Home
News

కేవలం Google Pixel 8 స్మార్ట్‌ఫోన్లలో మాత్రమే ఉన్న ప్రత్యేక ఫీచర్లు..!

ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్‌ నుంచి ఎప్పటి నుంచో ఎదురుచూసిన గూగుల్ పిక్సల్‌ 8 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లు అక్టోబర్‌ 4 తేదీన విడుదల అయ్యాయి. ఈ పిక్సల్‌ 8, పిక్సల్‌ 8 ప్రో స్మార్ట్‌ఫోన్లు అక్టోబర్‌ 12 సేల్‌లో అందుబాటులో ఉండనున్నాయి. ఈ ఫోన్లు ఆర్టిఫిషియల్‌ ఆధారిత ఫీచర్లు, క్లీన్‌ UI, మెరుగైన పనితీరు, నాణ్యమైన ఫోటోగ్రఫీతో పాటు ప్రీమియం డిజైన్‌ను కలిగి ఉంటుంది.

ఇతర ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ ఫోన్ల కంటే గూగుల్‌ పిక్సల్‌ 8 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్ల ఫీచర్లు ఎంతో మెరుగైనవి. అయితే ఈ పిక్సల్ 8, పిక్సల్‌ 8 ప్రో స్మార్ట్‌ఫోన్లలో ఇతర ఏ ఫోన్లలో లేనటువంటి కొన్ని కీలక ఫీచర్లు కలిగి ఉన్నాయి.

Google pixel 8 series

* గూగుల్‌ పిక్సల్‌ 8 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లు 7 సంవత్సరాలపాటు సాఫ్ట్‌వేర్‌ సపోర్టును పొందుతాయి. అంటే సుమారుగా ఆండ్రాయిడ్ 21 OS వరకు అప్‌డేట్లను పొందనున్నాయి. ప్రస్తుతానికి గూగుల్‌ మినహా ఏ ఇతర సంస్థ కూడా ఇటువంటి సపోర్టును అందించడం లేదు. దీంతోపాటు 7 సంవత్సరాలపాటు సెక్యురిటీ అప్‌డేట్లను పొందనుంది. ఫలితంగా భవిష్యత్‌లోనూ ఈ ఫోన్‌ను ఎటువంటి ఇబ్బందులు లేకుండా వినియోగించుకోవచ్చు.

* పిక్సల్‌ 8 స్మార్ట్‌ఫోన్‌ అత్యంత బ్రైట్‌నెస్‌ కలిగిన డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. గూగుల్‌ పిక్సల్‌ 8 స్మార్ట్‌ఫోన్‌ మాత్రమే 2000nits గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. ఫలితంగా ఎక్కువ సూర్యకాంతి ఉన్న సమయంలోనూ ఎటువంటి సమస్య లేకుండా కంటెంట్‌ను వీక్షించవచ్చు. ప్రస్తుతం ఉన్న ఫోన్లలో ఇదే గరిష్టం. తర్వాత స్థానంలో శాంసంగ్‌ గెలాక్సీ S23 అల్ట్రా ఫోన్ 1750 nits గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది.

* ఈ స్మార్ట్‌ఫోన్లలో ఆడియో మేజిక్‌ ఎరేజర్‌ టూల్‌ను ఉంటుంది. రికార్డు చేసిన వీడియోల్లో ఉన్న అవాంచిత శబ్దాలను తొలగించవచ్చు. సాధారణంగా థర్ట్‌పార్టీ యాప్‌ల ద్వారా ఈ ఫీచర్‌ అందుబాటులో ఉంటుంది. అయితే గూగుల్‌ తన ఫోటో యాప్‌ ద్వారా ఈ ఫీచర్‌ను ప్రీ ఇన్‌స్టాల్డ్‌గా అందిస్తుంది.

