యుఎస్‌లో ఫేస్‌బుక్ యాప్స్‌తో 2.3 లక్షల ఉద్యోగాలు

Posted By: Super

యుఎస్‌లో ఫేస్‌బుక్ యాప్స్‌తో 2.3 లక్షల ఉద్యోగాలు

వాష్గింటన్: అనతి కాలంలోనే ఎక్కువ మంది యూజర్స్‌ని సొంతం చేసుకున్న ప్రముఖ సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్ ఫేస్‌బుక్ త్వరలో అమెరికా ఎకానమీకి తనవంతు సాయం జాబ్స్ రూపంలో చేయనుందని ఇటీవలే ఓ ప్రముఖ సర్వే వెల్లడించడం జరిగింది. ఇంటర్నెట్లో ఉపయోగించే ప్రతి ఒక్కరికి ఫేవరెట్‌గా మారిన సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్ భారీగా ఉద్యోగాలను త్వరలో కూడా కల్పిస్తోంది.

సంవత్సరం మొత్తం మీద సుమారుగా 2.35,644 లక్షల దాకా కొత్త ఉద్యోగాల కల్పన జరిగి ఉండొచ్చని యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్స్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ఫలితంగా సాఫ్ట్‌వేర్ కంపెనీల సిబ్బంది వేతనాలు, ఇతర ప్రయోజనాల రూపంలో అమెరికా ఎకానమీకి 15.71 బిలియన్ డాలర్ల మేర ఆదాయం వచ్చి ఉంటుందని ఆ నివేదికలో పేర్కొంది. ఫార్మ్‌విల్ వంటి ఇంటరాక్టివ్ గేమ్స్ నుంచి అనేక రకాల అప్లికేషన్స్‌తో.. సోషల్ సైట్లు కొత్త రకం ఎకానమీ సృష్టికి కారణమయ్యాయని పేర్కొంది.

ఈ ట్రెండ్‌ను ‘యాప్ ఎకానమీ’గా అభివర్ణించింది. ఫేస్‌బుక్‌లో ప్రస్తుతం 2,000 మంది ఉద్యోగులు ఉండగా, సుమారు 75 కోట్ల మంది యూజర్లు రోజూ 2 కోట్ల పైగా యాప్స్‌ను వినియోగిస్తున్నారని సమాచారం. దీనితో పాటు ఫేస్‌బుక్ యూజర్స్ రోజుకి 20 మిలియన్ అప్లికేషన్స్‌ని తమ తమ కంప్యూటర్స్‌లలో ఇనిస్టాల్ చేయడం జరుగుతుందని తెలిపింది. అంతేకాకుండా కేవలం ఫేస్‌బుక్ ఫ్లాట్ ఫామ్ మీద కొన్ని వందల అఫ్లికేషన్స్ రూపోందించడం వల్ల సుమారుగా 53,00వేల సాప్ట్‌వేర్ ఉద్యోగాలు రూపకల్పన జరిగిందని తెలియజేశారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot