Fast tags: రికార్డు స్థాయిలో ఫాస్ట్ ట్యాగ్‌ల సేల్స్

|

ఫాస్ట్ ట్యాగ్‌ల యొక్క గడువు డిసెంబర్ 1న ముగుస్తున్నందున ఆ గడువుకు ముందు సుమారు 70 లక్షలకు పైగా ఫాస్ట్ ట్యాగ్‌లను జారీ చేసినట్లు భారత ప్రభుత్వం తెలిపింది. నవంబర్ 27న అత్యధికంగా 135,583 ట్యాగ్‌ల అమ్మకాలు జరిగినట్లు నేషనల్ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ (NETC) కార్యక్రమంలో రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ తెలిపింది.

పాన్-ఇండియా
 

ఫాస్ట్ ట్యాగ్‌లను పాన్-ఇండియా ప్రాతిపదికన అమలు చేస్తున్నట్లు తెలిపారు. నోటిఫైడ్ రేట్ల ప్రకారం టోల్ ప్లాజా వద్ద రుసుము వసులు చేయడం మరియు ట్రాఫిక్ యొక్క సమస్య కదలికను తగ్గించడం మరియు వినియోగదారుడి వద్ద సరైన రీతిలో రుసుము వసూలు చేయడం దీని యొక్క ముఖ్య లక్ష్యం. ఇది పాసివ్ రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (RFID) టెక్నాలజీను ఉపయోగించి పనిచేస్తున్నట్లు తెలిపారు.

వివో Z 5i స్మార్ట్‌ఫోన్‌ రిలీజ్, వివో U20 మొదటి సేల్ ప్రారంభం

ప్రభుత్వం యొక్క ప్రకటన

ప్రభుత్వం యొక్క ప్రకటన

నవంబర్ 27, 2019 రోజున అత్యధికంగా 1,35,583 ట్యాగ్‌లు అమ్ముడవడంతో సుమారు 70 లక్షలకు పైగా ఫాస్ట్‌టాగ్‌లను జారీచేసారు. అయితే దీనికి ముందు రోజు 1.03 లక్షల ఫాస్ట్ ట్యాగ్‌లు జారీ చేయబడ్డాయి. రోజువారీ సగటున జారీచేసిన వాటిలో జూలైలో 8,000 ఉండగా ఇప్పుడు అది 330 శాతం పెరిగి 2019 నవంబర్‌లో రోజువారి సగటున 35,000 ట్యాగ్‌లు అమ్ముడవుతున్నట్లు రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

లాంగ్ టర్మ్ ప్లాన్‌లను అందించే ఏకైక DTH ఆపరేటర్ ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ

ఫాస్ట్ ట్యాగ్ ఖర్చు మాఫీ

ఫాస్ట్ ట్యాగ్ ఖర్చు మాఫీ

నవంబర్ 21 నుండి ట్యాగ్ ఖర్చు మాఫీ ప్రకటించిన తరువాత ఫాస్ట్ ట్యాగ్ జారీలో పెరుగుదల పొందింది. ఇప్పుడు ఫాస్ట్ ట్యాగ్ 560 కంటే ఎక్కువ టోల్ ప్లాజాలలో అమలులో ఉన్నందున రోజువారీగా ఇవి మరిన్ని జోడించబడుతున్నాయి. డిజిటల్ చెల్లింపులను మరింత పెంచడానికి జాతీయ రహదారులపై టోల్ ప్లాజాల యొక్క అన్ని లేన్లను డిసెంబర్ 1 నాటికి ‘ఫాస్ట్ ట్యాగ్ లేన్లు' గా చేయాలనీ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

చిన్న పిల్లల కోసం ప్రత్యేకంగా షియోమి Mi చిల్డ్రన్స్ వాచ్ 2S

హైబ్రిడ్ లేన్
 

ఏదేమైనా టోల్ ప్లాజా యొక్క ప్రతి ఒక లేన్ ‘హైబ్రిడ్ లేన్' అవుతుంది. దీని ద్వారా కేవలం ఫాస్ట్ ట్యాగ్ ద్వారా చెల్లింపు పద్ధతులను అంగీకరిస్తుంది. పైన పేర్కొన్న ఆదేశంతో ఫాస్ట్ ట్యాగ్ ద్వారా ప్రాసెస్ చేయబడిన సగటు రోజువారీ లావాదేవీలు ఈ సంవత్సరం జూలైలో 8.8 లక్షల నుండి 2019 నవంబర్లో 11.2 లక్షల లావాదేవీలకు పెరిగాయి. రోజువారీ సగటు వసూలు కూడా రూ. 11.2 కోట్ల నుండి రూ .19.5 కోట్లకు పెరిగింది అని మంత్రిత్వ శాఖ తెలిపింది.

Oppo ColorOS 7 అప్డేట్ ఫీచర్స్ ఏమిటో అవి ఎలా ఉన్నాయో తెలుసా?

లోడింగ్ బ్యాలెన్స్

లోడింగ్ బ్యాలెన్స్

టోల్ ప్లాజాలలో ఇబ్బందులను నివారించడానికి ప్రయాణికులు ఫాస్ట్‌టాగ్‌తో అనుసంధానించబడిన తగినంత బ్యాలెన్స్ వాలెట్‌ను కలిగి ఉండాలి. వినియోగదారులు రీఛార్జ్‌ల యొక్క అనేక పద్దతులను ఉపయోగించి తమ అకౌంట్ లో బ్యాలెన్స్‌ను జోడించవచ్చు. ఇందులో డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, యుపిఐ, నెట్ బ్యాంకింగ్ వంటివి మరిన్ని ఉన్నాయి.

హైవేలపై Dec 1 నుండి టోల్‌గేట్ పెమెంట్స్ కోసం ఫాస్ట్ ట్యాగ్ తప్పనిసరి!! దీనిని పొందడం ఎలా?

హెల్ప్‌లైన్ నంబర్

హెల్ప్‌లైన్ నంబర్

ఫాస్ట్ ట్యాగ్ లకు సంబంధించిన ఏదైనా సహాయం కోసం వినియోగదారులు హెల్ప్‌లైన్ నంబర్ ‘1033' కు కాల్ చేయవచ్చు. బ్యాంకుల ద్వారా కూడా వినియోగదారులు ఫాస్ట్ ట్యాగ్ ను పొందవచ్చు. ఏయే బ్యాంకులు ఫాస్ట్ ట్యాగ్ మీద డిస్కౌంట్ లను అందిస్తున్నాయో వాటి యొక్క పూర్తి వివరాలు తెలుసుకోవడానికి పైన ఉన్న లింకును చూడండి.

Most Read Articles
Best Mobiles in India

English summary
FASTags Surpassed 70 Lakhs, Reports Government

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X