* దీంతోపాటు పిక్సల్‌ 8 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లలో నాణ్యమైన, మెరుగైన ఫోటోల కోసం ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారిత ఫీచర్‌ బెస్ట్‌ టేక్‌ను కలిగి ఉంటుంది. ఈ ఫీచర్‌ ముఖ్యంగా గ్రూప్‌ ఫోటోలు తీసుకుంటున్న సమయంలో అందరూ కళ్లు తెరిచి ఉన్నాయా లేదా అనే దానిపై ఫోకస్‌ చేస్తుంది. దీంతోపాటు అనేక వేర్వేరు ఫోటోలను ఒకేదానిపై అమర్చుకోవచ్చు.

గూగుల్‌ పిక్సల్‌ 8, పిక్సల్‌ 8 ప్రో స్మార్ట్‌ఫోన్లు డ్యూయల్‌ సిమ్‌ ఆప్షన్‌ను కలిగి ఉంటాయి. మరియు ఆండ్రాయిడ్‌ 14 అవుట్ ఆఫ్‌ ది బాక్స్‌ పైన పనిచేస్తాయి. పిక్సల్‌ 8 ఫోన్‌ 6.2 అంగుళాల పుల్‌ HD+ OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.

మరియు 90Hz రీఫ్రెష్‌ రేట్‌తో రానుంది. అదే పిక్సల్‌ 8 ప్రో 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.7 అంగుళాల క్వాడ్‌ HD స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు గూగుల్‌ నానో కోర్‌ టెన్సర్‌ G3 చిప్‌సెట్‌ సహా టైటాన్ M2 సెక్యూరిటీ చిప్‌ను కలిగి ఉంటాయి.

గూగుల్‌ పిక్సల్‌ 8, పిక్సల్‌ 8 ప్రో స్మార్ట్‌ఫోన్లు శాంసంగ్‌ GN2 సెన్సార్‌, f/1.68 అపేచర్‌తో 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుంది. దీంతోపాటు పిక్సల్‌ 8 సోనీ IMX386 సెన్సార్‌, f/2.2 అపేచర్‌తో 12MP ఆల్ట్రావైడ్‌ యాంగిల్‌ కెమెరాను కలిగి ఉంటుంది.

అదే పిక్సల్‌ 8 ప్రో సోనీ IMX787 సెన్సార్‌, f/2.8 అపేచర్‌తో 64MP ఆల్ట్రావైడ్‌ యాంగిల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. దీంతోపాటు ప్రో మోడల్‌ శాంసంగ్‌ GMS సెన్సార్‌తో f/1.95 అపేచర్‌తో 48MP టెలీఫోటో కెమెరాను కలిగి ఉంటుంది. ఈ రెండు ఫోన్లు ముందువైపు f/2.2 అపేచర్‌తో 11MP కెమెరాను అమర్చారు.

గూగుల్ పిక్సల్‌ 8 స్మార్ట్‌ఫోన్ 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌లోనే లభించనుంది. ఈ ఫోన్ ధర రూ.75,999గా ఉంది. ఈ ఫోన్‌ హాజెల్‌, అబ్సిడియన్‌, రోజ్‌ కలర్‌ ఎంపికల్లో కొనుగోలుకు అందుబాటులో ఉండనుంది. అలాగే పిక్సల్‌ 8 ప్రో 128GB స్టోరేజీ మోడల్‌ రూ.1,06,999కు కొనుగోలు చేయవచ్చు.

ఈ ఫోన్‌ బే, అబ్సిడియన్‌, పింగాణి రంగుల్లో లభిస్తుంది. పిక్సల్‌ 8 ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా ముందస్తు బుకింగ్‌ చేసుకోవచ్చు. గూగుల్ పిక్సల్‌ 8 స్మార్ట్‌ఫోన్ 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌ను ఐసీఐసీఐ, కోటక్‌, యాక్సెస్‌ బ్యాంక్‌ ద్వారా కొనుగోలు చేసినవారికి రూ.8000 తక్షణ డిస్కౌంట్‌ పొందుతారు.

Best Mobiles in India

English summary
Few Features that Google pixel 8 series has only and that don't get in any other phones
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X