ఫాస్ట్ ట్యాగ్ కొనుగోలు కోసం మరో 15 రోజులు గడువు

|

జాతీయ రహదారులపై టోల్ ప్లాజా వద్ద చెల్లింపుల కోసం ఫాస్ట్ ట్యాగ్ ను తప్పనిసరి చేసిన భారత ప్రభుత్వం ఇంతక ముందు దాని ఆఖరి గడువును డిసెంబర్ 1గా నిర్ణయించింది. కానీ ఇప్పుడు ఈ గడువు తేదీని డిసెంబర్ 15 వరకు పొడిగించింది.

ఫాస్ట్ ట్యాగ్
 

డిసెంబర్ 1 లోపు ఫాస్ట్ ట్యాగ్ ను ఉపయోగించని వారికి డిసెంబర్ 15 వరకు పొడగింపు ఇచ్చినప్పటికీ ఈ మధ్య సమయంలో ఫాస్ట్ ట్యాగ్ లేకుండానే టోల్ ప్లాజా వద్ద ఈ లేన్లోకి ప్రవేశించే వాహనాల నుండి డబుల్ యూజర్ ఫీజును వసూలు చేస్తున్నట్లు రహదారి రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) ఒక ప్రకటనలో తెలిపింది. ఇంతకుముందు హైవేలపై టోల్ చెల్లింపులను ఫాస్ట్ ట్యాగ్స్ ద్వారా మాత్రమే అంగీకరిస్తామని ప్రకటించి చాలా రోజులు అయింది.

Fast tags: రికార్డు స్థాయిలో ఫాస్ట్ ట్యాగ్‌ల సేల్స్

ప్రీపెయిడ్ ట్యాగ్

ఫాస్ట్ ట్యాగ్ అనేది ప్రీపెయిడ్ ట్యాగ్. ఇది వాహనం యొక్క విండ్‌స్క్రీన్‌పై అతికించబడి ఉంటుంది. దీని ద్వారా టోల్ ప్లాజా యొక్క ఛార్జీలు ఆటొమ్యాటిక్ గా చెల్లింపు చేయబడతాయి మరియు మీ యొక్క అకౌంట్ లోని మొత్తంలో క్రమంగా తగ్గింపును అనుమతిస్తుంది. దీని ద్వారా నగదు లావాదేవీల కోసం ఎక్కువ సేపు ఆపకుండా టోల్ ప్లాజా గుండా వాహనాన్ని వెళ్ళడానికి అనుమతిస్తుంది.

ఇప్పుడు అమెజాన్ నుండి FASTag ను కొనుగోలు చేయవచ్చు

టోల్ ప్లాజా
 

టోల్ ప్లాజాల్లోని అన్ని దారులు ప్రతి వైపు ఒక లేన్ మినహా డిసెంబర్ 1, 2019 నాటికి 'ఫీజు ప్లాజా యొక్క ఫాస్ట్ ట్యాగ్ లేన్'గా ప్రకటించాలని నిర్ణయించినట్లు NHAI తెలిపింది. దీని ప్రకారం NHAI ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ సిస్టంతో అన్ని ఫీజు ప్లాజాలను కలిగి ఉంది . ఫాస్ట్‌టాగ్ లభ్యత సౌలభ్యం కోసం NHAI మైఫాస్ట్ ట్యాగ్ యాప్‌ను ప్రారంభించింది. దీని ద్వారా ఫాస్ట్‌టాగ్‌కు సంబంధించిన మొత్తం సమాచారాన్ని Posల స్థానంతో పాటు పొందవచ్చు. అలాగే ఎన్‌హెచ్‌ఐఐ / ఇతర వాలెట్లు లేదా బ్యాంక్ అకౌంట్ లతో రీఛార్జ్ చేయడం కోసం లింక్ చేయవచ్చు. అయినప్పటికీ అనేక కారణాల వల్ల చాలా మంది పౌరులు తమ వాహనాలను ఫాస్ట్‌టాగ్‌తో ఎనేబుల్ చేయలేదని ఒక ప్రకటనలో తేలింది.

హైవేలపై Dec 1 నుండి టోల్‌గేట్ పెమెంట్స్ కోసం ఫాస్ట్ ట్యాగ్ తప్పనిసరి!! దీనిని పొందడం ఎలా?

NHAI

ఫాస్ట్ ట్యాగ్ ప్రస్తుతం ఇండియా హైవేస్ మేనేజ్‌మెంట్ కంపెనీ లిమిటెడ్ (ఐహెచ్‌ఎంఎల్), NHAI మరియు దేశవ్యాప్తంగా ఉన్న పలు బ్యాంకుల యొక్క ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ పాయింట్-ఆఫ్-సేల్ స్థానాల్లో అందుబాటులో ఉంది. మీరు కింద తెలిపే బ్యాంకు యొక్క ఆన్‌లైన్‌లో ఫాస్టాగ్‌ను కొనుగోలు చేయవచ్చు.

Mi క్రెడిట్ సర్వీసును Dec 3 న ప్రారంభిస్తున్న షియోమి

ట్యాగ్‌లు

నవంబర్ 27, 2019 రోజున అత్యధికంగా 1,35,583 ట్యాగ్‌లు అమ్ముడవడంతో సుమారు 70 లక్షలకు పైగా ఫాస్ట్‌టాగ్‌లను జారీచేసారు. అయితే దీనికి ముందు రోజు 1.03 లక్షల ఫాస్ట్ ట్యాగ్‌లు జారీ చేయబడ్డాయి. రోజువారీ సగటున జారీచేసిన వాటిలో జూలైలో 8,000 ఉండగా ఇప్పుడు అది 330 శాతం పెరిగి 2019 నవంబర్‌లో రోజువారి సగటున 35,000 ట్యాగ్‌లు అమ్ముడవుతున్నట్లు రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

BSNL,Jio,Airtel,Vodafone Rs.1000ల లాంగ్ టర్మ్ ప్లాన్‌లు

హైబ్రిడ్ లేన్

టోల్ ప్లాజా యొక్క ప్రతి ఒక లేన్ ‘హైబ్రిడ్ లేన్' అవుతుంది. దీని ద్వారా కేవలం ఫాస్ట్ ట్యాగ్ ద్వారా చెల్లింపు పద్ధతులను అంగీకరిస్తుంది. పైన పేర్కొన్న ఆదేశంతో ఫాస్ట్ ట్యాగ్ ద్వారా ప్రాసెస్ చేయబడిన సగటు రోజువారీ లావాదేవీలు ఈ సంవత్సరం జూలైలో 8.8 లక్షల నుండి 2019 నవంబర్లో 11.2 లక్షల లావాదేవీలకు పెరిగాయి. రోజువారీ సగటు వసూలు కూడా రూ. 11.2 కోట్ల నుండి రూ .19.5 కోట్లకు పెరిగింది అని మంత్రిత్వ శాఖ తెలిపింది.

Most Read Articles
Best Mobiles in India

English summary
FASTag Roll-Out Extends to December 15

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X