"ఫాస్ట్ రైల్వే టికెట్ బుకింగ్ యాప్" తయారుచేసాడు!! జైలుపాలయ్యాడు....

|

ఇండియాలో రైల్వే టికెట్ బుకింగ్ అనేది ఇప్పటికి కూడా చాలా కష్టంగా ఉంది. ముఖ్యంగా పండుగలు మరియు సెలవుల సమయాలలో అయితే చెప్పవలసిన అవసరం లేదు. కొన్ని సంవత్సరాలుగా ఇండియా రైల్వే యొక్క వెబ్‌సైట్ మెరుగుపడినప్పటికి ఆన్‌లైన్ రైల్ టికెట్ బుకింగ్ యాప్ లు మాత్రం మెరుగదలను సాధించలేదు. ప్రాథమికంగా IRCTC యొక్క రైలు టికెట్ బుకింగ్ అనుభవం చాలా మంచిదని రుజువు చేస్తుంది.

IRCTC ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ యాప్ ‌
 

IRCTC ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ యాప్ ‌

పేమెంట్లకు బదులుగా 'కాయిన్' ఆధారిత వ్యవస్థ ద్వారా రైల్వే టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి వినియోగదారులకు IRCTC ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ను రూపొందించింది. ఐఆర్‌సిటిసి టికెట్ బుకింగ్ వ్యవస్థ అనేది వినియోగదారుల యొక్క అన్ని సమయం మరియు యూజర్ యొక్క అనుభవాన్ని మెరుగుపరచడానికి అనుకూలంగా ఉంటుంది. ఐఐటియన్ యువరాజా ఆండ్రాయిడ్ ఆధారిత ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ యాప్ లను 2016 లో సృష్టించినట్లు తెలిపారు. అవి జనాదరణ పొందనప్పటికి గూగుల్ ప్లే స్టోర్ నుండి వీటిని పూర్తిగా తొలగించబడ్డాయి. ప్రస్తుతానికి వీటిని డౌన్‌లోడ్ చేయడానికి యూజర్లకు అందుబాటులో లేవు.

Also Read:Tata Sky Binge+ vs Airtel Xstream: OTT & సాటిలైట్ టీవీ రెండింటి యాక్సెస్ కోసం బెస్ట్ STB బాక్స్ ఇదే.

ఆండ్రాయిడ్ ఫోన్‌ల కోసం ఫాస్ట్ రైల్వే టికెటింగ్ యాప్

ఆండ్రాయిడ్ ఫోన్‌ల కోసం ఫాస్ట్ రైల్వే టికెటింగ్ యాప్

ఐఐటి ఖరగ్‌పూర్ కు చెందిన ఐఐటియన్ ఎస్ యువరాజా ఆండ్రాయిడ్ ఫోన్‌ల కోసం ప్రత్యేకమైన రైల్వే టికెటింగ్ యాప్ లను నిర్మించాడు. కానీ అది ఇప్పుడు యాప్ సృష్టికర్తను జైలుపాలు చేసింది. 'సూపర్ తత్కాల్', 'సూపర్ తత్కాల్ ప్రో' పేరుతో సృష్టించిన ఫాస్ట్ రైల్వే టికెట్ బుకింగ్ యాప్‌ల కారణంగా తిరుపూర్ స్థానికుడు ఎస్ యువరాజా అరెస్టు చేసినట్లు TOI నివేదిక తెలిపింది.

రైల్వే టిక్కెట్ బుకింగ్ ఆండ్రాయిడ్ యాప్ సృష్టికర్త అరెస్ట్  

రైల్వే టిక్కెట్ బుకింగ్ ఆండ్రాయిడ్ యాప్ సృష్టికర్త అరెస్ట్  

చెన్నైలోని సైబర్ సెల్ ఆఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) సర్వర్ సోర్స్ కోడ్, అప్లికేషన్ సోర్స్ కోడ్, ఎండ్ యూజర్స్ జాబితా మరియు అతని బ్యాంక్ స్టేట్మెంట్లను ఉపయోగించి అతనిని ట్రాక్ చేసింది. యువకుల అరెస్టు గురించి దక్షిణ రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ సెక్యూరిటీ కమిషనర్ బిరేంద్ర కుమార్ మాట్లాడుతూ "అతను టిక్కెట్లు వేగంగా బుక్ చేసుకోవడానికి ఒక సాఫ్ట్‌వేర్‌ను సృష్టించాడు. కానీ అతను ఐఆర్‌సిటిసి యొక్క అధీకృత ఏజెంట్ కూడా కాకపోవడం చట్టారీత్యా నేరంగా పరిగణిస్తున్నాము అని తెలిపారు."

Also Read:Oneplus నుండి మరో రెండు కొత్త ఫోన్లు ? ధరలు మరియు ఫీచర్లు చూడండి.

ఫాస్ట్ ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ యాప్ Vs ఐఆర్‌సిటిసి వెబ్‌సైట్‌
 

ఫాస్ట్ ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ యాప్ Vs ఐఆర్‌సిటిసి వెబ్‌సైట్‌

ఇండియా యొక్క రైల్వే వ్యవస్థను కాదని వాటి యొక్క అన్ని రకాల నియమాలను దాటవేయడమే కాకుండా చట్టవిరుద్ధంగా డబ్బును సంపాదించడం నేరంగా పరిగణిస్తూ యువరాజాపై లేబుల్ చేయబడిన ఆరోపణలను దక్షిణ మధ్య రైల్వే ధృవీకరించింది. రైల్వే చట్టంలో అనధికారికంగా వ్యాపారం మరియు సరఫరా చేసే వ్యాపారానికి విధించే జరిమానాలో భాగంగా సెక్షన్ 143 (2) కింద కేసును నమోదు చేసినట్లు కొన్ని నివేదికలు తెలిపాయి. ఈ వేగవంతమైన ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ యాప్ ల కారణంగా ఐఆర్‌సిటిసి వెబ్‌సైట్‌లో టికెట్లు బుక్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తులు న్యాయమైన అవకాశాన్ని కోల్పోయారని TOI నివేదికలో పేర్కొన్న కొంతమంది రైలు అధికారులు తెలిపారు.

Most Read Articles
Best Mobiles in India

Read more about:
English summary
Fast Railway Ticket Booking App Creator gets Arrested

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X