మొబైల్ ధరలు పెరిగే అవకాశం!

Posted By: Staff

మొబైల్ ధరలు పెరిగే అవకాశం!

సెల్‌ఫోన్ల ధరలు మరో సారి పెరిగే సూచననలు కనిపిస్తున్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ అనూహ్యంగా పడిపోవడమే ఇందుకు కారణం. డాలర్ విలువ రోజురోజుకూ పెరుగుతుండడంతో సెల్‌ఫోన్ కంపెనీలు బెంబేలెత్తున్నాయి.

భారత్‌ మార్కెట్లో అమ్ముడవుతున్న ఫోన్లలో సగానికంటే ఎక్కువగా విదేశాల నుంచి దిగుమతి అవుతున్నవే. కొనుగోళ్లు డాలర్ రూపంలో జరుగుతుండడంతో ధరల భారం తడిసి మోపెడై కంపెనీలకు దిక్కుతోచడం లేదు. ఇక ధరలు పెంచితేగానీ మార్కెట్లో నిలదొక్కుకోలేమనే భావనకు వచ్చాయి.

నోకియా, సామ్‌సంగ్, బ్లాక్‌బెర్రీ తదితర కంపెనీలకు సైతం పాలుపోవడం లేదు. ఇప్పటికే సెల్‌ఫోన్ కంపెనీల మధ్య గట్టిపోటీయే ఉంది. ధర పెంపు విషయంలో ఏ ఒక్క కంపెనీ ముందుగా స్పందించినా, మిగిలిన కంపెనీలు దాని దారిన నడవాలని భావిస్తున్నట్టు సమాచారం.రూపాయి పతనం కారణంగా గతేడాది కూడా నోకియా, శాంసంగ్, ఎల్‌జీ, ఏసర్‌తోపాటు దేశీయ సెల్‌ఫోన్ కంపెనీలైన మైక్రోమ్యాక్స్, సెల్‌కాన్, స్పైస్, లావా, ఒనిడా వంటి కంపెనీలన్నీ ధరలను పెంచాయి.

అంచనాలో దిమ్మతిరిగే లెక్కలు!

‘కమ్యూనికేషన్ అవసరాలు రోజు రోజుకు పెరుగుతున్న నేపధ్యంలో మొబైల్ ఫోన్‌లకు అనూహ్య రీతిలో డిమాండ్ నెలకుంది. ఇండియా వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వీటి వినియోగం తారా స్థాయికి చేరుకుంటోంది.’

2014కుగాను దేశంలో మొబైల్ ఫోన్లకు డిమాండ్ 25 కోట్లకు చేరుకునే అవకాశముందని ఇండియన్ సెల్యులర్ అసోసియేషన్(ఐసీఏ) గణంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ మొబైళ్ల విలువ రూ.54,000 కోట్లు ఉంటుందని ఐసీఏ  విశ్లేషించినట్లు కమ్యూనికేషన్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి మిలింద్ దేవ్‌రా శుక్రవారం రాజ్యసభలో లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో పేర్కొన్నారు. మొబైల్ హ్యాండ్‌సెట్లకు డిమాండ్‌కు సంబంధించి ఐసీఏ అంచనాలను మంత్రి ఆ సమాధానంలో వివరించారు. ఆ వివరాల ప్రకారం… ప్రస్తుత సంవత్సరంలో 20 కోట్ల మొబైళ్లకు (వీటి విలువ రూ.43,000 కోట్లు) డిమాండ్ ఉంటుంది. 2011లో ఈ డిమాండ్ 18 కోట్లకు(రూ.38,200 కోట్లు) ఉండగా.  2010లో 15 కోట్లుగా(రూ.34,500 కోట్లు) ఉంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot