Home
News

ఫాస్ట్ చార్జర్ల తో మీ ఫోన్లు పేలిపోయే ప్రమాదం ఉంది. ఏమి చేయాలి ?తెలుసుకోండి.

By Maheswara

ఫాస్ట్ ఛార్జింగ్ అనేది ఇప్పుడు చాలా సాధారణం అయిన విషయం , ఈ సాంకేతిక పరిజ్ఞానంతో రాకపోతే మనలో చాలామంది స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయరు.ఎక్కువగా ప్రయాణాలు చేసే వారు మరియు స్మార్ట్‌ఫోన్‌లను ఎక్కువగా వాడేవారికి ఈ ఫాస్ట్ ఛార్జింగ్ అత్యవసరం. ఫాస్ట్ ఛార్జింగ్ లో తక్కువ సమయం లో మీకు రోజు మొత్తానికి సరిపడా బ్యాటరీ ని ఛార్జ్ చేయగల సామర్థ్యము ఉండటం మూలంగా మంచి ఉపయోగం ఉంటుంది.

నిమిషాల వ్యవధిలో ఛార్జింగ్

మీ స్మార్ట్‌ఫోన్‌ను నిమిషాల వ్యవధిలో కనీసం నాలుగింట ఒక వంతు శక్తినివ్వడం ఒక గొప్ప విషయమే కానీ, ఎంత గొప్ప టెక్నాలజీ అయిన హానికరంగా ఉపయోగించడానికి వీలుంది.అలాగే ఈ ఫాస్ట్ చార్జర్లులు కూడా మీ ఫోన్లకు మరియు ఇతర పరికరాలకు హానికరంగా  ఉపయోగించ వచ్చు.మరి అది ఎలా  పనిచేస్తుందో మీరు తెలుసుకోండి.

బ్యాడ్‌పవర్

బ్యాడ్‌పవర్

ZDNet నివేదిక ప్రకారం, బ్యాడ్‌పవర్ అని పిలువబడే ఒక లోపం కారణంగా  కొన్ని ఫాస్ట్ ఛార్జర్‌లలో ఫర్మ్‌వేర్‌ను సవరించగలదు. బ్యాడ్‌పవర్ ఫాస్ట్ ఛార్జర్‌ను పాడు చేస్తుంది మరియు ఛార్జింగ్ ప్రాసెస్ కోసం వోల్టేజ్‌పై చిప్ యొక్క ఫర్మ్‌వేర్ మరియు ఛార్జింగ్ పరికరాన్ని అనుసంధానించడం లో విఫలమవుతుంది.

ఫాస్ట్ ఛార్జర్‌లలో

ఫాస్ట్ ఛార్జర్‌లలో

ఈ ఫాస్ట్ ఛార్జర్‌లలో కొన్ని 20 వోల్ట్‌ల తో ఛార్జ్ చేయగలవు, కొన్ని పరికరాలు 5 వోల్ట్‌లను మాత్రమే సురక్షితంగా అంగీకరించగలవు. మీ పరికరాన్ని సురక్షితంగా ఛార్జ్ చేయగలిగే వోల్టాగే కంటే ఎక్కువ వోల్టేజ్ ను  ఓవర్‌లోడ్ చేయడం ద్వారా మీ పరికరాల్లో మంటలు చెలరేగే అవకాశం ఉంది.ఈ విషయాన్నీ తనిఖీ చేయడానికి, ఛార్జర్ యొక్క ఫర్మ్‌వేర్‌ను పాడు చేయడానికి పరిశోధకులు మొబైల్ ఫోన్‌గా ఉన్న ప్రత్యేక పరికరాన్ని ఉపయోగించారు. ఈ సందర్భంలో సరైన ‘హానికరమైన ప్రోగ్రామ్‌లు', బాడ్‌పవర్ సోకిన ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు మొదలైనవి ఛార్జర్ యొక్క ఫర్మ్‌వేర్‌ను చెడగొట్టాయని పరిశోధకులు అభిప్రాయపడ్డారు.

డేటాను దొంగిలించే మాల్వేర్

డేటాను దొంగిలించే మాల్వేర్

డేటాను దొంగిలించే ఇతర మాల్వేర్ మరియు ransomware లాగా బ్యాడ్ పవర్ అనేది దూకుడుగా అనిపించదు. కాని ఇది మీ పరికరాన్ని భౌతికంగా నాశనం చేసేంత వేగంగా ఛార్జర్‌ను పాడు చేస్తుంది.టెస్టింగ్ లో  పరీక్షించిన 35 ఫాస్ట్ ఛార్జర్లు లో , కనీసం 18 బ్యాడ్ పవర్‌కు గురయ్యే అవకాశం ఉందని పరిశోధకులు కనుగొన్నారు. ఈ 18 లో 11 వాటిలో ‘డిజిటల్ టెర్మినల్స్' ద్వారా పాడైపోవచ్చు. కానీ  ఈ ఛార్జర్లు ఏ కంపెనీలకు చెందినవని అని మాత్రం పరిశోధకులు వెల్లడించలేదు.

ఈ ఫాస్ట్ ఛార్జింగ్ లోపాన్ని ఎలా అరికట్టవచ్చు?

ఈ ఫాస్ట్ ఛార్జింగ్ లోపాన్ని ఎలా అరికట్టవచ్చు?

బ్యాడ్ పవర్ కారణముగా మీ పరికరాలు పేలిపోకుండా నిరోధించడానికి, తయారీదారులు తక్కువ వోల్టేజ్ ఫాస్ట్ ఛార్జింగ్కు తోడ్పడే పరికరాలకు అదనపు ఫ్యూజ్లను జోడించాలని పరిశోధకులు సూచిస్తున్నారు.

వినియోగదారులు  తమ  ఫోన్ ఛార్జర్లు మరియు పవర్ బ్యాంకులు ఇతర పరికరాలతో పంచుకోవద్దని పరిశోధకులు సూచిస్తున్నారు. 

More from GizBot

Best Mobiles in India

English summary
Fast chargers Can Burn your Smartphones: Check details here  
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X