ఇండియా పాక్ వార్ మీద సోషల్ మీడియాలో భారీగా అసత్య కథనాలు

ఈ మధ్య దేశాన్ని ఊపేస్తున్నఅంశం ఏదైనా ఉందంటే అది ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం వస్తుందనే చెప్పాలి. ఈ విషయం మీద సోషల్ మీడియాలో ఎవరిష్టం వచ్చినట్లు వారు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. నిజాలెంత అనేది

|

ఈ మధ్య దేశాన్ని ఊపేస్తున్నఅంశం ఏదైనా ఉందంటే అది ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం వస్తుందనే చెప్పాలి. ఈ విషయం మీద సోషల్ మీడియాలో ఎవరిష్టం వచ్చినట్లు వారు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. నిజాలెంత అనేది తెలియనప్పటికీ ఈ విషయంలో ఫేక్ న్యూస్ ఘోరంగా వైరల్ అవుతూ వస్తోంది.

 
ఇండియా పాక్ వార్ మీద సోషల్ మీడియాలో భారీగా అసత్య కథనాలు

దీనిని కంట్రోల్ చేయలేకపోవడంతో ఇది సోషల్ మీడియాని కుదిపేస్తోంది. యూజర్లు ఏ న్యూస్ నిజమని నమ్మాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. అలింటి ఫేక్ న్యూస్ లను ఓ సారి పరిశీలిస్తే..

ట్వీట్స్

ట్వీట్స్

#BalakotAirStrike #BringbackAbhinandan, #SayNoToWar, #MiG21,#F16, #PakFakeClaim #PakistanPM ఇవేంటో తెలుసా. గత మూడు రోజుల నుంచి ట్విట్టర్లో ట్రోల్ అవుతున్న హ్యాష్ ట్యాగులు. పాత వీడియోలు, అలాగే పాత ఫోటోలను పెట్టి ఈ హ్యాష్ ట్యాగులతో ఫేక్ న్యూస్ ని ట్రోల్ చేస్తున్నారు.

పుల్వామా అటాక్స్

పుల్వామా అటాక్స్

అయితే ఇంతకుముందు జరిగిన పుల్వామా అటాక్ అలాగే బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ అలాగే ఇతర స్టోరీల విషయంలో కూడా భారీగా ఫేక్ న్యూస్ ట్రోల్ అయింది. ఇందులో భాగంగానే ఉమెన్ ఫైలట్ ఆపరేషన్ లో పాల్గొందని ఇది గర్వించదగ్గ విజయమని పాత ఫోటోలతో , వీడియోలతో ఫేక్ న్యూస్ ని వైరల్ చేశారు. అయితే ఇది నిజం కాదు.

సోషల్ మీడియా యుద్ధం
 

సోషల్ మీడియా యుద్ధం

రెండు దేశాల మధ్య యుద్ధం సంగతి పక్కనబెడితే సోషల్ మీడియాలో రెండు దేశాల మద్య నడుస్తున్న యుద్దం మాత్రం మరీ దారుణంగా ఉందని దీనిని కంట్రోల్ చేయడం చాలా కష్టంగా ఉందని తెలుస్తోంది. ఈ విషయాన్ని ప్రముఖ fact-checking website BOOM మేనేజింగ్ ఎడిటర్ జెన్సీ జాకబ్ తెలిపారు. ఫేస్ బుక్ తో కలిసి ఈయన పని చేస్తున్నారు.

అన్నీ ఫేక్ న్యూసులే

అన్నీ ఫేక్ న్యూసులే

యూజర్లు సోషల్ మీడియలో పాత ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేస్తున్నారని వీటిల్లో రైఫిల్స్, గన్ లు, వార్ హెడ్లు లాంటివి ఉన్నాయని తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోలు రావడంతో ముంబై పోలీసులు యాంటి ఎయిర్ క్రాప్ట్ గ్ లను సీజ్ చేశారు కూడా.

ఫేక్ వీడియో

ఫేక్ వీడియో

ఇదిలా ఉంటే ఓ వీడియో ఈ మధ్య సోషల్ మీడియలో బాగా వైరల్ అయింది. అదేంటంటే ఓ జెట్ ఫైటర్ శత్రువుల స్థావరాలను భస్మీపటలం చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. వాస్తవానికిఅదొక వీడియో గేమ్ క్లిప్. దాన్ని బాగా వైరల్ చేశారు. భారత ఆర్మీ ఎటువంటి వీడియోలను బయటకు వదలలేదను అధికారికంగా ప్రకటించినా ఈ వీడియో మాత్రం వైరల్ అయింది.

 

 

అన్నింటిలోనూ ఫేక్ న్యూసే

అన్నింటిలోనూ ఫేక్ న్యూసే

ట్విట్టర్, ఫేస్ బుక్ , వాట్సప్ ఇలా పాపలర్ అయిన అన్ని సోషల్ మీడియాలలో ఈ ఫేక్ న్యూస్ ని ట్రోల్ చేస్తున్నారు. అయితే ఈ న్యూస్ పై చాలా జాగ్రత్తగా ఉండాలని లేకుంటే మొదటికే మోసం వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

Best Mobiles in India

English summary
ake news misinformation on indo pak tension flood the social media

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X