సెక్స్ కామెంట్లు: వినూత్నంగా బుద్ధి చెప్పిన మహిళ!

Posted By:

 సెక్స్ కామెంట్లు: వినూత్నంగా బుద్ధి చెప్పిన మహిళ!
అదో కంప్యూటర్ ప్రోగ్రామింగ్ కాన్ఫిరెన్స్ .. మహిళా డెవలపర్ ఆడ్రియా రిచర్డ్స్ కూడా ఆ సదస్సుకు హాజరయ్యారు. అక్కడ ఆమెకో వింతం అనుభవం ఎదురైంది. సదస్సులో లీనమై వక్తల ప్రసంగాలను వింటున్న ఆడ్రియాకు తన వెనుక కూర్చిని ఉన్న పులువురు పురుషులు అసభ్యకరంగా మాట్లాడటం వినిపించింది.

సాటి మహిళ పై సదరు వ్యక్తులు చేస్తున్నలైంగిక వ్యాఖ్యల పై వినూత్నంగా స్పందించిన ఆడ్రియా వెనక్కి తిరిగి వారి ఫోటోలను చిత్రీకరించి కామెంట్‌లతో కూడిన ఓ సందేశాన్ని ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ఆడ్రియా ట్విట్టర్‍లో చేసిన పోస్ట్‌కు సదస్సు ప్రాంగణంలో మిశ్రమ స్పందన లిభించింది. మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన సదురు వ్యక్తుల పై సదస్సు నిర్వాహకులు ఆగ్రహం వ్యక్తం చేయటంతో ఆ వ్యక్తులు క్షమాపణలు వేడుకోవల్సి వచ్చింది. ఏదేమైనప్పటికి స్త్రీల ఆత్మగౌరవాన్ని మంటగలపుతున్న పురుషుల పై సాటి మహిళగా ఆడ్రియా స్పందించిన తీరు మహిళాలోకానికి నూతన శక్తినిచ్చింది.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting