భారత్‌లో ఫార్ క్రై 5 ఆన్‌లైన్ గేమ్ నిషేధం..

ఫార్ క్రై 5 గేమ్ ఇక నుంచి పీఎస్4, ఎక్స్ బాక్స్ వన్, విండోస్ పీసీల నుంచి మాయమైంది. అయితే రిటైల్ మార్కెట్లోనూ, డిజిటల్ స్టోర్స్ లో కన్సోల్ వర్షన్ మాత్రం అందుబాటులో ఉంది.

|

ఫార్ క్రై 5 గేమ్ ఇక నుంచి పీఎస్4, ఎక్స్ బాక్స్ వన్, విండోస్ పీసీల నుంచి మాయమైంది. అయితే రిటైల్ మార్కెట్లోనూ, డిజిటల్ స్టోర్స్ లో కన్సోల్ వర్షన్ మాత్రం అందుబాటులో ఉంది. అయితే గేమ్ కు సంబంధించిన పీసీ వర్షన్ అంటే పర్సనల్ కంప్యూటర్ లో ఆడే వర్షన్ మాత్రం అందుబాటులో లేకుండా పోయింది. ఫార్ క్రై 5 వాల్వ్ స్టోర్ ఫ్రాంట్ లో తొలగించినందుకు సూచికగా అందుకు సంబంధించిన బయ్ ఆప్షన్ కూడా తొలగించారు. అలాగే గేమ్ కు సంబంధించిన ప్రీ ఆర్డర్ ను సైతం ఆపేశారు. ఈ స్ట్రీమ్ గేమ్ కు సంబంధించినంత వరకూ స్ట్రీమ్ డీబీలో "ఫార్ క్రై 5 ఇక మీదట ఇండియా, చైనా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, సింగపూర్, వియత్నాం, సౌత్ కొరియా, న్యూజిలాండ్, హాంగ్ కాంగ్, తైవాన్ దేశాల్లో నిషేధించారు" అనే ప్రకటన కనిపిస్తుంది. అయితే వియత్నాంలో మాత్రం ప్రీ ఆర్డర్లను తీసుకుంటున్నారు.

స్మార్ట్‌ఫోన్ విడిభాగాలపై 10 శాతం దిగుమతి సుంకంస్మార్ట్‌ఫోన్ విడిభాగాలపై 10 శాతం దిగుమతి సుంకం

Far Cry 5 PC
అయితే పైన పేర్కొన్న దేశాల్లో మీరు నివసిస్తున్నట్లయితే, మీరు ఈ గేమ్ ను యూబీఐ సాఫ్ట్ కి చెందిన యూ ప్లేలో కొనవచ్చు. భారత్ లో ఈ గేమ్ విలువ 60 యూరోలు అంటే రూ.4848చెల్లించి పొందే వీలుంది. అయితే సాధారణంగా ఈ గేమ్ గతంలో రూ.3499గా ఉండేది.అలాగే మీ సిస్టంలో డౌన్ లోడ్ చేసుకునేలా ఫార్ క్రై 5 సీజన్ పాస్, డీలక్స్ ప్యాక్ పేరిట కొనుగోలు చేసుకునే వీలుంది.

ఇదిలా ఉంటే ఒక గేమ్‌ను స్టీమ్ ఆన్ లైన్ నుంచి తొలగించడం మొదటి సారి కాదు. గతంలో డ్రాగన్ బాల్ ఫైటర్జ్ అనే గేమ్ కూడా ఇలాంటి ఇబ్బందులనే ఎదుర్కొన్నది. సదరు గేమ్ తయారీ దారు అయిన బందాయ్ నామ్ కో ఇండియాలో గేమింగ్ నింబంధనలకు విరుద్ధంగా ఉండటమే ఇందుకు కారణంగా తెలిపారు. అయితే ప్రస్తుతం ఫార్ క్రై 5 ను అందుబాటులో ఉంచిన యూబీసాఫ్ట్ సైతం త్వరలోనే దీనిపై స్పందిస్తామని తెలిపింది.

Far Cry 5 PC

నిజానికి వాచ్ డాగ్స్ టూ నుంచి యూబీ సాఫ్ట్ భారత్ సహా పలు దేశాల్లో డిస్క్ ద్వారా గేమ్స్ అమ్మకాలను నిలిపివేసింది. అయితే రెండేళ్ల క్రితమే ఈఏ గేమ్స్ కూడా డిస్క్ ద్వారా గేమ్స్ అమ్మకాలను నిలిపివేసింది. అయితే ప్రస్తుతం ఫార్ క్రై 5 ను బ్యాన్ చేయడమనేది, ఒక ట్విస్ట్ మాత్రమే. స్టీమ్ నుంచి గేమ్ తొలగింపు తాత్కాలికమే అంటున్నప్పటికీ ఇది ఆ సంస్థపై ఎంతమేర ప్రభావం చూపుతుందో వేచిచూడాల్సిందే.
Best Mobiles in India

English summary
Far Cry 5 PC Steam Version Removed From Sale in India, China, and Other Asian Countries More News at gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X