జియో ల్యాపీ రూ.599కే, ఈ లింక్ చూశారా ?

డిజిటల్ మార్కెటింగ్ అలాగే ఈ కామర్స్ మార్కెట్ల పుణ్యమా అని మనం షాపు షాపుకీ కాళ్లరిగేలా తిరగకుండానే మనకు కావాల్సిన వస్తువులను నేరుగా ఇంటి దగ్గరకే తెప్పించుకునే వెసులుబాటు ప్రస్తుతం మనకు అందుబాటులో ఉంది.

|

డిజిటల్ మార్కెటింగ్ అలాగే ఈ కామర్స్ మార్కెట్ల పుణ్యమా అని మనం షాపు షాపుకీ కాళ్లరిగేలా తిరగకుండానే మనకు కావాల్సిన వస్తువులను నేరుగా ఇంటి దగ్గరకే తెప్పించుకునే వెసులుబాటు ప్రస్తుతం మనకు అందుబాటులో ఉంది. అయితే నిజానికి ఆన్‌లైన్‌లో మనం చూసే వెబ్‌సైట్లలో చాలా వరకు నకిలీ వెబ్‌సైట్లు ఉన్నట్లే షాపింగ్ సైట్లలోనూ నకిలీవి పుట్టుకొస్తున్నాయి. వాటిని గమనించక పోవడం వల్ల చాలా మంది తమ విలువైన వ్యక్తిగత సమాచారంతోపాటు బ్యాంకు సమాచారాన్ని కోల్పోతున్నారు. దీంతో పెద్ద ఎత్తున వారి బ్యాంకు ఖాతాల నుంచి దుండగులు నగదు కాజేస్తున్నారు. సరిగ్గా ఇలాంటి ఫేక్ జియో వెబ్ సైట్ ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది.

జియో మరో షాక్, ఏకంగా రూ.2500 కోట్ల డీల్, Hathwayపై కన్ను..జియో మరో షాక్, ఏకంగా రూ.2500 కోట్ల డీల్, Hathwayపై కన్ను..

చిత్రంలో కనిపిస్తున్న వెబ్‌సైట్‌..

చిత్రంలో కనిపిస్తున్న వెబ్‌సైట్‌..

మీకు చిత్రంలో కనిపిస్తున్న వెబ్‌సైట్‌ను చూశారు కదా. ఈ వెబ్‌సైట్‌ లెకి వెళితే జియోకి సంబంధించిన వస్తువులు అన్నీ అత్యంత తక్కువ ధరకే అందుబాటులోకి ఉన్నాయని చెబుతోంది.

జియో ల్యాప్‌టాప్‌ రూ.599కే ..

జియో ల్యాప్‌టాప్‌ రూ.599కే ..

అందులో రూ.24,999 విలువైన జియో ల్యాప్‌టాప్‌ను కేవలం రూ.599కే అందిస్తున్నారట. విచిత్రమేమిటంటే అసలు జియోలో ల్యాప్‌టాప్ ఇప్పటి వరకు మార్కెట్లోకి రాలేదు.

ఇది నకిలీదని..

ఇది నకిలీదని..

మరి అత్యంత తక్కువ ధరకి వాళ్లు ఎలా విక్రయిస్తారన్న సందేహం కూడా రావచ్చు. అయితే ఇది నకిలీదని తేలింది. ఇదే కాదు ఈ తరహా దోపిడీ చేసే నకిలీ వెబ్‌సైట్లకు చెందిన పలు యాడ్స్ ఇప్పుడు ఫేస్‌బుక్‌లో కోకొల్లలుగా దర్శనమిస్తున్నాయి.

వెబ్‌సైట్ యూఆర్‌ఎల్..

వెబ్‌సైట్ యూఆర్‌ఎల్..

ఆ వెబ్‌సైట్ యూఆర్‌ఎల్ ఇది.. http://ji0daily-deals.online/. కాగా ఇది పక్కా ఫేక్ వెబ్‌సైట్ అని దీన్ని చూస్తేనే మనకు ఇట్టే తెలిసిపోతుంది.

 జియో వెబ్‌సైట్ అడ్ర‌స్..

జియో వెబ్‌సైట్ అడ్ర‌స్..

సాధారణంగా జియో వెబ్‌సైట్ అడ్ర‌స్ https://www.jio.com అని ఉంటుంది. కానీ ఈ ఫేక్ సైట్‌లో ముందు https అని కాకుండా http అని మాత్ర‌మే ఉంది.

jioలో o(ఓ) కు బ‌దులుగా 0 (సున్నా)

jioలో o(ఓ) కు బ‌దులుగా 0 (సున్నా)

దీంతో పాటు వెబ్‌సైట్ అడ్ర‌స్‌లో jio అని కాకుండా ji0daily-deals.online అని ఉంది. అలాగే jioలో o(ఓ) కు బ‌దులుగా 0 (సున్నా) ఉంది.

యాడ్ ఫేస్‌బుక్‌లో కననిపించడం..

యాడ్ ఫేస్‌బుక్‌లో కననిపించడం..

ఇంకా షాకింగ్ ఏంటంటే ఈ యాడ్ ఫేస్‌బుక్‌లో కననిపించడం.. అందులో ఏకంగా రిల‌యన్స్ ఇండ‌స్ట్రీస్ చైర్మ‌న్ ముకేష్ అంబానీ ఫొటో వాడుకుని స‌ద‌రు న‌కిలీ జియో స్టోర్ వెబ్‌సైట్ కు యాడ్ ఇచ్చారు.

న‌కిలీ వెబ్‌సైట్లకు దూరంగా..

న‌కిలీ వెబ్‌సైట్లకు దూరంగా..

కాబట్టి అందరూ ఇలాంటి న‌కిలీ వెబ్‌సైట్లకు దూరంగా ఉంటే చాలామంచింది. ఆ వెబ్‌సైట్‌లో మీరు ఏవైనా వివ‌రాలు ఎంట‌ర్ చేస్తే వాటిని ఆ సైట్ నిర్వాహ‌కులు చోరీ చేస్తారు.

జేబు గుల్ల చేసుకోకతప్పదు

జేబు గుల్ల చేసుకోకతప్పదు

ఇలాంటి వెబ్‌సైట్లు న‌కిలీవ‌ని గుర్తించ‌క‌పోతే మ‌న‌కు భారీ మొత్తంలో న‌ష్టం జ‌ర‌గ‌డం ఖాయం. నకిలీ వెబ్‌సైట్లలో ప్రొడక్ట్స్ తక్కువ ధరకు వస్తున్నాయని ఆశపడి ముందుకు సాగితే జేబు గుల్ల చేసుకోకతప్పదు.

Best Mobiles in India

English summary
Fake Jio Laptop gets listed online for Rs 599 as pre booking amount more news at Gibot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X