FAU-G గేమ్ ప్రీ-రిజిస్ట్రేషన్ మొదలయ్యాయి!!! త్వరపడండి...

|

ఇండియాలో ఇటీవలి కాలంలో చైనా యొక్క యాప్ లను బ్యాన్ చేసిన వాటిలో PUBG మొబైల్ గేమ్ కూడా ఉంది. ఈ మొబైల్ గేమ్ ను దృష్టిలో ఉంచుకొని ఫియర్లెస్ అండ్ యునైటెడ్ గార్డ్స్(FAU-G) గేమ్‌ను ఎన్‌కోర్ గేమ్స్ సంస్థ అభివృద్ధి చేసింది. సంస్థ ఈ గేమ్‌ను ఈ నెలలో విడుదల చేయాల్సి ఉంది. అయితే లాంచ్ కొద్దిగా ఆలస్యం అయిన కారణంగా ఇప్పుడు గూగుల్ ప్లే స్టోర్‌లో ప్రీ-రిజిస్ట్రేషన్ పేజీని అందుబాటులోకి తీసుకువచ్చింది. FAU-G యొక్క డెవలపర్లు ప్రస్తుతానికి ఈ ప్రీ-రిజిస్ట్రేషన్లను మొదట Android యూజర్ల కోసం మాత్రమే విడుదల చేసారు అయితే IOS వినియోగదారులకు అందుబాటులో లేవు.

 

FAU-G గేమ్ vs PUBG మొబైల్ ఇండియా

FAU-G గేమ్ vs PUBG మొబైల్ ఇండియా

ఇండియాలో వచ్చే నెలలో PUBG మొబైల్ ఇండియా తిరిగి లాంచ్ అవుతున్నందున FAU-G లాంచ్ ఎంత వరకు పోటీ పడుతుందో ఆసక్తికరంగా ఉంది. FAU-G గేమ్ అనేది చైనా వ్యతిరేక సెంటిమెంట్ తో స్థానికంగా 'మేడ్ ఇన్ ఇండియా' నినాదంతో తయారు చేసిన గేమ్ కావున ప్రజలలో ఎంత వరకు ఆదరణ పొందుతుందో చూడవలసి ఉంది. PUBG కార్పొరేషన్ కూడా ఇప్పుడు PUBG మొబైల్ ఇండియా అనే కొత్త వెర్షన్‌తో తిరిగి రావడం గురించి ఇటీవల కొన్ని టీజర్‌లను కూడా విడుదల చేయడంతో మొబైల్ ప్రేమికులను ఆకర్షిస్తోంది.

 

Also Read: WhatsAppలోని చాటింగ్ మిస్ అవ్వకుండా మొబైల్ నంబర్ మార్చడం ఎలా?Also Read: WhatsAppలోని చాటింగ్ మిస్ అవ్వకుండా మొబైల్ నంబర్ మార్చడం ఎలా?

ఫియర్లెస్ అండ్ యునైటెడ్ గార్డ్స్(FAU-G) ప్రీ-రిజిస్టర్ విధానం
 

ఫియర్లెస్ అండ్ యునైటెడ్ గార్డ్స్(FAU-G) ప్రీ-రిజిస్టర్ విధానం

FAU-G గేమ్ కోసం ప్రీ-రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని చూస్తున్న వారు నేరుగా గూగుల్ ప్లే స్టోర్‌కు వెళ్లి FAU-G కోసం సెర్చ్ చేయండి. మీ యొక్క ఫోన్ ఈ గేమ్ ను సపోర్ట్ చేసే ఫీచర్లను కలిగి ఉంటే కనుక గ్రీన్ కలర్ లో ప్రీ-రిజిస్ట్రేషన్ బటన్ కనిపిస్తుంది. తరువాత మీరు చేయవలసిందల్లా ప్రీ-రిజిస్టర్ బటన్‌ను నొక్కడం మరియు అధికారిక విడుదల కోసం వేచి ఉండడం. గేమ్ ప్రారంభించిన తర్వాత గూగుల్ ప్లే స్టోర్ FAU-G కోసం ప్రీ-రిజిస్టర్ ను నమోదు చేసుకున్న వినియోగదారులందరికీ నోటిఫికేషన్ పంపుతుంది. మీ యొక్క ఫోన్ Wi-Fi కనెక్షన్‌లో ఉంటే కనుక గేమ్ ఆటోమ్యాటిక్ గా డౌన్‌లోడ్ అవుతుంది. ప్రస్తుతానికి అధికారిక లాంచ్ డేట్ గురించి సమాచారం తెలియాలసి ఉంది.

