైన్ చేశారు. వీటిలో కొన్ని అప్లికేషన్లు ఆశాజనకంగా స్పందిస్తున్నప్పటికి, పలు నకిలీ అప్లికేషన్‌లు యూజర్లను బెంబేలెత్తిస్తున్నాయి. ఐపీఎల్ లైవ్ స్ట్రీమింగ్ కోసం ఆరాటపడి పలువురు, హ్యాకర్లు సృష్టించిన అప్లికేషన్‌లను యాక్సెస్ చేసుకుని అడ్డంగా బలైపోతున్నారు.

నెట్‌లోకి లాగినై ఐపీఎల్ 2012 అప్లికేషన్‌ల కోసం సర్ప్ చేస్తున్నపుడు అనేక అప్లికేషన్‌లు ప్రత్యక్షమవుతున్నాయి. వీటిలో అన్ని లైవ్ స్ట్రీమింగ్ అదే విధంగా ప్రత్యక్ష స్కోర్ అప్‌డేట్‌లను ఆఫర్ చేస్తున్నాయి. అయితే వీటిలో నిజమైనవేవో.. నకిలివీ ఏవో గుర్తించటం కష్టతరమవుతోంది. ఫోన్‌లలోకి చొరబడి డేటాను దొంగిలించేందకు హ్యాకర్లు ఈ కొంత పంధాను ఎంచుకుంటున్నారు. జాగ్రత్త.. అప్లికేషన్‌‌ల ఎంపికలో అప్రమత్తత వహించండి. హడావుడి పడి హ్యాకర్ల భారిన పడొద్దు.

ఎటువంటి అంతరాయం లేకుండా ఐపీఎల్ ప్రసారాలను ప్రత్యక్షంగా చేరువ చేసే పలు విశ్వసనీయ వెబ్‌సైట్ల వివరాలు:

•Cricket365.net: http://www.cricket-365.net/2011/04/sony-set-max-live-streaming-ipl-2011.htm

•livecricket.bollym4u.com: http://livecricket.bollym4u.com/

•360cricket.com: http://www.360cricket.com/

•IPL Streaming: http://iplstreaming.com/

•IPLT20.com: http://www.iplt20.com/

పోట్టి క్రికెట్ చరిత్రలో మెగా క్రికెట్ ఈవెంట్‌గా ఆదరణ చొరగుంటున్న ఐపీఎల్ మరో సారి మీకు ఉత్కంఠ భరిత వినోదాన్ని అందించాలని కోరుకుంటున్నాం.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot