Home
News

పెద్ద ఎత్తున నకిలీ సిమ్‌ కార్డుల దందా.. పోలీసుల సాయంతో బయటపెట్టిన హైదరాబాద్‌లో DoT..!

మొబైల్‌ యూజర్‌లకు స్పామ్‌ కాల్స్‌, స్పామ్‌ మెసెజ్‌ల ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి. ఆఫర్లు, ప్రొమోషన్‌ల పేరుతో నకిలీ కాల్స్‌ అధికంగా ఉంటున్నాయి. వీటి కారణంగా అనేక మంది ప్రజలు మోసాలకు గురవుతున్నాయి. బ్యాంకు అధికారుల పేర్లతో ఫోన్‌లు చేసి సున్నితమైన వివరాలు తెలుసుకొని, బ్యాంకు ఖాతాలను ఖాళీచేస్తున్న ఘటనలకు కూడా ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. సైబర్‌ నేరాలకు చెక్‌ పెట్టేందుకు కేంద్ర టెలికాం మంత్రిత్వ శాఖ (DoT) సహా టెలికాం రెగ్యూలేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ట్రాయ్‌) ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి.

టెలికాం ఆపరేటర్లకు ట్రాయ్‌ కీలక ఆదేశాలు జారీ చేసింది. స్పామ్ కాల్స్‌, మెసేజ్‌లను కట్టడి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దీంతోపాటు ప్రొమోషనల్‌ కాల్స్‌ కోసం ప్రత్యేక సిరీస్‌ నంబర్‌లను కేటాయించాలని సూచించింది. కొన్ని సంస్థలు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారిత స్పామ్‌ బ్లాకర్‌ వ్యవస్థలను తీసుకొచ్చాయి.

Fake sim cards seized by DoT  hyderabad

దీంతోపాటు DoT కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఎక్కువ శాతం మోసాలు నకిలీ సిమ్‌ కార్డుల ద్వారా జరుగుతున్న నేపథ్యంలో.. సిమ్‌ కార్డుల జారీకి కఠినమైన నిబంధనలు తీసుకొచ్చింది. బయో మెట్రిక్‌ ద్వారానే కొత్త సిమ్‌ కార్డులు జారీ చేయాలని స్పష్టం చేసింది. గరిష్ఠంగా 9 సిమ్‌ కార్డులు మాత్రమే పొందేందుకు అనుమతినిచ్చింది.

అయితే తాజాగా హైదరాబాద్‌లో నకిలీ సిమ్ కార్డుల దందాను (Fake Sim Cards in Hyderabad) టెలికాం మంత్రిత్వ శాఖ హైదరాబాద్‌ విభాగం వెలుగులోకి తీసుకొచ్చింది. తెలంగాణ పోలీసుల సహకారంలో నకిలి సిమ్‌ కార్డులను స్వాధీనం చేసుకుంది. ఈ సిమ్‌ కార్డుల ద్వారా మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

స్పామ్‌ కాల్స్‌, స్పామ్‌ మెసేజ్‌లు మరియు టెలీ మార్కెటింగ్‌ సేవల కోసం వినియోగించే అవకాశం ఉందని భావిస్తున్నారు. నకిలీ సిమ్ కార్డుల ఘటనలపై దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది. POS ఏజెంట్‌ నకిలీ సిమ్‌ కార్డులను విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఈ ఏజెంట్‌ ఇప్పటికే 500 లకు పైగా నకిలీ సిమ్‌ కార్డులు విక్రయించినట్లు ప్రాధమిక దర్యాప్తులో బయటపడినట్లు తెలుస్తోంది.

ఈ ఘటనలో నకిలీ సిమ్‌ కార్డులు కొనుగోలు చేసిన కస్టమర్‌ సహా విక్రయించిన ఏజెంట్‌పై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ కేసులను అన్ని కోణాల్లో దర్యాపు చేస్తున్నట్లు సమాచారం.

తెలంగాణ పోలీసులతోపాటు కేంద్ర టెలికాం మంత్రిత్వ శాఖ కూడా ఈ నకిలీ సిమ్‌ కార్డుల మూలాలను గుర్తించే పనిలో ఉంది. ఇటీవలే నకిలీ కాల్స్‌, మెసెజ్‌లను కట్టడి చేసేందుకు సంచార్‌ సాథీ యాప్‌ను DoT విడుదల చేసింది. ఆండ్రాయిడ్‌, iOS యూజర్లకు ఈ యాప్‌ అందుబాటులో ఉంది. ఈ యాప్‌తో నకిలీ కాల్స్‌ ను బ్లాక్‌ చేయడంతోపాటు ఫిర్యాదు చేసేందుకు అవకాశం ఉంది.

గత సంవత్సరంలోనే ట్రాయ్‌, DoT.. స్పామ్‌ కాల్స్‌ కట్టడికి చర్యలు తీసుకోవాలని టెల్కోలను ఆదేశించింది. ఇందులో భాగంగా ఎయిర్‌టెల్‌ తొలిసారిగా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారిత స్పామ్‌ డిటెక్షన్ వ్యవస్థను తీసుకొచ్చింది. స్పామ్‌ కాల్స్‌, మెసేజ్‌లను నియంత్రించేందుకు డ్యూయల్‌ లేయర్‌ AI షీల్డ్‌ను ఉపయోగిస్తున్నట్లు లాంచ్‌ సమయంలో ఎయిర్‌టెల్ వెల్లడించింది. BSNL కూడా ఇదే తరహా స్పామ్‌ బ్లాకర్‌లను కలిగి ఉంది.

మోసపూరిత ఘటనలు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో ప్రధాని మంత్రి కార్యాలయం ఆదేశాలతో ఇటీవల టెలికాం శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. బయోమెట్రిక్‌ ద్వారా కొత్త సిమ్‌ కార్డులు జారీ చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతోపాటు ఒక వ్యక్తి గరిష్ఠంగా 9 సిమ్ కార్డులు మాత్రమే తీసుకొనేందుకు అనుమతి మంజూరు చేసినట్లు గతంలోనే స్పష్టం చేసింది.

More from GizBot

Best Mobiles in India

English summary
Fake sim cards seized by DoT with the support of Telangana police in hyderabad
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X