PUBG ప్రత్యామ్నాయంగా FAU-G గేమ్!!! త్వరలోనే అందుబాటులోకి  

|

ఇండియాలో PUBG మొబైల్ యాప్ ను నిషేధించిన రెండు రోజుల్లోనే భారతీయ గేమ్ డెవలపర్లు PUBG కి ప్రత్యామ్నాయాన్ని దానికి సమానమైన యుద్ధ రాయల్ తరహా గేమ్ లను పరిచయం చేయడానికి తమ యొక్క బుద్ధికి పనిచెబుతున్నారు. గేమ్ డెవలపర్‌లలో ఒకరైన nCore గేమ్స్ వారు FAU-G లేదా ఫియర్లెస్ అండ్ యునైటెడ్: గార్డ్స్ అని పిలువబడే PUBG మొబైల్ యొక్క భారతీయ వెర్షన్‌ను ప్రకటించింది. ఈ గేమ్ త్వరలోనే విడుదల కానుంది అని nCore గేమ్స్ వారు తెలిపారు. ఈ గేమ్ యొక్క విడుదల తేదీ మరియు గేమ్ యొక్క ఇతర వివరాల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

నరేంద్ర మోడీ ఆత్మనిభర్ యాప్ క్యాంపెయిన్

నరేంద్ర మోడీ ఆత్మనిభర్ యాప్ క్యాంపెయిన్

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గతంలో ప్రకటించిన "ఆత్మనిభర్ యాప్" కార్యక్రమానికి ప్రతిస్పందనగా FAU-G గేమ్ ను అభివృద్ధి చేసినట్లు GOQii యొక్క CEO విశాల్ గొండాల్ అధికారిక ట్వీట్ ద్వారా తెలిపారు. PUBG మొబైల్ మరియు PUBG మొబైల్ లైట్ సహా 118 చైనీస్ యాప్‌లను భారత ప్రభుత్వం నిషేధించిన రెండు రోజులకే ఈ ప్రకటన వచ్చింది. 2020 మే-జూన్ నుండి గేమ్ డెవలపర్ల బృందం FAU-G పై చురుకుగా పనిచేస్తుందని గోండల్ పత్రిక సమావేశంలో తెలిపారు. వీలైనంత త్వరగా దీనిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు కూడా తెలిపారు.

Also Read:Flipkart లో వీటిపై 80% వరకు ఆఫర్లు. కొనడానికి ఇదే మంచి అవకాశం.Also Read:Flipkart లో వీటిపై 80% వరకు ఆఫర్లు. కొనడానికి ఇదే మంచి అవకాశం.

FAU-G గేమ్ వివరాలు

FAU-G గేమ్ వివరాలు

nCore గేమ్ సంస్థ వారు ఇంకా ఇండియన్ యాక్షన్ గేమ్ FAU-G గేమ్ గురించి అన్ని వివరాలను వెల్లడించలేదు. గేమ్ డెవలపర్లు ఈ గేమ్  గురించి మాట్లాడుతూ FAU-G పేరుకు సూచించినట్లుగా భారత సైనికుల త్యాగం గురించి ఆటగాళ్లకు పాఠం నేర్పే విధంగా రూపొందించినట్లు తెలిపారు. ఈ గేమ్ యొక్క నికర ఆదాయంలో 20 శాతం భరత్‌కీవీర్ ట్రస్ట్‌కు విరాళంగా ఇస్తున్నట్లు గేమ్ యొక్క ప్రతినిధులు తెలిపారు.

చైనా యాప్ ల నిషేదానికి ప్రత్యామ్నాయంగా ఇండియా యాప్ లు

చైనా యాప్ ల నిషేదానికి ప్రత్యామ్నాయంగా ఇండియా యాప్ లు

PUBG మొబైల్ నిషేదం ప్రకటించిన తరువాత భారతీయ గేమ్ డెవలపర్లు ఈ గేమ్ కు దేశీ ప్రత్యామ్నాయాలను తీసుకురావడానికి మంచి తరుణంగా భావించి కృషి చేస్తున్నారు. చిన్న వీడియో ప్లాట్‌ఫాం టిక్‌టాక్‌ను కూడా ఇండియాలో మొదట నిషేధించినప్పుడు కూడా ఇదే తరహా జరిగింది. ఇందులో భాగంగా చింగారి, మిట్రాన్, రోపోసో, మోజ్ వంటి దేశీయ యాప్ లు ఇండియాలో టిక్‌టాక్‌కు ప్రత్యామ్నాయ స్థానంలో రిలీజ్ అయ్యాయి.

గూగుల్ ప్లే స్టోర్ మరియు ఆపిల్ స్టోర్లలో PUBG తొలగింపు

గూగుల్ ప్లే స్టోర్ మరియు ఆపిల్ స్టోర్లలో PUBG తొలగింపు

పాపులర్ బాటిల్ రాయల్ గేమ్ PUBG మొబైల్ మరియు దాని లైట్ వెర్షన్‌తో సహా 118 యాప్‌లను భారత ప్రభుత్వం బుధవారం నిషేధించింది. అయితే ఇప్పుడు ఇండియాలో గూగుల్ ప్లే స్టోర్ మరియు ఆపిల్ యాప్ స్టోర్ నుండి కూడా ఈ గేమ్ ను తొలగించడం జరిగింది. అయితే PUBG గేమ్ ను ఇప్పటికే వారి ఫోన్లలో డౌన్‌లోడ్ చేసిన వినియోగదారులు మాత్రం ఇప్పటికీ ఈ గేమ్ ను ఆడగలుగుతారు.

Best Mobiles in India

Read more about:
English summary
FAU-G Indian Game Announced After PUBG Ban

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X