KYC పూర్తిచేయని కారణంగా మీ ఫాస్టాగ్ డియాక్టివేట్ అయిందా.. ఏం చేయాలో తెలుసా?
ఫాస్టాగ్ కేవైసీ (Fastag KYC Update) పూర్తి చేయని వాహనదారులకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ( NHAI ) షాక్ ఇచ్చింది. గడువులోగా ఫాస్టాగ్ కేవైసీ పూర్తి చేయనివారి ఖాతాలను డియాక్టివేట్ చేయనున్నట్లు మరియు బ్లాక్ లిస్ట్‌లో పెడుతున్నట్లు వెల్లడించింది.
కొందరు వినియోగదారులు ఒకటి కంటే ఎక్కువ ఫాస్టాగ్ ఖాతాలు కలిగి ఉన్నట్లు NHAI గుర్తించింది. దీనికి చెక్ పెట్టేందుకు వన్ వెహికల్- వన్ ఫాస్టాగ్‌ను (One Vehicle - One Fastag) అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగా రిజర్వ్ బ్యాంకు మార్గదర్శకాలను అనుగుణంగా ఫాస్టాగ్ ఖాతాల కేవైసీని అప్‌డేట్ చేయాలని పేర్కొంది. ఇందులో భాగంగా ఈ సంవత్సరం జనవరి 31 వరకు సమయం ఇచ్చింది.

డియాక్టివేట్ చేస్తామని గతంలోనే చెప్పిన NHAI : అనంతరం ఆ గడువును ఫిబ్రవరి 29 వరకు పొడిగించింది. గడువు లోగా ఫాస్టాగ్ కేవైసీను పూర్తిచేయని వారి ఖాతాలను డియాక్టివేట్ చేస్తామని, శాశ్వతంగా బ్లాక్ చేస్తామని గతంలోనే NHAI వెల్లడించింది. ఫాస్టాగ్ ఖాతాలో నగదు ఉన్నా.. కేవేసీ పూర్తి చేయకుంటే డియాక్టివేట్ చేస్తామని స్పష్టం చేసింది.
పేటీఎం పేమెంట్స్ బ్యాంకు నుంచి ఫాస్టాగ్‌ను కలిగి ఉన్నారా? : ముందుగానే హెచ్చరించిన విధంగానే ఫాస్టాగ్ కేవైసీ పూర్తికాని ఖాతాలను బ్లాక్ చేస్తున్నట్లు తెలిపింది. అయితే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ నుంచి ఫాస్టాగ్ పొందిన వారికి దీని నుంచి మినహాయింపునిచ్చింది. మిగిలిన ఖాతాలను డియాక్టివేట్ చేస్తున్నట్లు వెల్లడించింది. అయితే ఫాస్టాగ్ ఖాతాలు డియాక్టివేట్ అయిన వాహనదారులు ఏం చేయాలో తెలుసా..?
ఇలా చేయడం మినహా వేరే మార్గం లేదు : నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారుల నుంచి వచ్చిన సమాచారం మేరకు డియాక్టివేట్ లేదా బ్లాక్ చేయబడిన ఖాతాలను తిరిగి యాక్టివేట్ చేసే అవకాశం లేదని తెలుస్తోంది. కొత్తగా ఫాస్టాగ్ ఖాతాను తీసుకొని, వెంటనే kYC పూర్తిచేయాల్సి ఉంటుందని NHAI అధికారులు తెలిపారు.
ఎలా తనిఖీ చేయాలంటే : అయితే తొలుత మీ పాత ఫాస్టాగ్ పరిస్థితిని ముందు తనిఖీ చేసుకోండి. నేరుగా NHAI నుంచి ఫాస్టాగ్‌ను పొందినట్లయితే http://fastag.ihmcl.com ను సందర్శించాలి. అనంతరం కేవైసీ స్థితిని తెలుసుకోండి. NHAI అనుమతించిన బ్యాంకుల నుంచి ఫాస్టాగ్‌ను పొందినట్లయితే http://www.netc.org.in/request-fornetc-fastag ను సందర్శించాలి.
అనంతరం రిక్వస్ట్ ఫర్ NETC Fastag ఆప్షన్ వద్దనున్న బ్యాంకుల జాబితా నుంచి మీ బ్యాంకును ఎంచుకోవాలి. అనంతరం సంబంధిత బ్యాంకు వెబ్‌సైట్‌లో లాగిన్ కావాల్సి ఉంటుంది. అక్కడ ఫాస్టాగ్ స్థితిని తెలుసుకోవాల్సి ఉంటుంది. డియాక్టివేట్ చేసినట్లు ఉంటే మాత్రం కొత్త ఫాస్టాగ్ ఖాతా తీసుకోవడం మినహా ప్రస్తుతానికి ఇతర ప్రత్యామ్నాయం లేదని NHAI అధికారులు వెల్లడించారు.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








