5 నిమిషాల్లో 5 గంటల ఫోన్ ఛార్జింగ్, Qualcomm కొత్త టెక్నాలజీ

ఒకానొక సమయంలో స్మార్ట్‌ఫోన్ బ్యాటరీలను పూర్తిగా ఛార్జ్ చేయాలంటే గంటలగంటల సమయం పట్టేది. క్విక్ ఛార్జింగ్ టెక్నాలజీలు అందుబాటులోకి వచ్చిన తరువాత తక్కువ సమయంలోనే బ్యాటరీ ఛార్జింగ్ ఫుల్ అయిపోతోంది. క్విక్ ఛార్జింగ్ విభాగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన క్వాల్కమ్ (Qualcomm), తాజాగా మరో ఛార్జింగ్ స్టాండర్డ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Quick Charge 4కు సక్సెసర్ వర్షన్‌

ఇప్పటికే అందుబాటులో ఉన్న Quick Charge 4 స్టాండర్డ్‌కు సక్సెసర్ వర్షన్‌గా Quick Charge 4+ను క్వాల్కమ్ అందుబాటులోకి తీసుకువచ్చింది.

30 శాతం సమర్థవంతంగా..

క్విక్ ఛార్జ్ 4తో పోలిస్తే క్విక్ ఛార్జ్ 4+ స్టాండర్డ్ 15 శాతం వేగంగా ఛార్జింగ్ చేయటంతో పాటు 30 శాతం సమర్థవంతంగా పనిచేస్తుంది. క్వాల్కమ్ కొత్త ఛార్జ్ టెక్నాలజీ ఛార్జింగ్ సమయంలో ఫోన్‌ను 3 డిగ్రీలు చల్లబరుస్తుంది.

మొట్టమొదటి ఫోన్ Nubia Z17

Quick Charge 4+ సపోర్ట్‌తో వస్తోన్న మొట్టమొదటి ఫోన్ Nubia Z17. 8జీబి ర్యామ్ సామర్థ్యంతో వస్తోన్న ఈ ఫోన్ ఇప్పటికే చైనా మార్కెట్లో దొరుకుతోంది. డ్యుయల్ ఛార్జింగ్, ఇంటెలిజెంట్ థర్మల్ బ్యాలెన్సింగ్‌తో పాటు అడ్వాన్సుడ్ సేఫ్టీ ఫీచర్లు క్విక్ ఛార్జ్ 4+ సాండర్డ్‌లో ఉన్నాయి.

5 గంటల బ్యాటరీ ఛార్జ్‌ను కేవలం 5 నిమిషాల్లో..

Quick Charge 4+ స్టాండర్డ్‌ను సపోర్ట్ చేసే విధంగా త్వరలోనే మరిన్ని క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ఆధారిత ఫోన్‌లు మార్కెట్లోకి రాబోతున్నాయి. క్వాల్కమ్ క్విక్ ఛార్జ్ 4 టెక్నాలజీ ద్వారా 5 గంటల బ్యాటరీ ఛార్జ్‌ను కేవలం 5 నిమిషాల్లో పొందవచ్చు. ఫోన్‌లతో పాటు పవర్ బ్యాంక్‌లను వేగవంతంగా ఛార్జ్ చేసుకునేందుకు Quick Charge 4+ స్టాండర్డ్‌ దోహదపడుతుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
For fast charging, look for Qualcomm Quick Charge 4+ in your next mobile device. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot