Home
News

FAU-G గేమ్ యొక్క ట్రైలర్ రిలీజ్!! జనవరి 26న గేమ్ గ్రాండ్ లాంచ్...

PUBGకి పోటీగా మేడ్ ఇన్ ఇండియా ఫీచర్ తో రాబోయే FAU-G (ఫియర్లెస్ అండ్ యునైటెడ్ గార్డ్స్) గేమ్ యొక్క అధికారిక విడుదల తేదీని గేమ్ తయారీదారులు ప్రకటించారు. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ మరియు గేమ్ మేకర్ ఎన్కోర్ గేమ్స్ సంయుక్తంగా తయారుచేసే ఈ గేమ్ ను రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26 న ఇండియాలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

FAU-G గేమ్ లాంచ్ తేదీ

FAU-G గేమ్ లాంచ్ తేదీ

FAU-G గేమ్ అనేది భారతదేశం యొక్క సరిహద్దు ప్రాంతంలో జరిగే ఒక యాక్షన్ గేమ్. ఇందులో ప్రధానంగా శత్రు ఆక్రమణదారుల నుండి దేశాన్ని రక్షించే సైనికుల చుట్టూ ఈ గేమ్ ఉంటుంది. భారతదేశంలో PUBG మొబైల్ గేమ్ ను నిషేధించిన వెంటనే ప్రకటించబడింది. FAU-G యొక్క విడుదల తేదీని అక్టోబర్ నెలలో నిర్ణయించబడినప్పటికి కొన్ని అనివార్య కారణాల వల్ల లాంచ్ కొద్దిగా ఆలస్యం అయింది. నవంబర్ చివరలో గూగుల్ ప్లే స్టోర్‌లో ప్రీ-రిజిస్ట్రేషన్ కోసం nCore గేమ్స్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రస్తుతానికి iOS మరియు iPadOS కోసం FAU-G విడుదల అవుతుందో లేదో అన్న విషయం మీద ఎటువంటి సరైన సమాచారం లేదు. ప్రస్తుతం FAU-G యొక్క ట్రైలర్ విడుదల అయి నెట్ లో సంచలనం సృష్టిస్తున్నది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

FAU-G గేమ్ ట్రైలర్ లాంచ్

FAU-G గేమ్ ట్రైలర్ లాంచ్

FAU-G యొక్క గేమ్ ట్రైలర్ ను ఇప్పుడు nCore గేమ్స్ విడుదల చేసింది. 1.38నిమిషాల పాటు ఉండే వీడియోలోని సమాచారం ప్రకారం గేమ్ యొక్క మొదటి ఎపిసోడ్ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (LAC) లడఖ్ వద్ద సెట్ చేయబడింది. చైనా యొక్క సైనిక దళాలు మన భూమిలోకి ప్రవేశిస్తున్నట్లు చూపిస్తుంది అలాగే భారత సైనికులు ఈ ఆక్రమణను ఎదురుకునే పనిలో చైనా సైనికులతో యుద్ధం చేసే విధంగా వీడియోలో చూపించారు. FAU-G అనేది మేడ్ ఇన్ ఇండియా గేమ్ కావున భారత సైనికులు దేశాన్ని ఎలా రక్షిస్తున్నారో చూపించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.

భారతదేశంలో FAU-G యొక్క ప్రకటన దేశంలో PUBG మొబైల్ నిషేధించిన వెంటనే వచ్చింది. FAU-G ప్రకటనకు సంబంధించి చాలా ప్రశ్నలు తలెత్తాయి. కాని FAU-G ప్రారంభానికి PUBG మొబైల్ నిషేధంతో ఎటువంటి సంబంధం లేదన్న గాలి మాటలను nCore గేమ్స్ క్లియర్ చేసింది. లాంచ్ సమయంలో FAU-G కి బాటిల్ రాయల్ మోడ్ ఉండదని గేమ్ మేకర్ ధృవీకరించారు.

FAU-G VS PUBG

FAU-G VS PUBG

యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్ మరియు బాటిల్ రాయల్ మోడ్ కారణంగా PUBG మొబైల్ భారతదేశంలో విపరీతమైన ప్రజాదరణ పొందింది. PUBG కార్పొరేషన్ ఇప్పటికీ అదే గేమ్ ను ఇండియాలోకి తిరిగి తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. కావున FAU-G కూడా తన యొక్క యూజర్ బేస్ ను పెంచుకోవడానికి కూడా ఇది మంచి అవకాశంగా ఉంటుంది. PUBG మొబైల్ భారతదేశంలో నిషేధించబడింది మరియు ఇది దేశంలో తిరిగి ప్రారంభించేటప్పుడు ఎటువంటి అప్ డేట్ లేదు.

Best Mobiles in India

English summary
FAU-G Game First Episode India Launch Date Set on January 26!! New Trailer Released
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X