తప్పుడు వార్తలపై వాట్సప్ సీరియస్, నాస్కాంతో కలిసి శిక్షణ

వాట్స‌ప్ ఓపెన్ చేయ‌గానే మ‌న‌కు కుప్ప‌లు తెప్ప‌లుగా ఏదో ఒక న్యూస్ వ‌స్తూనే ఉంటుంది. ఫొటోలు, వీడియోలు, వార్త‌లు ఇలా వ‌ర‌ద‌లా మ‌న పోన్లో ప‌డుతూనే ఉంటుంది. వాటిల్లో ఏది నిజమే తేల్చుకోవడం చాలా కష్టంగా మారి

|

వాట్స‌ప్ ఓపెన్ చేయ‌గానే మ‌న‌కు కుప్ప‌లు తెప్ప‌లుగా ఏదో ఒక న్యూస్ వ‌స్తూనే ఉంటుంది. ఫొటోలు, వీడియోలు, వార్త‌లు ఇలా వ‌ర‌ద‌లా మ‌న పోన్లో ప‌డుతూనే ఉంటుంది. వాటిల్లో ఏది నిజమే తేల్చుకోవడం చాలా కష్టంగా మారింది. అసలే ఇండియాలో ఎన్నికలు సమీపిస్తుండటంతో ఈ ఫేక్ న్యూస్ వాట్సప్ కు పెద్ద తలనొప్పిగా మారింది.

తప్పుడు వార్తలపై వాట్సప్ సీరియస్, నాస్కాంతో కలిసి శిక్షణ

ఎలాగైనా వీటిని కట్టడి చేయాలనుకుంటోంది. ఇందులో భాగంగా దేశంలో ఉన్న సోష‌ల్ మీడియా యూజ‌ర్ల‌ను న‌కిలీ వార్త‌లు, త‌ప్పుడు స‌మాచారం ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉంచేందుకు వాట్సాప్, నాస్కాం ఫౌండేష‌న్‌లు న‌డుం బిగించాయి.

1 ల‌క్ష మంది సోష‌ల్ మీడియా యూజ‌ర్ల‌కు

1 ల‌క్ష మంది సోష‌ల్ మీడియా యూజ‌ర్ల‌కు

రానున్న లోక్‌స‌భ ఎన్నిక‌ల‌ను దృష్టిలో ఉంచుకుని.. దేశంలోని ప‌లు ప్రాంతాల్లో ఉన్న 1 ల‌క్ష మంది సోష‌ల్ మీడియా యూజ‌ర్ల‌కు.. త‌ప్పుడు స‌మాచారాన్ని గుర్తించేందుకు అవ‌స‌ర‌మైన సూచ‌న‌లు, స‌ల‌హాల‌ను ఈ సంస్థ‌లు అంద‌జేయ‌నున్నాయి.

డిజిట‌ల్ లిట‌రసీ ట్రెయినింగ్

డిజిట‌ల్ లిట‌రసీ ట్రెయినింగ్

అందులో భాగంగానే ఈ రెండు సంస్థ‌లు ప్ర‌స్తుతం భాగ‌స్వామ్యం అయ్యాయి. ఈ క్ర‌మంలోనే స‌ద‌రు సోష‌ల్ మీడియా యూజ‌ర్ల‌కు ఈ రెండు సంస్థ‌ల ప్ర‌తినిధులు డిజిట‌ల్ లిట‌రసీ ట్రెయినింగ్ ఇవ్వ‌నున్నారు.

త‌ప్పుడు స‌మాచారాన్ని

త‌ప్పుడు స‌మాచారాన్ని

ట్రెయినింగ్‌లో భాగంగా యూజ‌ర్ల‌కు.. త‌ప్పుడు స‌మాచారాన్ని ఎలా గుర్తించాలి, దాని ప‌ట్ల రిపోర్ట్ ఎలా చేయాలి, అలాంటి స‌మాచారం ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఎలా ఉండాలి.. అనే విష‌యాల‌ను ప్రాక్టిక‌ల్‌గా నేర్పిస్తారు.

వెబ్‌సైట్‌లో రిజిస్ట‌ర్

వెబ్‌సైట్‌లో రిజిస్ట‌ర్

అందులో భాగంగానే ఈ నెల 27వ తేదీన ఢిల్లీలో మొద‌టి ట్రెయినింగ్ కార్య‌క్ర‌మాన్ని నిర్వహించ‌నున్నారు. ఈ క్ర‌మంలోనే ఆ ట్రెయినింగ్‌లో పాల్గొనాల‌నుకునే వారు mykartavya.nasscomfoundation.org వెబ్‌సైట్‌లో రిజిస్ట‌ర్ కూడా చేసుకోవ‌చ్చు.

Best Mobiles in India

English summary
Fake news menace: WhatsApp working with Nasscom to impart digital literacy

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X