పాకిస్థాన్ ఉచ్చులో హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ కంపెనీలు, కీలక డేటా గల్లంతు?

ఐటీ కంపెనీలే టార్గెట్‌గా పాక్ హ్యాకర్లు చలరేగిపోతున్నారు. పాకిస్థాన్‌కు చెందిన కొందరు హ్యాకర్లు గత 10 రోజులుగా హైదరాబాద్‌లోని సుమారు 50కు పైగా ఐటీ కంపెనీల పై దాడులు జరిపినట్లు సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ గురువారం వెల్లడించింది. ఈ సైబర్ దాడుల పై ముమ్మర దర్యాప్తు ప్రారంభమైనట్లు కౌన్సిల్ తెలిపింది.

పాకిస్థాన్ ఉచ్చులో హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ కంపెనీలు, కీలక డేటా గల్లంతు?

Read More : షాకింగ్..13.8 అంగుళాల డిస్‌ప్లేతో నోకియా డివైస్?

'ransomware'ను ఉపయోగించి హ్యాకర్లు ఈ కంపెనీలకు సంబంధించిచ కీలక సమాచారాన్ని దొంగిలించినట్లు అధికారులు తెలిపారు. తాము దొంగిలిచిన సమాచారానికి సంబంధించి decryption keys ఇవ్వాలంటే పెద్దమొత్తంలో తమకు చెల్లించాలని హ్యాకర్లు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

టర్కీ, సొమాలియా,

టర్కీ, సొమాలియా, సౌదీ అరేబియాలలోని సర్వర్లను ఉపయోగించుకుని పాక్ హ్యాకర్లు ఈ దాడులకు పాల్పడినట్లు సైబర్ సెక్యూరిటీ ఫోరమ్ తెలిపింది.

పాకిస్థాన్ కేంద్రంగానే ...

గత 10 రోజులుగా జరుగుతోన్న అన్ని సైబర్ దాడులు పాకిస్థాన్ కేంద్రంగానే పురుడుపోసుకున్నాయని సైబర్ సెక్యూరిటీ ఫోరమ్ హెడ్ దేవారజ్ వడియార్ తెలిపారు.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సమస్య అలాగే ఉంది..?

వీటిలో కొన్ని దాడులను సమర్థంగా ఛేదించామని, అయితే ఇంకా చాలా సంస్థలకు సంబంధించి మాత్రం సమస్య అలాగే ఉందని సైబర్ సెక్యూరిటీ ఫోరం చెబుతోంది.

ప్రైవేటు సైబర్ సెక్యూరిటీ సంస్థల ద్వారా...

ఈ సైబర్ దాడులకు సంబంధించిన ఫిర్యాదులను కొన్ని సంస్థలు నేరుగా సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ దృష్టికి తీసుకురాగా, మరికొన్ని సంస్థలు మాత్రం ప్రైవేటు సైబర్ సెక్యూరిటీ సంస్థల ద్వారా కౌన్సిల్ దృష్టికి తీసుకువచ్చాయి.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

భద్రతా కారణాల దృష్ట్యా...

భద్రతా కారణాల దృష్ట్యా దాడులకు గురైన కంపెనీల వివరాలను సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్ వెల్లడించ లేదు.

మొత్తం 2,500 ఐటీ కంపెనీలు

సైబరాబాద్ పరిధిలో మొత్తం 2,500 ఐటీ కంపెనీలు ఉన్నాయి. వాటిలో 1300 పెద్ద కంపెనీలు నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్ వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్ (NASSCOM)లో రిజిస్టర్ అయి ఉన్నాయి.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి ప్రపంచవ్యాప్తంగా..

ఇవి ప్రపంచవ్యాప్తంగా తమ సేవలను అందిస్తుంటాయి. ప్రధానంగా ఈ కంపెనీలకు సంంబంధించిన క్లయింట్లు అమెరికా, యూరోపియన్ దేశాల్లో ఉన్నారు.

proxy సర్వర్స్...

proxy సర్వర్స్ ప్రతి 5 నిమిషాలకు ఒకసారి మారుతుంటాయని, ఈ క్రమంలో ఐపీ అడ్రస్ లు ఆధారంగా తమ ఎథికల్ హ్యాకర్ల బృందం దాడుల చేసిన వారి వివరాలను గుర్తించినట్లు కౌన్సిల్ తెలిపింది. వాళ్లు వాడిన పోర్ట్ ఇంకా నెట్ వర్క్ నోడ్ వివరాలను కూడా రాబట్టగలిగామని కౌన్సిల్ తెలిపింది.

లేటెస్ట్ ట్యాబ్లెట్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సర్జికల్ దాడులకు ప్రతీకారంగా

భారత్ జరిపిన సర్జికల్ దాడులకు ప్రతీకారంగా తాము 7 వేలు భారతీయ వెబ్ సైట్ లను హ్యాక్ చేసినట్లు ప్యాక్ హ్యాకర్లు కొద్ది రోజుల ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది.

రియాద్‌ నుంచి రాన్సమ్‌వేర్‌ దాడులు..

సైబర్ దాడులకు గురైన కంపెనీలు తమ నెట్‌వర్క్ లావాదేవీలు జరగడం లేదని ముందుగా ఈ కంపెనీలు నిపుణులకు తెలిపగా రంగంలోకి దిగిన సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్ రియాద్‌ నుంచి రాన్సమ్‌వేర్‌ దాడులు జరిగినట్లు గుర్తించింది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రూ. 420 కోట్లు చెల్లిస్తే గాని,

ఒక కంపెనీకి చెందిన డేటా మొత్తాన్ని హ్యాకర్లు లాక్ చేసేశారు. దాన్ని అన్‌లాక్ చేయాలంటే దాదాపు రూ. 420 కోట్లు చెల్లించాలని వాళ్లు డిమాండ్ చేశారు. అయితే, ఒకవేళ ఆ మొత్తం వాళ్లకు చెల్లించినా.. మొత్తం సమాచారం వచ్చే అవకాశం తక్కువేనని సైబర్ నిపుణులు చెబుతున్నారు.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Fifty Hyderabad IT firms hit by Pakistani hackers. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot