FAU-G గేమ్ టీజర్ ను విడుదల చేసిన అక్షయ్ కుమార్! నవంబర్ లో గేమ్ లాంచ్..

|

భారతదేశంలో PUBG మొబైల్ గేమ్ ను నిషేదించిన తరువాత దాని యొక్క మిగిలిపోయిన శూన్యతను పూర్తి చేయడానికి FAU-G గేమ్ ను ప్రకటించారు. ఇండియా యొక్క లోకల్ ఫీచర్లతో తయారుచేస్తున్న ఈ హైప్ గేమ్ FAU-G నవంబర్‌లో ప్రారంభమవుతుందని nCore గేమ్స్ ప్రకటించింది. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ యొక్క అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఈ గేమ్ యొక్క మొదటి అధికారిక టీజర్ ను విడుదల చేసారు. అక్షయ్ కుమార్ ఈ FAU-G గేమ్ కు పూర్తిగా తన మద్దతును ఇస్తున్నట్లు అధికారికంగా ప్రకటించాడు. అయితే ఈ గేమ్ గురించి పూర్తి వివరాలు ఇంకా విడుదల కాలేదు. టీజర్‌లో ఉపయోగించిన విజువల్స్ అసలైన గేమ్ నుండి వచ్చాయా లేదా టీజర్ కోసం సృష్టించబడినవి అనేది అస్పష్టంగా ఉంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఇండియాలో PUBG మొబైల్ నిషేధం

ఇండియాలో PUBG మొబైల్ నిషేధం

ఇండియాలో చైనా యాప్ లను నిషేధించే క్రమంలో PUBG మొబైల్ మరియు PUBG మొబైల్ లైట్‌ను కూడా ప్రభుత్వం నిషేధించిన కొద్దికాలానికే ఇండియా యొక్క FAU-G గేమ్ ను సెప్టెంబర్‌లో ప్రకటించారు. PUBG మొబైల్ గేమ్ వినియోగదారుల డేటాను లీక్ చేస్తున్న కారణంగా ప్రభుత్వం నిషేధించింది. దీని ప్రత్యాన్మాయ మార్గాన్ని కనుగొనటానికి PUBG కార్పొరేషన్ తెర వెనుక పనిచేస్తున్నట్లు అనిపించినప్పటికీ గేమ్ యొక్క రెండు వెర్షన్లు మరియు డజన్ల కొద్దీ ఇతర చైనీస్ యాప్ లు మరియు గేమ్లు ఇండియాలో నిషేధించబడ్డాయి.

Also Read:2020 Q3 స్మార్ట్‌ఫోన్‌ల అమ్మకాలలో సత్తా చాటిన షియోమి కంపెనీ...Also Read:2020 Q3 స్మార్ట్‌ఫోన్‌ల అమ్మకాలలో సత్తా చాటిన షియోమి కంపెనీ...

FAUG గేమ్ టీజర్ పూర్తి వివరాలు

FAUG గేమ్ టీజర్ పూర్తి వివరాలు

FAUG గేమ్ యొక్క టీజర్లో మొత్తం గేమ్ గురించి పెద్దగా వెల్లడించలేదు. టీజర్లో గల సారాంశం ప్రకారం గాల్వన్ వ్యాలీ వద్ద చైనా సైనికులతో భారతీయ సైనికులను విభేదిస్తున్నట్లు చూపిస్తుంది. సెప్టెంబరులో రాయిటర్స్‌తో జరిగిన సంభాషణలో ఎన్‌కోర్ గేమ్స్‌లో సలహాదారు మరియు పెట్టుబడిదారుగా ఉన్న విశాల్ గొండాల్ FAU-G గేమ్ యొక్క మొదటి దశ గాల్వన్ వ్యాలీలో ఉంటుందని సూచించారు. గాల్వన్ వ్యాలీ ప్రాంతంలో భారత, చైనా దళాల మధ్య జూన్ నెలలో జరిగిన ఘర్షణలలో 20 మంది భారతీయ సైనికులు చనిపోవడం జరిగింది.

FAU-G గేమ్ ఆదాయంలో 'భరత్ కే వీర్' విరాళం

FAU-G గేమ్ ఆదాయంలో 'భరత్ కే వీర్' విరాళం

FAU-G గేమ్ యొక్క టీజర్ ప్రస్తుతం యూట్యూబ్‌లో కూడా షేర్ చేయబడింది. ఈ వీడియో యొక్క కవర్ ఫోటో FAU-G ను గూగుల్ ప్లే స్టోర్ మరియు ఆపిల్ యాప్ స్టోర్ ద్వారా కూడా డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఆఫర్ చేయబడుతుందని వెల్లడించింది. ఇది PC మరియు గేమింగ్ కన్సోల్‌లకు కూడా వస్తుందా అనేది అస్పష్టంగా ఉంది. గుర్తుచేసుకుంటే ఫియర్లెస్ మరియు యునైటెడ్-గార్డ్స్ కోసం FAU-G గేమ్  ద్వారా వచ్చే ఆదాయంలో 20 శాతం భరత్ కే వీర్ చొరవకు విరాళంగా ఇవ్వనున్నట్లు గేమ్ డెవలపర్ ప్రకటించారు.

Best Mobiles in India

Read more about:
English summary
FAU-G Game Teaser Released!! Game Launching on November

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X