80 శాతానికి పెరిగిన ఆన్‌లైన్‌ ఆదాయపు పన్ను ఐటీ రిటర్స్న్‌

Posted By: Super

80 శాతానికి పెరిగిన ఆన్‌లైన్‌ ఆదాయపు పన్ను ఐటీ రిటర్స్న్‌

బెంగళూరు : 2010-11 ఆర్థిక సంవత్సరంలో ఆదాయపు పన్ను రిటర్న్‌ ఆన్‌ లైన్‌లో 80 శాతం మేర పెరిగి 91.57 లక్షలకు చేరాయి. వచ్చే ఐదేళ్లకు ఆన్‌ లైన్‌లో పన్నుల రిటర్న్‌ దాఖలు చేసే వారి సంఖ్య 7.5 కోట్లకు పెరుగుతుందని ఆన్‌లైన్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు అంచనా వేస్తున్నారు. ఎస్‌ఎన్‌కె ఈ టాక్స్‌ సొల్యూషన్‌ చైర్మన్‌ సంజయ్‌ ఎన్‌ కాపాడియా మాట్లాడుతూ 2010-11 ఆర్థిక సంవత్సరంలో టాక్స్‌ రిటర్న్స్‌ దాఖలు చేసిన వారి సంఖ్య 4.4 కోట్లు కాగా.. అంతకు ముందు ఏడాది 3.40 కోట్ల మందని ఆయన చెప్పారు. 2010-11లో ఆన్‌లైన్‌లో పన్ను రిటర్న్స్‌ దాఖలు చేసిన వారి సంఖ్య 91.57 లక్షలకు కాగా. అంతకు ముందు సంవత్సరం 2009-10లో 51.06 లక్షల మందని ఆయన చెప్పారు. 2015-16 నాటికి దేశంలో పన్ను చెల్లింపుదారులు 10 కోట్ల చేరవచ్చునని వారిలో 7.5 కోట్ల మంది ఆన్‌లైన్‌లోనే చెల్లిస్తారని కాపాడియా చెప్పారు.

ఎస్‌ఎన్‌కె ఈ టాక్స్‌ సొల్యూషన్‌ లిమిటెడ్‌ కంపెనీలకే కాకుండా వ్యక్తిగత పన్ను చెల్లింపులు, కార్పొరేట్‌లకు న్యాయపరమైన సర్వీసులను అందజేస్తుంది. మంగళ వారం నాడు టాక్స్‌సమ్‌.డాట్‌కామ్‌ పోర్టల్‌ను ప్రారంభించింది. అన్నీ కేటగిరీలకు చెందిన ఐటీఆర్‌ 1 నుంచి ఐటీఆర్‌ 6 వరకు అన్నీ భాషలల్లో అందరికీ సులభంగా అర్థమయ్యే రీతిలో ఆన్‌లైన్‌లో టాక్స్‌ రిటర్న్స్‌ దాఖలు చేయవచ్చునని కపాడియా అన్నారు. దేశంలోనే టాక్స్‌సమ్‌.డాట్‌కామ్‌ మొట్టమొదటి టాక్స్‌రిటర్న్‌ పోర్టల్‌ని కాపాడియా అన్నారు. ఆన్‌లైన్‌లో టాక్స్‌ రిటర్న్స్‌ దాఖలు చేసినందుకు ఛార్జీలు కేవలం రూ.189 వసూలు చేస్తున్నట్లు ఆయన చెప్పారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot