Home
News

భారత ప్రభుత్వం ద్వారా ఉచితం, అంటూ... వాట్సాప్ లో నకిలీ మెసెజ్ లు!

By Maheswara

డిజిటల్ బ్యాంకింగ్ లావాదేవీలు పెరగడంతో, స్కామర్లు అమాయకులను టార్గెట్ చేస్తూ వారు కష్టపడి సంపాదించిన సొమ్మును దోచుకుంటున్నారు. ఇలా, ప్రజల సొమ్మును దొంగిలించడానికి ప్రయత్నించే మోసపూరిత మెసెజ్ లు, హెచ్‌డిఎఫ్‌సి మరియు ఎస్‌బిఐ వంటి ప్రధాన బ్యాంకుల ఖాతాదారుల ద్వారా ఇంతకు ముందే రిపోర్ట్ చేయబడ్డాయి.

ఇలాంటి మోసాలు గత రెండు నెలలుగా జరుగుతున్నాకూడా, గత కొన్ని వారాలుగా మరింత ఎక్కువయ్యాయి. ఈ స్కామర్‌లు తమ ఖాతా వివరాలను లేదా పాన్ కార్డ్ సమాచారాన్ని అప్‌డేట్ చేయమని కోరుతూ బ్యాంకుల నుండే మోసపూరిత మెసెజ్ లను పంపుతారు. ఆలాగే, ఇప్పుడు, భారతీయ వినియోగదారుల కోసం భారత ప్రభుత్వం ఉచిత మొబైల్ రీఛార్జ్‌ను ఇస్తోందని వాట్సాప్‌లో కొత్త మోసపూరిత మెసెజ్ కూడా ప్రచారంలో ఉంది.

Fake WhatsApp Message Claims To Be A Government Scheme Spreading. Be Careful.

వాట్సాప్‌లో నకిలీ మెసెజ్ లు,
వివిధ నివేదికల ప్రకారం, భారతీయ వినియోగదారులందరికీ కేంద్ర ప్రభుత్వం రూ. 239 విలువైన ఫోన్ రీఛార్జ్‌ను ఉచితంగా ఇస్తోందని ప్రస్తుతం వాట్సాప్ లో ఒక నకిలీ మెసెజ్ ప్రచారంలో ఉంది. ఈ రీఛార్జ్ 28 రోజులు చెల్లుబాటు అవుతుందని మరియు లింక్‌పై క్లిక్ చేయమని వినియోగదారులను అడుగుతుంది. అయితే, PIB ఫాక్ట్ చెక్ ట్విట్టర్‌ లో ఈ సమాచారాన్ని పంచుకుంది. ఫాక్ట్ చెక్ టీమ్ సందేశం ప్రకారం ఈ మెసెజ్ లు పూర్తిగా నకిలీదని మరియు ప్రభుత్వం అలాంటి పథకాన్ని ప్రకటించలేదని ప్రకటించింది.

PIB యొక్క అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా నివేదించబడిన నకిలీ వాట్సాప్ మెసెజ్ ను గమనిస్తే, ఇలా ఉంది, "ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉచిత మొబైల్ రీఛార్జ్ పథకం కింద భారతీయ వినియోగదారులందరికీ 28 రోజుల పాటు రూ. 239 తో ఉచిత రీఛార్జ్ ఇస్తామని వాగ్దానం చేయబడింది, కాబట్టి ఇప్పుడు ఈ లింక్ క్లిక్ చేయడం ద్వారా మీ నంబర్‌ను రీఛార్జ్ చేయండి. దిగువన ఉన్న నీలిరంగు లింక్‌పై క్లిక్ చేయండి. నేను కూడా 28 రోజుల ఉచిత రీఛార్జ్ చేసాను మరియు ఇందులో మీరు క్రింద ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా 28 రోజుల ఉచిత రీఛార్జ్‌ని కూడా పొందవచ్చు." అని మెసెజ్ తెలియచేస్తుంది.

ఇలాంటి నకిలీ మెసెజ్ ల నుండి ఎలా సురక్షితంగా ఉండాలి,
వాట్సాప్ ద్వారా ఇలా సర్క్యులేట్ చేయబడే స్కామ్‌ల నుండి తప్పించుకోవడం చాలా సులభం అయినప్పటికీ, ముఖ్యంగా సన్నిహిత కుటుంబ సభ్యుడు లేదా స్నేహితుడి నుండి ఇలాంటి మెసెజ్ లు వచ్చినప్పుడు, నకిలీ మెసెజ్ లను గుర్తించడంలో మీకు సహాయపడే కొన్ని చిట్కాలు ఉన్నాయి ఇవి పాటించండి.

మొదట, ఈ మెసెజ్ యొక్క భాషపై శ్రద్ధను వహించండి. ఇలాంటి మెసెజ్ ల యొక్క భాష సాధారణంగా పరిపూర్ణంగా ఉండదు మరియు పెద్ద వ్యాకరణ దోషాలను కలిగి ఉంటుంది. అధికారిక సందేశాలు భాష మరియు వాక్యాల రూపకల్పన పరంగా సాధారణంగా అగ్రస్థానంలో ఉంటాయి కాబట్టి, ఈ మెసెజ్ అధికారికమా లేదా అనేది తెలుస్తుంది.

అలాగే, ఈ లింక్‌పై క్లిక్ చేయమని అడిగే ఏదైనా మెసెజ్ ఉంటే జాగ్రత్తగా పరిశీలించాలి. ఈ లింకు స్వయంగా నాన్ అఫీషియల్ సోర్స్ నుండి వచ్చినట్లు కనిపిస్తే, దానిపై క్లిక్ చేయడం మానేసి, ఇతరులకు కూడా అలా చేయమని చెప్పండి. సర్క్యులేట్ అవుతున్న సందేశం అబద్ధమా కాదా అని తెలుసుకోవడానికి కొన్ని సమయాల్లో గూగుల్ మీకు సహాయపడవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
Fake WhatsApp Message Claims To Be A Government Scheme Spreading. Be Careful.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X