Online లో మద్యం అమ్మకాలు!!! తొందరపడ్డారో అంతే సంగతులు...

|

కరోనా వైరస్ లేదా కోవైడ్-19 కారణంగా భారత ప్రభుత్వం దేశం మొత్తాన్ని లాక్ డౌన్ లో ఉంచింది. లాక్ డౌన్ కారణంగా అన్ని రకాల షాపులు, షాపింగ్ మాల్స్ , సినిమా థియేటర్లు అన్ని కూడా మూతపడ్డాయి. కొన్ని రోజుల క్రితం కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు దేశంలోని అన్ని ప్రాంతాలను జోన్ల వారిగా విడగొట్టి కొన్ని చోట్ల లాక్ డౌన్ ను ఎత్తివేసింది. దీని కారణంగా కొన్ని జోన్ లలో అన్ని రకాల షాపులు ఓపెన్ అయ్యాయి.

 

ఆన్‌లైన్‌లో మద్యం

ఆన్‌లైన్‌లో మద్యం

ముఖ్యంగా మందు షాపులు ఓపెన్ అవ్వడంతో మందు బాబులకు పండగ వాతావరణం వచ్చింది. ఇదే వారికి కష్టాలకు కూడా గురి చేస్తోంది. మద్యం షాపుల వద్ద జనాలు అధికంగా ఉండడం కారణంగా మద్యం షాపుల వారు ఈ-టోకెన్ విధానాన్ని అమలుచేశారు. దీనిని అదునుగా చేసుకున్న కొందరు మోసగాళ్ళు ఆన్‌లైన్‌లో మద్యంను విక్రయిస్తున్నట్లు మరియు ఇంటి వద్దకు పంపిణి చేస్తున్నట్లు కొన్ని నకిలీ వెబ్‌సైట్‌ల ద్వారా ప్రజలను మోసం చేస్తున్నారు.

ఈ-టోకెన్ డెలివరీ
 

ఈ-టోకెన్ డెలివరీ

ప్రజల ఇంటి వద్ద మద్యం పంపిణీ చేస్తున్నట్లు పేర్కొంటూ నకిలీ వెబ్‌సైట్‌లపై ఎక్సైజ్ విభాగం డీల్లీ పోలీసుల క్రైమ్ బ్రాంచ్‌కు ఫిర్యాదు చేసింది. మూడు రోజుల క్రితం తిరిగి ఓపెన్ అయిన మద్యం షాపుల్లో గందరగోళాన్ని నివారించడానికి డిల్లీ ప్రభుత్వం ఈ-టోకెన్ డెలివరీ విధానాన్ని ప్రకటించిన ఒక రోజు తర్వాత మోసగాళ్లు రెచ్చిపోయి ఈ నకిలీ వెబ్‌సైట్లను చురుకుగా ఉంచుతున్నారు. ఆన్‌లైన్‌లో ఆర్డర్లు ఇచ్చిన చాలా మంది వ్యక్తులు తమకు మద్యం పంపిణీ చేయలేదని లేదా డబ్బులు వాపసు ఇవ్వలేదని పేర్కొంటూ ఎక్సైజ్ విభాగాన్ని సంప్రదించిన తరువాత ఈ ఫిర్యాదు నమోదు చేయబడింది.

 

 

WhatsApp వీడియో కాల్స్ ను Windows PC నుండి చేయడం ఎలా?WhatsApp వీడియో కాల్స్ ను Windows PC నుండి చేయడం ఎలా?

ఎక్సైజ్ ACP

ఎక్సైజ్ ACP

మద్యం సరఫరా చేయడానికి ఎటువంటి వెబ్‌సైట్‌లకు అనుమతి ఇవ్వలేదు అని ACP (ఎక్సైజ్) అలోక్ కుమార్ తెలిపారు. ప్రస్తుత సమయంలో ఎక్కువ రద్దీ ఉన్న షాపుల వద్ద మద్యం ఇ-టోకెన్ల ద్వారా దుకాణాలలో మాత్రమే లభిస్తుంది. ఒకవేళ మీరు ఆన్‌లైన్‌లో ఇటువంటి ఏదైనా వెబ్‌సైట్‌లను చూస్తే కనుక వాటిని ఎటువంటి పరిస్థితులలోను నమ్మవద్దు అని ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నాము. ప్రత్యేకించి ఇంటి వద్దకు మద్యంను పంపిణీ చేస్తామని వాగ్దానం చేస్తున్న వెబ్‌సైట్‌లు 100% నకిలీవి అని తెలిపారు. ఇటువంటి వారు ప్రజల వద్ద నుండి డబ్బులను మోసం చేయడానికి మాత్రమే అని కూడా గుర్తుంచుకోండి.

పోలీసుల కథనం

పోలీసుల కథనం

పోలీసులు తెలిపిన వివరాలలోకి వెళితే "లాక్‌డౌన్డెలివరీక్లబ్" అనే వెబ్‌సైట్ కస్టమర్ యొక్క పేరు మరియు మొబైల్ నంబర్‌ను నమోదు చేసుకున్న తర్వాత రకరకాల ఉత్పత్తులను అందులో ముఖ్యంగా మద్యంను కూడా సరఫరా చేస్తున్నట్లు చూపిస్తున్నది. దీనిని చూసిన చాలా మంది వారికి కావలసిన మద్యం బ్రాండును కొనుగోలు చేయడానికి ఉత్పత్తిపై క్లిక్ చేసిన తరువాత వెబ్‌సైట్ కస్టమర్ ల్యాండింగ్ పేజీకి తీసుకువెళుతోంది. ఇది కొంత సమయం తరువాత క్రాష్ అయ్యింది. వెబ్‌సైట్ నిర్వహణ సమస్యలను ఎదుర్కొంటున్నట్లు పేర్కొంటూ ఒక వ్యక్తి వాట్సాప్ ఆఫర్‌లో బాధితుడిని సంప్రదించాడు. త్వరగా డెలివరీ చేయడానికి UPI కి బదులుగా నెఫ్ట్ ద్వారా చెల్లింపు చేయాలని క్రూక్స్ పట్టుబట్టారు. తరువాత రశీదు నంబర్ జారీ చేయబడింది. పేమెంట్ చేసిన తర్వాత "సరఫరాదారు" ప్రతిస్పందించడం ఆగిపోతుంది.

మోసపోయిన వారు మొత్తంగా

మోసపోయిన వారు మొత్తంగా

డబ్బు బదిలీ చేసిన అకౌంట్ బరాఖంబా రోడ్‌లోని ఒక ప్రైవేట్ బ్యాంకుకు చెందినది. సుమారు 100 మందిని దుండగులు మోసం చేసి ఉండవచ్చని పోలీసుల అంచనా. తమకు వచ్చిన ఫిర్యాదులన్నీ క్రైమ్ బ్రాంచ్ సైబర్‌క్రైమ్ యూనిట్‌కు పంపినట్లు కుమార్ తెలిపారు . వెబ్‌సైట్ నిర్వహించిన ఐపీ చిరునామాను పోలీసులు ట్రాక్ చేస్తున్నారు.

Best Mobiles in India

English summary
Filed a Complaint against Fake websites offering Liquor at Door Delivery

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X