FAU-G గేమ్ విడుదల వివరాలు

FAU-G గేమ్ విడుదల వివరాలు

బెంగళూరుకు చెందిన ఎన్‌కోర్ గేమ్స్ FAU-G ను అభివృద్ధి చేసింది. ప్రముఖ బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ఈ ప్రాజెక్టుకు మెంటర్ గా వ్యహరిస్తున్నాడు. ఇండియాలో PUBG మొబైల్‌పై ప్రభుత్వం నిషేధం విధించిన వెంటనే ఈ గేమ్ ను సెప్టెంబర్‌లో ప్రకటించారు. PUBG మొబైల్ నిషేధంపై చాలా ఉహాగానాలకు ఇది దారితీసింది. అయినప్పటికీ FAU-G సృష్టికర్తలు తమ ప్రకటనకు PUBG మొబైల్ నిషేధంతో ఎటువంటి సంబంధం లేదని ధృవీకరించారు.FAU-G గేమ్ అక్టోబర్‌లోనే లాంచ్ అవ్వవలసి ఉంది అయితే కొన్ని కారణాల వలన కొద్దిగా ఆలస్యం అయిందని తెలిపారు. ఈ గేమ్ నవంబర్లో విడుదల అవుతుంది అని కంపెనీ అక్టోబర్ 25 న టీజర్ ను విడుదల చేసింది. అయితే ఎన్‌కోర్ గేమ్స్ ప్రీ-రిజిస్ట్రేషన్ కోసం గూగుల్ ప్లే స్టోర్‌లో గేమ్ ను విడుదల చేశాయి.

FAU-G గేమ్‌ప్లే & భారత్ కే వీర్ ట్రస్ట్‌ విరాళం వివరాలు

FAU-G గేమ్‌ప్లే & భారత్ కే వీర్ ట్రస్ట్‌ విరాళం వివరాలు

ఫియర్లెస్ అండ్ యునైటెడ్ గార్డ్స్ (FAU-G) గేమ్ యొక్క గేమ్‌ప్లే విషయానికొస్తే గూగుల్ ప్లే స్టోర్ జాబితా ప్రకారం ‘భారతదేశం యొక్క ఉత్తర సరిహద్దు వద్ద ఉన్న శిఖరాలపై దేశం యొక్క పోరాట సమూహం బ్యాక్ గ్రౌండ్ లో జరుగుతుంది. ఇందులో దేశం యొక్క అహంకారం మరియు సార్వభౌమత్వాన్ని కాపాడే విషయాలు ఎక్కువగా ఉంటాయి. ఫియర్లెస్ మరియు యునైటెడ్ గార్డ్స్ అనేది చాలా ధైర్యవంతుల కోసం చాలా కష్టమైన పని. ఈ గేమ్ ప్రమాదకరమైన సరిహద్దు భూభాగంలో పెట్రోలింగ్‌పై FAU-G కమాండోల చుట్టూ కేంద్రీకృతమై ఉంటుంది. ఈ కమాండోలు భారత గడ్డపై శత్రు ఆక్రమణదారులతో పోరాడతారు. చివరగా FAU-G అనేది గర్వంగా ‘మేడ్ ఇన్ ఇండియా' ప్రాజెక్ట్ అని చెప్పబడింది, ఇది మన దేశం యొక్క సాయుధ దళాల వీరులకు నివాళి అర్పించింది. ఆటలో 20% ఆదాయం ‘భారత్ కే వీర్' ట్రస్ట్‌కు వెళ్తుందని కంపెనీ ఇప్పటికే ధృవీకరించింది.

Best Mobiles in India

English summary
FAU-G Game Pre-Registrations Now Available on Google Play Store

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X