Home
News

ఫాస్ట్‌ట్యాగ్‌ యాక్టివేషన్ పేరుతో రెచ్చిపోతున్న మోసగాళ్ళు

నేషనల్ హైవేలలో టోల్ గేట్ వద్ద టోల్ ఫీజులను వసూలు చేయడానికి ప్రభుత్వం దేశంలో ఫాస్ట్‌ట్యాగ్‌లను ఖచ్చితం చేయడంతో ప్రజలను మోసం చేయడానికి మోసగాళ్లకు మరొక కొత్త మార్గం దొరికింది. స్కామర్ లు UPI ద్వారా గల్లీ పౌరుల బ్యాంక్ అకౌంట్లను ఫాస్ట్‌ట్యాగ్‌కు అనుసంధానించి రిజిస్ట్రేషన్ చేయడానికి ప్రజలకు సహాయం చేయాలనే నెపంతో డబ్బును దొంగిలించడానికి ప్రయత్నిస్తున్నారు.

స్కామర్లు

ఈ కుంభకోణం యొక్క మొట్టమొదటి సంఘటన ఇటీవల బెంగళూరులో జరిగింది. స్కామర్లు ఆ వ్యక్తి నుండి రూ.50 వేలు దొంగలించినట్లు అధికారికంగా నివేదించారు. స్కామర్ యాక్సిస్ బ్యాంక్ యొక్క కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ అని తెలిపి నకిలీ కాల్ చేసి వాలెట్ పనిచేయడం లేదని ఫిర్యాదును పొందాము అని తెలిపి తరువాత తన ఫాస్ట్ ట్యాగ్ వాలెట్ యాక్టివేట్ చేయడానికి ఆన్‌లైన్ ఫారమ్ పంపాడు. స్కామర్ తెలివిగా బాధితుడి యొక్క UPI పిన్నును కూడా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం అని తెలిపి తెలివిగా పొందగలిగాడు. తరువాత అతని వద్ద నుండి డబ్బును దొంగిలించాడు.

 

 

బాధితుడు వివరాల ప్రకారం

బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం కాలర్ SMS ద్వారా ఒక లింక్ పంపారు. ఇది 'యాక్సిస్ బ్యాంక్ - ఫాస్ట్ ట్యాగ్ ఫారం' అని ఉంది. ఫాస్ట్ ట్యాగ్ వాలెట్ను యాక్టివేట్ చేయడానికి కొన్ని వివరాలను అందించమని ఆ ఫారం కోరింది. అందులో పూర్తి పేరు, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ మరియు యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI ) పిన్ వంటి వివరాలను అందించమని ఉన్నాయి. పిన్ నెంబర్ తో సహా అన్ని వివరాలను టైప్ చేసి సమర్పించిన తరువాత ఫోన్‌కు పంపిన వన్-టైమ్ పాస్ (OTP) ను వేరే నంబర్‌కు పంపమని కాలర్ తెలిపాడు. ఆ వివరాలు కూడా పంపిన తరువాత అకౌంట్ నుండి 50 వేల రూపాయలు మోసపోయినట్లు మెసేజ్ వచ్చింది అని బాధితుడు వివరించారు.

 

 

జాగ్రత్తలు

జాగ్రత్తలు

ఎట్టి పరిస్థితుల్లోనూ మీ బ్యాంక్ యొక్క వివరాలు అందులోను పిన్ నెంబర్ లేదా పాస్‌వర్డ్‌ను బహిర్గతం చేయవద్దని బ్యాంకులు ముందుగానే సిఫార్సు చేస్తున్నారు. ఫాస్ట్‌ట్యాగ్‌ యొక్క రిజిస్ట్రేషన్ కోసం మీరు పాస్వర్డ్ లేదా ఆన్‌లైన్ బ్యాంకింగ్ వివరాలను సమర్పించాల్సిన అవసరం లేదు. ఫాస్ట్‌ట్యాగ్‌ యొక్క సర్వీస్ అనేది కొత్తది కాబట్టి స్కామర్లు ప్రజలను మోసం చేయడానికి చాలా విధాలుగా ప్రయత్నిస్తున్నారు.

 

 

ఫాస్ట్‌ట్యాగ్‌ యాక్టివేట్

ఫాస్ట్‌ట్యాగ్‌ యాక్టివేట్

ఫాస్ట్‌ట్యాగ్‌ను యాక్టివేట్ చేయడానికి రెండు మార్గాలు మాత్రమే ఉన్నాయి. అవి మై ఫాస్ట్‌ట్యాగ్‌ యాప్ ను ఉపయోగించి సెల్ఫ్- యాక్టివేట్ ద్వారా మరియు సమీప బ్యాంక్ శాఖను సందర్శించడం ద్వారా వారి ఫాస్ట్‌ట్యాగ్‌లను యాక్టివేట్ చేయవచ్చు. కొంతమంది బ్యాంక్ ఉద్యోగి అని తెలిపి ఫోన్‌లో మాట్లాడటం ద్వారా ఫాస్ట్‌ట్యాగ్‌ యొక్క రిజిస్ట్రేషన్ జరగదు. ఒకవేళ మీకు అలాంటి కాల్స్ వచ్చినట్లయితే వెంటనే డిస్‌కనెక్ట్ చేయండి. ఆపై ఏదైనా సమస్య ఉందా అని తనిఖీ చేయడానికి మీ యొక్క బ్యాంక్ బ్రాంచ్‌ను స్వయంగా సందర్శించండి.

 

 

బ్యాంక్ అకౌంట్ లతో ఫాస్ట్‌ట్యాగ్‌లు

ఫాస్ట్‌ట్యాగ్‌లు సాధారణంగా బ్యాంక్ అకౌంట్ లతో అనుసంధానించబడి ఉన్నందున పెమెంట్స్ అన్ని నేరుగా లింక్ చేయబడిన బ్యాంక్ అకౌంట్ నుండి జరుగుతాయి. యూజర్లు కూడా NHAI ప్రీపెయిడ్ వాలెట్‌ను సృష్టించడం, రీఛార్జ్ చేయడం మరియు పెమెంట్స్ కోసం ఫాస్ట్‌ట్యాగ్‌తో కనెక్ట్ చేయడం వంటివి కలిగి ఉంటారు.అంతేకాకుండా మీరు మై ఫాస్ట్‌ట్యాగ్‌ యాప్ ద్వారా UPIని ఉపయోగించి మీ ఫాస్ట్‌ట్యాగ్‌ను కూడా రీఛార్జ్ చేసుకోవచ్చు.

Best Mobiles in India

English summary
FastTag Scam: Beware Of FastTag Activation Phone Call
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X